logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 👆డైరెక్ట్ ఇంటర్వూస్/ ఆగష్టు 13నా. #shorts #centralgovernment

12 hrs ago
user_Chandraiah Pochampally
Chandraiah Pochampally
Digital Marketing Specialist Bapatla, Andhra Pradesh•
12 hrs ago

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 👆డైరెక్ట్ ఇంటర్వూస్/ ఆగష్టు 13నా. #shorts #centralgovernment

More news from Andhra Pradesh and nearby areas
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 👆డైరెక్ట్ ఇంటర్వూస్/ ఆగష్టు 13నా. #shorts #centralgovernment
    1
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 👆డైరెక్ట్ ఇంటర్వూస్/ ఆగష్టు 13నా. #shorts #centralgovernment
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Bapatla, Andhra Pradesh•
    12 hrs ago
  • జాబ్ మేళా’హాజరు కండి: మౌలానా ముస్తాక్ అహ్మద్ Shot News:(గుంటూరు):నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ (BHF), షార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న (గురువారం) పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు.
    1
    జాబ్ మేళా’హాజరు కండి: మౌలానా ముస్తాక్ అహ్మద్ 
Shot News:(గుంటూరు):నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ (BHF), షార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న (గురువారం)
పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    8 hrs ago
  • హుక్కుం పేట:వై.దారగెడ్డలో 27 మందికి ఉచిత సోలార్ సామాగ్రి పంపిణీ!! హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ వై.దారగెడ్డ గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బుధవారం ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో అర్హత కలిగిన 27 మంది లబ్ధిదారులకు రూఫ్‌టాప్ సోలార్ సామాగ్రిని అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు.సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడంతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
    1
    హుక్కుం పేట:వై.దారగెడ్డలో 27 మందికి ఉచిత సోలార్ సామాగ్రి పంపిణీ!!
హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ వై.దారగెడ్డ గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బుధవారం ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో అర్హత కలిగిన 27 మంది లబ్ధిదారులకు రూఫ్‌టాప్ సోలార్ సామాగ్రిని అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు.సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడంతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
    user_Laxman Regam
    Laxman Regam
    Local News Reporter అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్ ఆసక్తి - వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల గారితో బిహార్ వ్యవసాయశాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా బేటీ - వ్యవసాయంలో సాంకేతికత, ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణపై చర్చించిన ఇరుమంత్రులు - ఆయిల్ పామ్ పై బిహార్ ఆసక్తి.... మకానాపై తెలంగాణ ఆసక్తి - తమ రాష్ట్రంలోను ఆయిల్ పామ్ సాగు అమలుకు పరిశీలిస్తామన్న బిహార్ మంత్రి - త్వరలోనే తెలంగాణకు ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామన్న బిహార్ మంత్రి - ఆయిల్ పామ్ సాగులో అవసరమైన అన్ని సహాయసహకారాలను అందిస్తామన్న మంత్రి తుమ్మల - తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి తుమ్మల - రైతుల కోసం రెండున్నరేళ్లలో 1.30 లక్షల కోట్లు ఖర్చు చేశాము - రైతుబంధు, రైతు భీమా, సన్నాలకు బోనస్ వంటి పథకాల అమలు తీరును వివరించిన మంత్రి తుమ్మల బీహార్ వ్యవసాయశాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్–తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత కార్యక్రమాలు, రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హాకు వివరించారు. వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం, రైస్‌ నేస్తం ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా అనుసంధానం, క్రాప్‌ బుకింగ్‌, శాటిలైట్‌ ఆధారిత పంటల పర్యవేక్షణ, యూరియా బుకింగ్‌ అప్లికేషన్‌, అగ్రిస్టాక్‌ ద్వారా రైతు గుర్తింపు వంటి డిజిటల్‌ కార్యక్రమాలను వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస్‌’ పంటల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పంటల్లో సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లోనే సత్వర చర్యలు చేపట్టడం ద్వారా రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, దిగుబడిని పెంచడం, లాభదాయకతను మెరుగుపర్చే విధానాలను మంత్రి తుమ్మల వివరించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్‌ తదితర కార్యక్రమాల అమలు తీరును బీహార్ మంత్రికి వివరించారు. రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సంవత్సరానికి రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12000 ఇస్తున్నామని తెలిపారు. సన్నాలకు 500 బోనస్ అందిస్తున్నామని, దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణలో వరి, పత్తితో పాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్‌, మామిడి, ఎర్ర మిరప, పసుపు, ఆయిల్‌పామ్‌ తదితర పంటల సాగు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని, 2025-26లో 3.11 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉండగా, 74 వేల మెట్రిక్‌ టన్నుల క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తితో 20.01 శాతం ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో సాధించినట్లు వివరించారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ మిల్లులు, మైక్రో ఇరిగేషన్‌ వంటి మౌలిక సదుపాయాలపై కూడా బీహార్ మంత్రి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో బీహార్‌లో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణ, పంటల క్లస్టర్ల విధానం, సాంకేతిక వినియోగం తదితర అంశాలను బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా తెలంగాణ ప్రతినిధులకు వివరించారు. బీహార్‌లో చిన్న, సన్నకారు రైతులు 91 శాతం ఉండగా, వ్యవసాయంపై ఆధారపడే జనాభా 77 శాతంగా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల వైవిధ్యానికి అనుగుణంగా ప్రత్యేక పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మకానా, మొక్కజొన్న, పండ్లు–కూరగాయలు, తృణధాన్యాల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. దర్భంగా, మధుబని, సీతామర్హి ప్రాంతాల్లో మకానా క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌లో మకానా పంటపై ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల మంత్రి తుమ్మల ఆసక్తి కనబరిచారు. ఇటీవల మకానా ఉత్పత్తి, పరిశోధన, విలువ జోడింపు, మార్కెటింగ్‌, అంతర్జాతీయ అవకాశాలను పెంపొందించేందుకు మకానా బోర్డును ఏర్పాటు చేసినట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. గత పదేళ్లలో మకానా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత 2.5 రెట్లకు పైగా పెరిగినట్లు వివరించారు. ఆయిల్‌పామ్‌పై బీహార్‌ ఆసక్తి.. మకానాపై తెలంగాణ ఆసక్తి: బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు అవకాశాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేయగా, మంత్రి తుమ్మల బీహార్‌లో ప్రత్యేకంగా సాగవుతున్న మకానా పంట, దాని ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలపై ఆసక్తి చూపారు. రెండు రాష్ట్రాల్లో రైతులకు ప్రయోజనం చేకూరే పంటల పరస్పర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి దోహదం చేసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు. ఇందుకోసం ఆయిల్‌పామ్‌ సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీహార్‌ నుంచి వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధుల బృందంతో పాటు రైతుల బృందాన్ని తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ తోటలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, సాగులో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదే విధంగా మకానా సాగు, ప్రాసెసింగ్‌, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బీహార్‌కు పంపిస్తామని తెలిపారు. బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నాటుసామగ్రి, సాగు విధానాలు, మైక్రో ఇరిగేషన్‌, ప్రాసెసింగ్‌ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో రెండు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల వైవిధ్యీకరణ విధానాలను పరస్పరం పంచుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత మెరుగుదల, విలువ జోడింపు, మార్కెట్‌ అవకాశాల విస్తరణకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ–బీహార్‌ మధ్య వ్యవసాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కోఆపరేటీవ్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి మరియు బిహార్ రాష్ట్ర వ్యవసాయశాఖ సెక్రటరీ నర్మదేశ్వర్ లాల్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ముకేష్ కుమార్ లాల్, హార్టికల్చర్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు. అర్బన్ ఫార్మింగ్‌, మిద్దె పంటలతో ఆరోగ్యకరమైన జీవనానికి బాట అర్బన్ ఫార్మింగ్, మిద్దె పంటలు మరియు కిచెన్ గార్డెనింగ్‌ను నగరప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన *అర్బన్ ఫార్మింగ్‌ & కిచెన్‌ గార్డెనింగ్‌ ఎక్స్‌పో–2026* కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నగర ప్రజలకు తాజా ఆహారం, ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కిచెన్‌ గార్డెనింగ్‌కు పెద్ద స్థలం అవసరం లేదని, ఇంటి బాల్కనీ, టెర్రస్‌, ఇంటి ప్రాంగణం వంటి చిన్న ప్రదేశాల్లోనే కుండీలు, గ్రో బ్యాగులు, ఇతర కంటైనర్లలో కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలు, కూరగాయలు, మూలికలను సులభంగా పెంచుకోవచ్చని మంత్రి తెలిపారు. నగరాల్లోని లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లలో కొంత మేరకు ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం ప్రారంభిస్తే దాని సమిష్టి ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుందని అన్నారు. వ్యవసాయం కేవలం వ్యవసాయ క్షేత్రాలకే పరిమితం కాకుండా టెర్రస్‌లు, బాల్కనీలు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థల ప్రాంగణాల్లోనూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర మొక్కలను పెంచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. తాజాగా పండిద్దాం – ఆరోగ్యంగా తిందాం – పచ్చగా జీవిద్దాం అనే సందేశం కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబ జీవన విధానంగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎక్స్‌పోకు వచ్చిన ప్రజలు ఎగ్జిబిటర్లు, నిపుణులతో చర్చించి అర్బన్‌ ఫార్మింగ్‌లోని కొత్త సాంకేతికతలను తెలుసుకుని తమ ఇళ్లు, సంస్థలు, కమ్యూనిటీలలో గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్ ఆసక్తి

- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల గారితో బిహార్ వ్యవసాయశాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా బేటీ

- వ్యవసాయంలో సాంకేతికత, ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణపై చర్చించిన ఇరుమంత్రులు

- ఆయిల్ పామ్ పై బిహార్ ఆసక్తి.... మకానాపై తెలంగాణ ఆసక్తి

- తమ రాష్ట్రంలోను ఆయిల్ పామ్ సాగు అమలుకు పరిశీలిస్తామన్న బిహార్ మంత్రి

- త్వరలోనే తెలంగాణకు ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామన్న బిహార్ మంత్రి

- ఆయిల్ పామ్ సాగులో అవసరమైన అన్ని సహాయసహకారాలను అందిస్తామన్న మంత్రి తుమ్మల

- తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి తుమ్మల

- రైతుల కోసం రెండున్నరేళ్లలో 1.30 లక్షల కోట్లు ఖర్చు చేశాము 

- రైతుబంధు, రైతు భీమా, సన్నాలకు బోనస్ వంటి పథకాల అమలు తీరును వివరించిన మంత్రి తుమ్మల

బీహార్ వ్యవసాయశాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్–తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత కార్యక్రమాలు, రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హాకు వివరించారు. వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం, రైస్‌ నేస్తం ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా అనుసంధానం, క్రాప్‌ బుకింగ్‌, శాటిలైట్‌ ఆధారిత పంటల పర్యవేక్షణ, యూరియా బుకింగ్‌ అప్లికేషన్‌, అగ్రిస్టాక్‌ ద్వారా రైతు గుర్తింపు వంటి డిజిటల్‌ కార్యక్రమాలను వివరించారు.  కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస్‌’ పంటల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పంటల్లో సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లోనే సత్వర చర్యలు చేపట్టడం ద్వారా రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, దిగుబడిని పెంచడం, లాభదాయకతను మెరుగుపర్చే విధానాలను మంత్రి తుమ్మల వివరించారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్‌ తదితర కార్యక్రమాల అమలు తీరును బీహార్ మంత్రికి వివరించారు. రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సంవత్సరానికి రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12000 ఇస్తున్నామని తెలిపారు. సన్నాలకు 500 బోనస్ అందిస్తున్నామని, దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.  

రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణలో వరి, పత్తితో పాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్‌, మామిడి, ఎర్ర మిరప, పసుపు, ఆయిల్‌పామ్‌ తదితర పంటల సాగు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని, 2025-26లో 3.11 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉండగా, 74 వేల మెట్రిక్‌ టన్నుల క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తితో 20.01 శాతం ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో సాధించినట్లు వివరించారు.  తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ మిల్లులు, మైక్రో ఇరిగేషన్‌ వంటి మౌలిక సదుపాయాలపై కూడా బీహార్ మంత్రి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఇదే సమయంలో బీహార్‌లో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణ, పంటల క్లస్టర్ల విధానం, సాంకేతిక వినియోగం తదితర అంశాలను బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా తెలంగాణ ప్రతినిధులకు వివరించారు. బీహార్‌లో చిన్న, సన్నకారు రైతులు 91 శాతం ఉండగా, వ్యవసాయంపై ఆధారపడే జనాభా 77 శాతంగా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల వైవిధ్యానికి అనుగుణంగా ప్రత్యేక పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 

ముఖ్యంగా మకానా, మొక్కజొన్న, పండ్లు–కూరగాయలు, తృణధాన్యాల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. దర్భంగా, మధుబని, సీతామర్హి ప్రాంతాల్లో మకానా క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌లో మకానా పంటపై ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల మంత్రి తుమ్మల ఆసక్తి కనబరిచారు. ఇటీవల మకానా ఉత్పత్తి, పరిశోధన, విలువ జోడింపు, మార్కెటింగ్‌, అంతర్జాతీయ అవకాశాలను పెంపొందించేందుకు మకానా బోర్డును ఏర్పాటు చేసినట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. గత పదేళ్లలో మకానా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత 2.5 రెట్లకు పైగా పెరిగినట్లు వివరించారు. 

ఆయిల్‌పామ్‌పై బీహార్‌ ఆసక్తి.. మకానాపై తెలంగాణ ఆసక్తి:

బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు అవకాశాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేయగా, మంత్రి తుమ్మల బీహార్‌లో ప్రత్యేకంగా సాగవుతున్న మకానా పంట, దాని ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలపై ఆసక్తి చూపారు. రెండు రాష్ట్రాల్లో రైతులకు ప్రయోజనం చేకూరే పంటల పరస్పర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి దోహదం చేసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు.

ఇందుకోసం ఆయిల్‌పామ్‌ సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీహార్‌ నుంచి వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధుల బృందంతో పాటు రైతుల బృందాన్ని తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ తోటలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, సాగులో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదే విధంగా మకానా సాగు, ప్రాసెసింగ్‌, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బీహార్‌కు పంపిస్తామని తెలిపారు.

బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నాటుసామగ్రి, సాగు విధానాలు, మైక్రో ఇరిగేషన్‌, ప్రాసెసింగ్‌ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

వ్యవసాయరంగంలో రెండు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల వైవిధ్యీకరణ విధానాలను పరస్పరం పంచుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత మెరుగుదల, విలువ జోడింపు, మార్కెట్‌ అవకాశాల విస్తరణకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ–బీహార్‌ మధ్య వ్యవసాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కోఆపరేటీవ్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి మరియు బిహార్ రాష్ట్ర వ్యవసాయశాఖ సెక్రటరీ నర్మదేశ్వర్ లాల్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ముకేష్ కుమార్ లాల్, హార్టికల్చర్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.

అర్బన్ ఫార్మింగ్‌, మిద్దె పంటలతో ఆరోగ్యకరమైన జీవనానికి బాట

అర్బన్ ఫార్మింగ్, మిద్దె పంటలు మరియు కిచెన్ గార్డెనింగ్‌ను నగరప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన *అర్బన్ ఫార్మింగ్‌ & కిచెన్‌ గార్డెనింగ్‌ ఎక్స్‌పో–2026* కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నగర ప్రజలకు తాజా ఆహారం, ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. 

కిచెన్‌ గార్డెనింగ్‌కు పెద్ద స్థలం అవసరం లేదని, ఇంటి బాల్కనీ, టెర్రస్‌, ఇంటి ప్రాంగణం వంటి చిన్న ప్రదేశాల్లోనే కుండీలు, గ్రో బ్యాగులు, ఇతర కంటైనర్లలో కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలు, కూరగాయలు, మూలికలను సులభంగా పెంచుకోవచ్చని మంత్రి తెలిపారు. నగరాల్లోని లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లలో కొంత మేరకు ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం ప్రారంభిస్తే దాని సమిష్టి ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుందని అన్నారు. 

వ్యవసాయం కేవలం వ్యవసాయ క్షేత్రాలకే పరిమితం కాకుండా టెర్రస్‌లు, బాల్కనీలు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థల ప్రాంగణాల్లోనూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర మొక్కలను పెంచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు.

తాజాగా పండిద్దాం – ఆరోగ్యంగా తిందాం – పచ్చగా జీవిద్దాం అనే సందేశం కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబ జీవన విధానంగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎక్స్‌పోకు వచ్చిన ప్రజలు ఎగ్జిబిటర్లు, నిపుణులతో చర్చించి అర్బన్‌ ఫార్మింగ్‌లోని కొత్త సాంకేతికతలను తెలుసుకుని తమ ఇళ్లు, సంస్థలు, కమ్యూనిటీలలో గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో రైతు నేస్తం చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • *ఆగస్టు 20న గుంటూరులో ‘BHF మెగా జాబ్ మేళా’హాజరు కండి: BHF* Shot News:(గుంటూరు):నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ (BHF), షార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న (గురువారం) పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.గుంటూరులో భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ ఎం.కె.ఎస్. మొహియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గుళ్ళ మాధవి ఆవిష్కరించారు.
    1
    *ఆగస్టు 20న గుంటూరులో ‘BHF మెగా జాబ్ మేళా’హాజరు కండి: BHF*
Shot News:(గుంటూరు):నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ (BHF), షార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న (గురువారం)
పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.గుంటూరులో భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ ఎం.కె.ఎస్. మొహియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గుళ్ళ మాధవి ఆవిష్కరించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    8 hrs ago
  • రేపల్లె సబ్ జైల్లో తీవ్ర కలకలం, రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం బాపట్ల జిల్లా: రేపల్లె రేపల్లె సబ్ జైలులో తీవ్ర కలకలం రేగింది. సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వి. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒక వృద్ధురాలి హత్య కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి రేపల్లె సబ్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ క్రమంలో, జైలులోని వంటగదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతను తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శ్రీనివాసరావును గమనించిన జైలు సిబ్బంది తక్షణమే స్పందించి, అతడిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తెనాలి ప్రభుత్వ వైద్యశాల వైద్యుల సిఫార్సు మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై జైలు అధికారులు ఫిర్యాదు మేరకు రేపల్లె పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    2
    రేపల్లె సబ్ జైల్లో తీవ్ర కలకలం, రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం 
బాపట్ల జిల్లా: రేపల్లె
రేపల్లె సబ్ జైలులో తీవ్ర కలకలం రేగింది. 
సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వి. శ్రీనివాసరావు అనే వ్యక్తి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఒక వృద్ధురాలి హత్య కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి రేపల్లె సబ్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ క్రమంలో, జైలులోని వంటగదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతను తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
తీవ్ర రక్తస్రావంతో ఉన్న శ్రీనివాసరావును గమనించిన జైలు సిబ్బంది తక్షణమే స్పందించి, అతడిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తెనాలి ప్రభుత్వ వైద్యశాల వైద్యుల సిఫార్సు మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై జైలు అధికారులు ఫిర్యాదు మేరకు రేపల్లె పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.