వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు.... మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు.... మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
- సత్యసాయి జిల్లా సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో రాత్రి వర్షం కురిసింది రాప్తాడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలం లోని మేడాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం పడింది గత నెల రోజులుగా ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లి పోయినారు ప్రస్తుతం కురిసిన వరుస కొంతమేరకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోంది ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి వర్షం కోసం బోనాలు పట్టారు నీళ్లు పోయడం జరిగింది1
- కేంద్ర ప్రభుత్వంమారితే మార్పుకోసం సాధ్యం. ఎన్నికల హామీలు నేటికీ పరిష్కారం కానందుకే," మార్పు కోసం" సిపిఐ కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఎన్నికల ఒకటి కూడా పరిష్కారం చేయనందుకే మార్పు కోసం సిపిఐ కార్యక్రమం చేపట్టిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్.మహేష్ పేర్కొన్నారు. మార్పు కోసం సిపిఐ పాదయాత్రలో భాగంగా బుధవారం పుంగనూరు ధోబి కాలనీ, మున్సిపల్ వర్కర్స్ కాలనీ లలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు, ప్రతి అకౌంట్లో పది లక్షలు వేస్తామని మోడీ ఇచ్చిన హామీ నెరవేరేందుకు ఈప్రభుత్వం మారాలని ఉధ్యమిస్తున్నామని తెలిపారు.. నిత్యావసర ధరలు, గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగులు, యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇటీవల జరిగిన ఢిల్లీ సంఘటనలే రుజువు చేశాయని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు డాక్టర్ టీ. జనార్ధన్,, ఎం. సాంబశివలు మాట్లాడుతూ రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని,కార్మికుల హక్కులు కాపాడుతామని చెప్పిన ప్రభుత్వం నేడు రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కార్మిక కోడ్ లు కుదింపు వలన కార్మికుల తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం లో ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రైతాంగ,కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17 తేదీ రైతు సమస్యల పైన, 18వ తేదీ కార్మికుల సమస్యల పై చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యల హాజరై జయప్రదం చేయాలని పేర్కొన్నారు.పుంగనూరు పట్టణంలో పలువాడల్లో రోడ్లు, మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేదని మున్సిపల్ యంత్రాంగం సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కోసం త్వరలో ఉద్యమించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ దర్శి, మున్నా, ఎఐటియుసి కార్యదర్శి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరి, ఎఐటియు సి నేతలు దేవా,, తిరుమల, రెడ్డి శేఖర్,సుమన్, పలువురు హమాలి యూనియన్ నేతలు పాల్గొన్నారు.1
- కోవూరులో పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రైతు భూమికి రక్షణ కల్పించడం, రైతు హక్కుకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే భూ సమస్యలను పరిష్కరిస్తామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.3
- కరువు తాండవిస్తున్నా టీటీడీకి వరుణయాగం గుర్తుకురాదా? రెండున్నరేళ్లుగా టిటిడికి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారు విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్నా టిటిడి వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. వేద సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టిటిడి వెంటనే చర్యలు చేపట్టి, ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ కరువు తాండవిస్తున్నా టీటీడీకి వరుణయాగం గుర్తుకురాదా? రెండున్నరేళ్లుగా టిటిడికి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారు విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్నా టిటిడి వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. వేద సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టిటిడి వెంటనే చర్యలు చేపట్టి, ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ చేశారు - భూమన కరుణాకర రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్.1
- వన్యాప్రాణులను వేటాడిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కదిరి ముదిగుబ్బ మండలం దొరిగల్లు రిజర్వ్ అడవిలో అలువ వేటాడి తరలించాడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు రిమాండ్ కి తరలింపు1
- ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల్లో జెండా ఆవిష్కరణ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా"టి.జనార్ధన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా" టి.జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సరిపడా బెడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, భద్రత వంటి కనీస వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు. హాస్టళ్లలో వసతుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోందని, విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.అదేవిధంగా కళాశాలల్లో అర్హత కలిగిన అధ్యాపకులను నియమించడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ సదుపాయాలను మెరుగుపరచడం అవసరమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరారు.ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా విద్యార్థులపై ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల భారం పెంచడం సరికాదన్నారు. ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులు, అనవసరమైన వసూళ్లు, విద్యార్థులపై ఒత్తిడి వంటి సమస్యలను అధికారులు పరిశీలించి నియంత్రించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య హక్కుగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని, పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, ఎఐటియుసి నాయకులు వెంకటరమణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు హసన్ తదితరులు పాల్గొన్నారు.1
- ప్రభుత్వం వలసలను నివారించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వలసల నివారణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు పేర్కొన్నారు. నందికొట్కూరులో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాలు సమృద్ధిగా కురువక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పనులు లేక వలసలు వెళ్తున్నారని, వలసలను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉపాధి పనులు కల్పించి ప్రతీ కుటుంబానికి 200 రోజుల పని దినాలను కల్పించాలని డిమాండ్ చేశారు.1