logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

* 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు * కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం * పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి * ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది. ​ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు. ​ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్‌, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

7 hrs ago
user_Syed Rafi
Syed Rafi
Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
d9ef2ae4-1523-407d-8639-3945b917685b

* 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు * కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం * పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి * ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది. ​ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ,

పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు. ​ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్‌, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • * 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు * కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం * పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి * ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది. ​ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు. ​ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్‌, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
    2
    * 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు

* కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం

* పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి
 
* ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ

సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది.
​ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
​అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ  గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు.
​ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్‌, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో క్రీడా పోటీలు నంద్యాల: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యం.డి.ఎన్. రాజా తెలిపారు
    1
    అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో క్రీడా పోటీలు
నంద్యాల: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యం.డి.ఎన్. రాజా తెలిపారు
    user_Shaik abdul mazeed
    Shaik abdul mazeed
    Local News Reporter Nandyal, Andhra Pradesh•
    7 hrs ago
  • ఎమ్మిగనూరు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన వేడుకలు* ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన సందర్భంగా పట్టణ అధ్యక్షులు వాల్మీకి దయాసాగర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని పూలే అంబేద్కర్ సొసైటీ చిన్నపిల్లల అనాధాశ్రమం నందు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కురవబడేసాబ్ గారు పట్టణ సీనియర్ నాయకులు శివదాస్ గారు రవి కిరణ్ గారు, శ్రీ చక్ర నాగరాజు గారు, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు వడ్డే ఉరుకుందు గారు, మల్లికార్జున ఆచారి,19 వార్డ్ ఇంచార్జ్ పట్టణ కోశాధికారి శిల్పి భాస్కర్ గారు, BJYM జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి,BJYM పట్టణ అధ్యక్షులు ఉప్పర బండి రాజేష్ , పట్టణ ప్రధాన కార్యదర్శి చేనేత శివ ,పట్టణ ఉపాధ్యక్షులు కాసిం నాయుడు, వెల్డింగ్ వెంకటేష్ ,వడ్డే బజారి మాల మార్కండేయ గార్లు, పట్టణ నాయకులు వడ్డే పెద్దయ్య, వడ్డే మహేష్, బి రవి కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఎమ్మిగనూరు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో  రాష్ట్ర అధ్యక్షులు  శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన వేడుకలు* 

ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన సందర్భంగా  పట్టణ అధ్యక్షులు వాల్మీకి దయాసాగర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని పూలే అంబేద్కర్ సొసైటీ చిన్నపిల్లల అనాధాశ్రమం నందు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం  చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు కురవబడేసాబ్ గారు పట్టణ సీనియర్ నాయకులు శివదాస్ గారు రవి కిరణ్ గారు, శ్రీ చక్ర నాగరాజు గారు, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు వడ్డే ఉరుకుందు గారు, మల్లికార్జున ఆచారి,19 వార్డ్ ఇంచార్జ్ పట్టణ కోశాధికారి శిల్పి భాస్కర్ గారు, BJYM  జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి,BJYM పట్టణ అధ్యక్షులు ఉప్పర బండి రాజేష్ , పట్టణ ప్రధాన కార్యదర్శి చేనేత శివ ,పట్టణ ఉపాధ్యక్షులు కాసిం నాయుడు, వెల్డింగ్ వెంకటేష్ ,వడ్డే బజారి మాల మార్కండేయ గార్లు, పట్టణ నాయకులు వడ్డే పెద్దయ్య, వడ్డే మహేష్,  బి రవి కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Media company కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • గ్రామపంచాయతీ పాగుంట గ్రామంలో మురికి నీరు తరిపిస్తున్న పరిశుద్యం పాగుంట గ్రామంలో మడుగులను తలపిస్తున్న మురుగు నీరు పాగుంట గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు సాక్షాత్తూ పంచాయతీ కార్యాలయం ముందే నీరు నిలిచినా చూడని అధికారులు గ్రామసభలో విన్నవించినా కరువైన స్పందన.. గ్రామస్థుల ఆగ్రహం .కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో రోడ్లపై నిలిచిన మురుగునీరుతో మడుగును తలపిస్తోంది. మురుగు నీరుకు తోడు ఇటీవల కురిసిన వర్షం నీరు ముందుకు వెళ్లడానికి వీలులేక రోడ్డుపై నిలిచిపో యింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహన దారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. వాహనాలు వెళ్లే సమయంలో సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు పడుతున్నట్టు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజులుగా నీరు ని ల్వ ఉండడంతో దోమలు వృద్ధిచెంది విషజ్వరాలు ప్ర బలే అవకాశమున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు ఫిర్యాదు చేసిన రోడ్లపై నిలిచిన మురుగు నీరు సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలో వార్డు సభ్యులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని గ్రామస్తులు వాపోతున్నారు.రోజులు తరబడి నిల్వ.. విషజ్వరాల భయం ​గత‌కొన్ని రోజులుగా రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో గ్రామంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో చిన్న పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడకముందే పారిశుధ్య పనులు చేపట్టి ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ​రోడ్డుపై నిలిచిన మురుగునీటి సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మండల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామసభలో వార్డు సభ్యులు సైతం ఈ తీవ్రమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    1
    గ్రామపంచాయతీ పాగుంట గ్రామంలో మురికి నీరు తరిపిస్తున్న పరిశుద్యం 
పాగుంట గ్రామంలో మడుగులను తలపిస్తున్న మురుగు నీరు పాగుంట గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తం
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
సాక్షాత్తూ పంచాయతీ కార్యాలయం ముందే నీరు నిలిచినా చూడని అధికారులు
గ్రామసభలో విన్నవించినా కరువైన స్పందన.. గ్రామస్థుల ఆగ్రహం .కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో రోడ్లపై నిలిచిన మురుగునీరుతో మడుగును తలపిస్తోంది. మురుగు నీరుకు తోడు ఇటీవల  కురిసిన వర్షం నీరు ముందుకు వెళ్లడానికి వీలులేక రోడ్డుపై నిలిచిపో యింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహన దారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. వాహనాలు వెళ్లే సమయంలో సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు పడుతున్నట్టు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజులుగా నీరు ని ల్వ ఉండడంతో దోమలు వృద్ధిచెంది విషజ్వరాలు ప్ర బలే అవకాశమున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు ఫిర్యాదు చేసిన రోడ్లపై నిలిచిన మురుగు నీరు  సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలో వార్డు సభ్యులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని గ్రామస్తులు వాపోతున్నారు.రోజులు తరబడి నిల్వ.. విషజ్వరాల భయం
​గత‌కొన్ని రోజులుగా రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో గ్రామంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో చిన్న పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడకముందే పారిశుధ్య పనులు చేపట్టి ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
​రోడ్డుపై నిలిచిన మురుగునీటి సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మండల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  గ్రామసభలో వార్డు సభ్యులు సైతం ఈ తీవ్రమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_Mahammad sami
    Mahammad sami
    Kaloor Thimmandoddi, Jogulamba Gadwal•
    13 hrs ago
  • వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు.... మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు....

మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట
మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • పగిడ్యాలలో రైతన్నకు గుండె కోత పది ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట ఈ ఏడాది వర్షాలు అన్నదాతలకు గుండె కోతలను మిగిల్చాయనే చెప్పాలి. పగిడ్యాలకు చెందిన భాను ప్రసాద్ రెడ్డి పది ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఐదు ఎకరాలు తన సొంత భూమి, ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని రూ.2,50,000 పెట్టుబడి పెట్టానని అయితే సరైన వర్షాలు లేక పంటలలో ఎదుగుదల తీవ్రంగా తగ్గిపోయిందని వాపోయాడు. అధికారులు , ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరాడు.
    1
    పగిడ్యాలలో రైతన్నకు గుండె కోత పది ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట
ఈ ఏడాది వర్షాలు అన్నదాతలకు గుండె కోతలను మిగిల్చాయనే చెప్పాలి. పగిడ్యాలకు చెందిన భాను ప్రసాద్ రెడ్డి పది ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఐదు ఎకరాలు తన సొంత భూమి, ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని రూ.2,50,000 పెట్టుబడి పెట్టానని అయితే సరైన వర్షాలు లేక పంటలలో ఎదుగుదల తీవ్రంగా తగ్గిపోయిందని వాపోయాడు. అధికారులు , ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరాడు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.