Shuru
Apke Nagar Ki App…
హుక్కుం పేట:వై.దారగెడ్డలో 27 మందికి ఉచిత సోలార్ సామాగ్రి పంపిణీ!! హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ వై.దారగెడ్డ గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బుధవారం ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో అర్హత కలిగిన 27 మంది లబ్ధిదారులకు రూఫ్‌టాప్ సోలార్ సామాగ్రిని అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు.సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడంతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
Laxman Regam
హుక్కుం పేట:వై.దారగెడ్డలో 27 మందికి ఉచిత సోలార్ సామాగ్రి పంపిణీ!! హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ వై.దారగెడ్డ గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బుధవారం ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో అర్హత కలిగిన 27 మంది లబ్ధిదారులకు రూఫ్‌టాప్ సోలార్ సామాగ్రిని అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు.సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడంతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
More news from Andhra Pradesh and nearby areas
- *ఆగస్టు 20న గుంటూరులో ‘BHF మెగా జాబ్ మేళా’హాజరు కండి: BHF* Shot News:(గుంటూరు):నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ (BHF), షార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న (గురువారం) పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.గుంటూరులో భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ ఎం.కె.ఎస్. మొహియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గుళ్ళ మాధవి ఆవిష్కరించారు.1
- ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు కరప్షన్ కౌంటింగ్ లో బిజీగా ఉన్నాడు... బలగాని పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు ప్రజా పాలనపై కాకుండా వేరే వేరే వాటిలో బిజీగా ఉన్నారని విన్నాను. కరప్షన్ కౌంటింగ్ లో బిజీగా ఉన్నారని మా వాళ్ళు చెప్తుంటే విన్నాను బలగాని. అన్నారు.ఆయన మాట్లాడడం అంటే చాలా సంతోషం.రామాంజనేయులు గెలవంగానే ప్రత్తిపాడు నియోజకవర్గానికి మొదటిగా ఏమి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ వేస్తానన్నారు మరి వేశారా?ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు చూపించండి.అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి.దీన్ని చూసి డెవలప్మెంట్ అనుకోమంటే అనుకుంటాం రామాంజనేయులు కూటం ప్రభుత్వం బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసింది అనుకుంటాం.మీరు చెప్పమంటే మేము కూడా అదే చెప్తాం.ప్రజలు వచ్చి చూశారు అనుకోండి వర్షం పడితే ఈ రోడ్లో ఒక వాహనమైన వెళ్తుందా 100 కోట్లతో నిర్మిస్తున్నది ఆయుష్ ఆస్పటల్ కాదు.రిహాబిడేషన్ యోగ కేంద్రం కింద ఇవ్వడం జరిగింది.ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు ఉపయోగపడే హాస్పటల్ ఉందా?అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఇదే రోడ్డు మీరు వేస్తామన్న రోడ్ లో యాక్సిడెంట్ లో ఎంత మంది చనిపోయారు.అదే ప్రతిపాడు హాస్పిటల్ లో అన్ని ఫెసిలిటీస్ ఉంటే గుంటూరు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా కాకుమాను పెదనందిపాడు పర్చూరు నుండి వచ్చేవారు ప్రతిపాడు హాస్పిటల్ అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు... మార్గమధ్యంలో ఎంత మంది చనిపోతున్నారు ఎంతమంది సిక్ అవుతున్నారు.బేసిక్ నీడ్స్ ఏమైనా ఏర్పాటు చేయగలిగారా.ప్రజలకు కావలసిన విద్య వైద్యం మీరు ప్రాపర్ గా ఇస్తున్నారా?సేమ్ ఫార్ములా చంద్రబాబు లాగా 3d ఫార్ములా చూపిస్తున్నారు.రైతు అనేవాడు బాగున్నాడాపేదవాళ్లకు విద్య అనేది సక్రమంగా అందుతుందా వీటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి... పాలన చేయటం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేస్తున్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీరు వచ్చిన తర్వాత పొడిచింది ఏంటి.కూటమి ప్రభుత్వానికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.1
- * 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు * కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం * పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి * ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది. ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు. ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.2
- అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో క్రీడా పోటీలు నంద్యాల: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యం.డి.ఎన్. రాజా తెలిపారు1
- ముత్తుకూరు ZHC భూములు స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలి. బద్వేలు RDO కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా. బద్వేలు, ఆగస్టు 12: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలోని ZHC భూములను స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘండిమాండ్ చేసింది.బుధవారం బద్వేలు RDO కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగావ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 763 నుండి 809 వరకు ఉన్న ప్రభుత్వ భూములను ఇతర ప్రాంతాల వారికి కేటాయించకుండా, గ్రామంలో నివసిస్తున్నదళితులకేకేటాయించాలన్నారు.సోమశిల నిర్వాసితులైనముత్తుకూరు దళితులు గత 40 సంవత్సరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఆన్‌లైన్ పట్టాలు, రైతు భరోసా సౌకర్యాలు అందలేదని తెలిపారు. కుటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇచ్చి రైతు భరోసా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం RDO చంద్రమోహన్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో ముత్తుకూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, మహేష్, సుబ్బరాయుడు, గురువయ్య, నరసయ్య, లక్ష్మయ్య, ప్రసాదు, రాంబాబుతదితర దళితులు పాల్గొన్నారు.2
- కోవూరులో పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రైతు భూమికి రక్షణ కల్పించడం, రైతు హక్కుకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే భూ సమస్యలను పరిష్కరిస్తామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.3
- నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిషేధిత ఆస్తుల POB/ 22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగా ఎలాంటి భూములను తమ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగిస్తామన్నారు.1