logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రేపల్లె నియోజకవర్గ ప్రజలందరికి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు రేపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వార్యాలతో విలసిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాను.. వేడుకలను పురస్కరించుకుని మండపాలు ఏర్పాటు చేసేవారు ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, పెద్ద శబ్దాలు లేకుండా డీజేలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ గణేష్ నవరాత్రుల ఉత్సవాలను పూర్తిగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా, పరస్పర సౌభ్రాతృత్వంతో ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను..

1 day ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•
1 day ago
f1d2466d-1907-4741-a10b-f6ee9c4e3899

రేపల్లె నియోజకవర్గ ప్రజలందరికి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు రేపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వార్యాలతో విలసిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాను.. వేడుకలను పురస్కరించుకుని మండపాలు ఏర్పాటు చేసేవారు ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, పెద్ద శబ్దాలు లేకుండా డీజేలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ గణేష్ నవరాత్రుల ఉత్సవాలను పూర్తిగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా, పరస్పర సౌభ్రాతృత్వంతో ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను..

More news from Bapatla and nearby areas
  • మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వినాయక చవితి సంబరాలు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. రామ్ చరణ్, ఉపాసన, కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్, అందరికీ ఆనందం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న #RC17 వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
    1
    మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో  వినాయక చవితి సంబరాలు
మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. రామ్ చరణ్, ఉపాసన, కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్, అందరికీ ఆనందం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న #RC17 వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    10 hrs ago
  • మైదుకూరు ఆదరణ సేవా సంస్థకు నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026ప్రధానం కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ఆదరణ సేవా సంస్థ వారి సేవలను గుర్తించి కర్ణాటక రాష్ట్రంలోనీ బెంగళూరు పట్టణానికి చెందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026 అవార్డు ప్రముకుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సమాజములో స్వచ్ఛందంగా నిస్వార్ధంలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అభినందిస్తూ వారికి అవార్డు ప్రధానం చేయడం చాలా సంతోషం అని తెలిపారు.అలాగే తమ తల్లి తల్లిదండ్రులకు ,విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు,తన మిత్రులకు , శ్రేయోభిలాషులకు ,దాతలకు ,సంస్థలోని సభ్యులకు ఆదరణ సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
    1
    మైదుకూరు ఆదరణ సేవా సంస్థకు నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026ప్రధానం
కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ఆదరణ సేవా సంస్థ వారి సేవలను గుర్తించి కర్ణాటక రాష్ట్రంలోనీ బెంగళూరు పట్టణానికి చెందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ  సేవా సంస్థ అధ్యక్షుడు  ప్రసన్న కుమార్  నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026 అవార్డు ప్రముకుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఆదరణ  సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సమాజములో స్వచ్ఛందంగా నిస్వార్ధంలో సేవలు అందిస్తున్న  వారిని గుర్తించి అభినందిస్తూ వారికి అవార్డు ప్రధానం చేయడం చాలా సంతోషం అని తెలిపారు.అలాగే తమ తల్లి తల్లిదండ్రులకు ,విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు,తన మిత్రులకు , శ్రేయోభిలాషులకు ,దాతలకు ,సంస్థలోని సభ్యులకు ఆదరణ సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • మచిలీపట్నం మంగినపూడిలో ఘనంగా సాగర తీర విజయ గణపతి ఉత్సవాలు మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నిర్వహిస్తున్న సాగర తీర విజయ గణపతి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించి స్వామివారిని ఆవాహన చేసుకున్నారు. గణపతి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మంగినపూడి సముద్ర తీరంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన విజయ గణపతి ఉత్సవాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. బీచ్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, ప్రసాదాల పంపిణీ, పారిశుధ్యం, భక్తుల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయ గణపతిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.
    1
    మచిలీపట్నం మంగినపూడిలో ఘనంగా సాగర తీర విజయ గణపతి ఉత్సవాలు
మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నిర్వహిస్తున్న సాగర తీర విజయ గణపతి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించి స్వామివారిని ఆవాహన చేసుకున్నారు. గణపతి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
మంగినపూడి సముద్ర తీరంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన విజయ గణపతి ఉత్సవాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. బీచ్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, ప్రసాదాల పంపిణీ, పారిశుధ్యం, భక్తుల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయ గణపతిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థ పై చర్యలు తీసుకోండి. సెలవు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి భద్రత లేకుండా ప్రిన్సిపల్ ఇంటిలో క్లాసులు నిర్వహించిన నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రేపల్లె ఎంఈఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించి ఎంఈఓ కె.సురేష్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రేపల్లె కార్యదర్శి ఎం.సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో సెలవు రోజులలో విద్యాసంస్థలు నిర్వహించవద్దని సంబంధిత విద్యాశాఖ అధికారులు ముందు రోజే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈనెల 12వ తేదీ రెండో శనివారం,స్కూల్ నడపడానికి ప్రయత్నించిన నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంతో ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ ద్వారా ఫోన్లో మాట్లాడించిన, మేము స్కూలు నడపాల్సిందే,మాకు ర్యాంకులే ముఖ్యం అంటు కొంతమంది తల్లిదండ్రులను ఎస్ఎఫ్ఐ నాయకులతో మరియు ఫోన్ లో విద్యాశాఖ అధికారులతో గొడవలకు ప్రేరేపించి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ స్కూల్ నడపడంపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాసంస్థ నడపటానికి ముందస్తు అనుమతులు తీసుకోకుండా గాలి,వెలుతురు, మంచినీళ్లు, టాయిలెట్స్ లాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూలుకి కిలో మీటర్ దూరంలో గురువు రోడ్డులో ఉన్న ప్రిన్సిపల్ ఇంటిలో మరియు మరో రెండు చోట్ల స్కూల్ సిబ్బంది ఇళ్ళ వద్ద క్లాసులు నిర్వహించారు, నిబంధనలకు విరుద్దగా స్కూల్ ప్రారంభంలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ బహిరంగంగా అమ్ముకుని విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేశారు,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగార్జున, ప్రశాంత్,వెంకటేశ్వరరావు,శ్రీకాంత్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు...
    2
    నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థ పై చర్యలు తీసుకోండి.
సెలవు రోజుల్లో  నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి భద్రత లేకుండా ప్రిన్సిపల్ ఇంటిలో క్లాసులు నిర్వహించిన నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రేపల్లె ఎంఈఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించి ఎంఈఓ కె.సురేష్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రేపల్లె కార్యదర్శి ఎం.సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో సెలవు రోజులలో విద్యాసంస్థలు నిర్వహించవద్దని సంబంధిత విద్యాశాఖ అధికారులు ముందు రోజే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈనెల 12వ తేదీ రెండో శనివారం,స్కూల్ నడపడానికి ప్రయత్నించిన నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంతో ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ ద్వారా ఫోన్లో మాట్లాడించిన, మేము స్కూలు నడపాల్సిందే,మాకు ర్యాంకులే ముఖ్యం అంటు కొంతమంది తల్లిదండ్రులను ఎస్ఎఫ్ఐ నాయకులతో మరియు ఫోన్ లో విద్యాశాఖ అధికారులతో గొడవలకు ప్రేరేపించి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ స్కూల్ నడపడంపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాసంస్థ నడపటానికి ముందస్తు అనుమతులు తీసుకోకుండా గాలి,వెలుతురు, మంచినీళ్లు, టాయిలెట్స్ లాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూలుకి కిలో మీటర్ దూరంలో గురువు రోడ్డులో ఉన్న ప్రిన్సిపల్ ఇంటిలో మరియు మరో రెండు చోట్ల స్కూల్ సిబ్బంది ఇళ్ళ వద్ద క్లాసులు నిర్వహించారు, నిబంధనలకు విరుద్దగా స్కూల్ ప్రారంభంలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ బహిరంగంగా అమ్ముకుని విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేశారు,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని  ఎంఈఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగార్జున, ప్రశాంత్,వెంకటేశ్వరరావు,శ్రీకాంత్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు...
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    4 hrs ago
  • లోకేష్ పర్యటన నీ విజయవంతం చేయాలి.. పెడన ఎమ్మెల్యే కాగిత పెడన నియోజకవర్గంలో ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్న కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల TDP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
    1
    లోకేష్ పర్యటన నీ విజయవంతం చేయాలి.. పెడన ఎమ్మెల్యే కాగిత 
పెడన నియోజకవర్గంలో ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్న కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల TDP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
    user_Hareesh Gopu
    Hareesh Gopu
    బంటుమిల్లి, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.
    1
    పల్నాడు జిల్లా..సత్తెనపల్లి 
*సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.*
సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. 
పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. 
నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ  మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.
    user_User3320
    User3320
    నరసరావుపేట, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పాల ధరల పెంపు, నిత్యవసర వస్తువుల ధరల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం నిరసన, ధర్నా పెంచిన పాల ధరలు తగ్గించాలని, నిత్యవసర వస్తువుల ధరలు అరికట్టాలని, రేషన్ డిపోల ద్వారా సరసమైన ధరలకు అన్ని రకాల సరుకులు అందించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కృష్ణలంక , భ్రమరాంబపురంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా జరిగింది.సిపిఎం కార్యకర్తలు, స్థానికులు పాల ప్యాకెట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ బియ్యం మొదలు అన్ని నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు సతమతమవుతుండగా, దానిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి టిడిపి కార్యకర్తల ఆదాయం పెంపు గురించి మాట్లాడటం సిగ్గుచేటని కలెక్టర్ల సమావేశంలో ధరల నియంత్రణకు ఎటువంటి చర్చ, చర్యలు చేపట్టకపోవడం గర్హనీయమన్నారు. విజయ డైరీ (కృష్ణాజిల్లా మిల్క్ యూనియన్) చైర్మన్ ను ప్రభుత్వ పెద్దలు బలవంతంగా రాజీనామా చేయించారు, నేడు చైర్మన్ లేరు, అయినా పండగ రోజు నుండి లీటర్ రెండు రూ.. చొప్పున పాలధర పెంచడం అమానుషం అన్నారు.
    1
    పాల ధరల పెంపు, నిత్యవసర వస్తువుల ధరల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం నిరసన, ధర్నా
పెంచిన పాల ధరలు తగ్గించాలని, నిత్యవసర వస్తువుల ధరలు అరికట్టాలని, రేషన్ డిపోల ద్వారా సరసమైన ధరలకు అన్ని రకాల సరుకులు అందించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కృష్ణలంక , భ్రమరాంబపురంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా జరిగింది.సిపిఎం కార్యకర్తలు, స్థానికులు పాల ప్యాకెట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ బియ్యం మొదలు అన్ని నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు  సతమతమవుతుండగా, దానిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి టిడిపి కార్యకర్తల ఆదాయం పెంపు గురించి మాట్లాడటం సిగ్గుచేటని కలెక్టర్ల సమావేశంలో ధరల నియంత్రణకు ఎటువంటి చర్చ, చర్యలు చేపట్టకపోవడం గర్హనీయమన్నారు. విజయ డైరీ (కృష్ణాజిల్లా మిల్క్ యూనియన్) చైర్మన్ ను ప్రభుత్వ పెద్దలు బలవంతంగా రాజీనామా చేయించారు, నేడు చైర్మన్ లేరు, అయినా పండగ రోజు నుండి లీటర్ రెండు రూ.. చొప్పున పాలధర పెంచడం అమానుషం అన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.
    1
    జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
1,245 గంజాయి మొక్కలు
 విలువ: రూ.1.54 కోట్లు
 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం
ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు  
ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.