ముత్తుకూరు ZHC భూములు స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలి. బద్వేలు RDO కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా. బద్వేలు, ఆగస్టు 12: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలోని ZHC భూములను స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘండిమాండ్ చేసింది.బుధవారం బద్వేలు RDO కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగావ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 763 నుండి 809 వరకు ఉన్న ప్రభుత్వ భూములను ఇతర ప్రాంతాల వారికి కేటాయించకుండా, గ్రామంలో నివసిస్తున్నదళితులకేకేటాయించాలన్నారు.సోమశిల నిర్వాసితులైనముత్తుకూరు దళితులు గత 40 సంవత్సరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఆన్‌లైన్ పట్టాలు, రైతు భరోసా సౌకర్యాలు అందలేదని తెలిపారు. కుటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇచ్చి రైతు భరోసా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం RDO చంద్రమోహన్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో ముత్తుకూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, మహేష్, సుబ్బరాయుడు, గురువయ్య, నరసయ్య, లక్ష్మయ్య, ప్రసాదు, రాంబాబుతదితర దళితులు పాల్గొన్నారు.
ముత్తుకూరు ZHC భూములు స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలి. బద్వేలు RDO కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా. బద్వేలు, ఆగస్టు 12: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలోని ZHC భూములను స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘండిమాండ్ చేసింది.బుధవారం బద్వేలు RDO కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగావ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 763 నుండి 809 వరకు ఉన్న ప్రభుత్వ
భూములను ఇతర ప్రాంతాల వారికి కేటాయించకుండా, గ్రామంలో నివసిస్తున్నదళితులకేకేటాయించాలన్నారు.సోమశిల నిర్వాసితులైనముత్తుకూరు దళితులు గత 40 సంవత్సరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఆన్‌లైన్ పట్టాలు, రైతు భరోసా సౌకర్యాలు అందలేదని తెలిపారు. కుటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇచ్చి రైతు భరోసా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం RDO చంద్రమోహన్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో ముత్తుకూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, మహేష్, సుబ్బరాయుడు, గురువయ్య, నరసయ్య, లక్ష్మయ్య, ప్రసాదు, రాంబాబుతదితర దళితులు పాల్గొన్నారు.
- ముత్తుకూరు ZHC భూములు స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలి. బద్వేలు RDO కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా. బద్వేలు, ఆగస్టు 12: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలోని ZHC భూములను స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘండిమాండ్ చేసింది.బుధవారం బద్వేలు RDO కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగావ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 763 నుండి 809 వరకు ఉన్న ప్రభుత్వ భూములను ఇతర ప్రాంతాల వారికి కేటాయించకుండా, గ్రామంలో నివసిస్తున్నదళితులకేకేటాయించాలన్నారు.సోమశిల నిర్వాసితులైనముత్తుకూరు దళితులు గత 40 సంవత్సరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఆన్‌లైన్ పట్టాలు, రైతు భరోసా సౌకర్యాలు అందలేదని తెలిపారు. కుటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇచ్చి రైతు భరోసా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం RDO చంద్రమోహన్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో ముత్తుకూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, మహేష్, సుబ్బరాయుడు, గురువయ్య, నరసయ్య, లక్ష్మయ్య, ప్రసాదు, రాంబాబుతదితర దళితులు పాల్గొన్నారు.2
- అందమైన పాము 🐍 దాని వెనుక డేంజర్ ❌🤢 అందం వెనుక దాగున్న డేంజర్.. ఇలాంటి పామును చూశారా? వరంగల్ జిల్లా పాకాల మండలం అశోక్ నగర్ గ్రామంలో అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పాము ప్రత్యక్షమైంది. నలుపు, పచ్చటి చారలతో అందంగా కనిపించే ఈ సర్పం అత్యంత విషపూరితమైనది. బాండెడ్ క్రేట్గా గుర్తించిన ఈ పాము కాటేస్తే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఆ పామును బంధించి అడవుల్లో విడిచిపెట్టారు. ఈ జాతి పాములు చైనా, నేపాల్, థాయిలాండ్ లాంటి దేశాలలో కనిపిస్తాయి.1
- వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు.... మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.1
- * 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు * కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం * పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి * ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది. ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు. ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.2
- అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో క్రీడా పోటీలు నంద్యాల: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యం.డి.ఎన్. రాజా తెలిపారు1
- అనారోగ్య ఓటరు ఇంటికి వెళ్లి విచారించిన బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు. బద్వేలు, ఆగస్టు 12: ఓటర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహించిన సర్ కార్యక్రమంలో ప్రస్తుతం ఓటు హక్కుకలిగిన వ్యక్తి 2002 ఓటు సమాచారాన్ని అందజేయాలని ఎన్నికల ఆదేశాల మేరకు సమర్పించని వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి ఓటు హక్కు కోల్పోకూడదు అనే దృఢ సంకల్పంతో"సర్" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు మానవత్వం చాటుకున్నారు.బద్వేలు పట్టణంలోని 179 రాజుగారి వీధి పోలింగ్ కేంద్రంలో ఈరోజు ఓటర్లకు సంబంధించిన హియరింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ హియరింగ్‌కు అనారోగ్య కారణాల వల్ల మంచానికే పరిమితమైన ఒక ఓటరు హాజరుకాలేకపోయారు. విషయం తెలుసుకున్న తహశీల్దారు తిరుమల బాబు స్వయంగా ఆ ఓటరు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనారోగ్య కారణాల వల్ల రాలేని ఓటర్లకు సైతం న్యాయం జరిగేలా అధికారే స్వయంగా ఇంటికి వెళ్లి విచారించడం బద్వేలులో ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ సందర్భంగా ఓటరు కుటుంబ సభ్యులు, స్థానికులు తహశీల్దారు చొరవను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. "ప్రభుత్వం, అధికారులు మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని ఓటరు కృతజ్ఞతలు తెలిపారు.1
- పోలీసులపై దౌర్జన్యం.. కత్తితో పొడుస్తానంటూ బెదిరింపులు... శ్రీకాళహస్తిలో కలకలం పోలీసులపై దౌర్జన్యం.. కత్తితో పొడుస్తానంటూ బెదిరింపులు... శ్రీకాళహస్తిలో కలకలం విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై యువకులు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన శ్రీకాళహస్తిలో ఉద్రిక్తతకు దారితీసింది. రైల్వే స్టేషన్‌లో జరిగిన సెల్‌ఫోన్ చోరీపై విచారణకు వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యకు మార్గమధ్యంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన కనిపించింది. క్షతగాత్రులను చూసిన రమణయ్య వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వాహనాల తాళాలు తీసుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని యువకులకు సూచించగా.. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో హెడ్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు "కత్తితో పొడుస్తానంటూ" బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే దౌర్జన్యం జరిగితే.. సామాన్యుల పరిస్థితి ఏంటి..1