కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను సేవా దృక్పథంతో కాకుండా కేవలం వ్యాపారంగా మార్చి, నిరుపేద విద్యార్థులను దోచుకుంటున్నాయని కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ రెండు రోజుల్లోగా ఈ విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్‌వి నేతలు నేడు డీఈవోను కలిశారు. గత రెండు రోజుల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం, ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీకి సంబంధించిన సమగ్ర నివేదికను, అక్రమంగా పుస్తకాలను అమ్ముతున్న గోదాముల వివరాలను, పుస్తకాల నిల్వలకు సంబంధించిన సమగ్ర నివేదికను తయారు చేసి డీఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీని 'విద్య వ్యవస్థల్లో నెలకొన్న సమస్యలు వాటిపై మీ స్పందన' అనే కార్యక్రమం ద్వారా వివరించామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో కనీస వసతులు లేవని, గురుకులాలు నిర్వీర్యం అయ్యాయని, దీంతో ప్రజలు ప్రైవేటు పాఠశాలలపై మొగ్గుచూపాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కొంతమంది అధికారులు పాఠశాల యజమాన్యాలతో మాట్లాడి, అక్రమంగా పుస్తకాలను అమ్ముకోవడానికి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నారని తమకు సమాచారం ఉందని ఆయన ఆరోపించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో డీఈవో తగిన ఆదేశాలు జారీ చేసి అధికారుల ద్వారా చర్యలు తీసుకోకుంటే, బిఆర్ఎస్‌వి ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల పుస్తక గోదాములను ముట్టడిస్తామని అనిల్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఈ ముట్టడి చర్యలు శాంతియుతంగానే ఉంటాయని, మీడియా ప్రతినిధులకు, పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ ఈ గోదాములను ముట్టడిస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు నిజాలను బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ కుమార్ గౌడ్ తో పాటు జిల్లా బిఆర్ఎస్‌వి కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గంగాధర చందు, పటేల్ శ్రవణ్ రెడ్డి, సోమిరెడ్డి రాజా నరేష్ రెడ్డి, వడ్లకొండ పరుశరామ్, విక్రమ్, అన్వేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను సేవా దృక్పథంతో కాకుండా కేవలం వ్యాపారంగా మార్చి, నిరుపేద విద్యార్థులను దోచుకుంటున్నాయని కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ రెండు రోజుల్లోగా ఈ విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్‌వి నేతలు నేడు డీఈవోను కలిశారు. గత రెండు రోజుల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం, ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీకి సంబంధించిన సమగ్ర నివేదికను, అక్రమంగా పుస్తకాలను అమ్ముతున్న గోదాముల వివరాలను, పుస్తకాల నిల్వలకు సంబంధించిన సమగ్ర నివేదికను తయారు చేసి డీఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీని 'విద్య వ్యవస్థల్లో నెలకొన్న సమస్యలు వాటిపై మీ స్పందన' అనే కార్యక్రమం ద్వారా వివరించామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో కనీస వసతులు లేవని, గురుకులాలు నిర్వీర్యం అయ్యాయని, దీంతో ప్రజలు ప్రైవేటు పాఠశాలలపై మొగ్గుచూపాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని,
వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కొంతమంది అధికారులు పాఠశాల యజమాన్యాలతో మాట్లాడి, అక్రమంగా పుస్తకాలను అమ్ముకోవడానికి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నారని తమకు సమాచారం ఉందని ఆయన ఆరోపించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో డీఈవో తగిన ఆదేశాలు జారీ చేసి అధికారుల ద్వారా చర్యలు తీసుకోకుంటే, బిఆర్ఎస్‌వి ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల పుస్తక గోదాములను ముట్టడిస్తామని అనిల్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఈ ముట్టడి చర్యలు శాంతియుతంగానే ఉంటాయని, మీడియా ప్రతినిధులకు, పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ ఈ గోదాములను ముట్టడిస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు నిజాలను బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ కుమార్ గౌడ్ తో పాటు జిల్లా బిఆర్ఎస్‌వి కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గంగాధర చందు, పటేల్ శ్రవణ్ రెడ్డి, సోమిరెడ్డి రాజా నరేష్ రెడ్డి, వడ్లకొండ పరుశరామ్, విక్రమ్, అన్వేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
- కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను సేవా దృక్పథంతో కాకుండా కేవలం వ్యాపారంగా మార్చి, నిరుపేద విద్యార్థులను దోచుకుంటున్నాయని కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ రెండు రోజుల్లోగా ఈ విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్‌వి నేతలు నేడు డీఈవోను కలిశారు. గత రెండు రోజుల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం, ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీకి సంబంధించిన సమగ్ర నివేదికను, అక్రమంగా పుస్తకాలను అమ్ముతున్న గోదాముల వివరాలను, పుస్తకాల నిల్వలకు సంబంధించిన సమగ్ర నివేదికను తయారు చేసి డీఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీని 'విద్య వ్యవస్థల్లో నెలకొన్న సమస్యలు వాటిపై మీ స్పందన' అనే కార్యక్రమం ద్వారా వివరించామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో కనీస వసతులు లేవని, గురుకులాలు నిర్వీర్యం అయ్యాయని, దీంతో ప్రజలు ప్రైవేటు పాఠశాలలపై మొగ్గుచూపాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కొంతమంది అధికారులు పాఠశాల యజమాన్యాలతో మాట్లాడి, అక్రమంగా పుస్తకాలను అమ్ముకోవడానికి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నారని తమకు సమాచారం ఉందని ఆయన ఆరోపించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో డీఈవో తగిన ఆదేశాలు జారీ చేసి అధికారుల ద్వారా చర్యలు తీసుకోకుంటే, బిఆర్ఎస్‌వి ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల పుస్తక గోదాములను ముట్టడిస్తామని అనిల్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఈ ముట్టడి చర్యలు శాంతియుతంగానే ఉంటాయని, మీడియా ప్రతినిధులకు, పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ ఈ గోదాములను ముట్టడిస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు నిజాలను బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ కుమార్ గౌడ్ తో పాటు జిల్లా బిఆర్ఎస్‌వి కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గంగాధర చందు, పటేల్ శ్రవణ్ రెడ్డి, సోమిరెడ్డి రాజా నరేష్ రెడ్డి, వడ్లకొండ పరుశరామ్, విక్రమ్, అన్వేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.2
- భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ బుధవారం కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ జూనియర్ కళాశాలను సర్వే చేసింది. ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎంతోమంది మేధావులను అందించిన సైన్స్ వింగ్ కళాశాల ప్రస్తుతం కనీస వసతులు లేక అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, క్లాస్ రూములు, ల్యాబ్‌లు లేని పరిస్థితి ఉందని, మొత్తం 26 తరగతి గదులు అవసరం ఉండగా, కేవలం 12 రూములతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. పక్కనే ఉన్న పాడుబడిన తరగతి గదుల్లో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఏఈటీ (AET) సబ్జెక్టుకు కనీసం ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఈ విద్యాసంవత్సరంలో నూతన సిలబస్ ప్రవేశపెట్టి, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ల్యాబ్‌లు నిర్వహించాలని చెప్తున్నప్పటికీ, కళాశాలలో మాత్రం ఎలాంటి ల్యాబ్ పరికరాలు లేవని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఈ కళాశాల సమస్యలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులను, విద్యారంగ సమస్యలను పట్టించుకున్న దాఖలాలు రాష్ట్రవ్యాప్తంగా లేవని శ్రీకాంత్ ఆరోపించారు. రోజురోజుకూ విద్యార్థులకు సమస్యలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని ఆయన అన్నారు. ప్రతి ఏటా విద్యారంగానికి కేటాయించే బడ్జెట్‌లో కోతలు వేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని విమర్శించారు. కావున ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సైన్స్ వింగ్ కళాశాలకు ల్యాబ్ పరికరాలను సమకూర్చాలని, మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరింది. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సన్నీ, నరేష్ తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో చిరుత సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేవుని గుట్ట తండాలో ఒక మేకపై చిరుత దాడి చేసింది. మేకల కాపరి అరవడంతో చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది, అయితే ఈ దాడిలో మేక గాయపడింది. చిరుత సంచారంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతుండగా, అటవీశాఖ అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి చిరుత ఆనవాళ్లను గుర్తించారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, పశువులను అటవీ ప్రాంతంలోకి పంపించవద్దని వారికి సూచించారు.4
- బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మండలంలోని భక్తులతో పాటు కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ వెల్లడించారు. గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.1
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి – హలో బీసీ.. చలో భువనగిరి” మహాసభ పోస్టర్‌ను సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదం రజనీకుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షుడు దండు వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జరగనున్న ఈ మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొడూరి శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆరుకల రమేష్, మహిళా పట్టణ అధ్యక్షురాలు బిట్ల జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి నరేందర్, మండల అధ్యక్షుడు మొగిళ్ల బాబు, కొంకటి శ్రీధర్, చెన్నోజి విద్యాసాగర్, దూడం సత్యం, గాంధీబాబు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.3
- జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం గుడిసెలపేట గ్రామంలో బుధవారం ఉదయం ఒక పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో పిచ్చికుక్క ఆరుగురిపై దాడి చేసి గాయపరచగా, వెంటనే బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.1
- జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో మరోసారి భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి సుమారు రెండు గంటలకు పైగా కురిసిన భారీ వర్షం తర్వాత, తాజాగా బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి జన్నారం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో భారీ వర్షం ప్రారంభమైంది. వర్షం కురవడానికి ముందు ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు కొంత ఇబ్బందికి గురయ్యారు. అయితే, తాజాగా కురిసిన ఈ వర్షంతో వాతావరణం చల్లబడింది. దీంతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.1
- భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) శాతవాహన యూనివర్సిటీ ముఖ్య నాయకులు సాయి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన SFI జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. గతంలో రెగ్యులర్‌గా ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను తిరిగి ఆ విధంగానే మార్చాలని SFI నాయకులు నొక్కిచెప్పారు. ఈ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ గా మార్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని, ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అధిక భారం మోపిందని వారు ఆరోపించారు. దీనివల్ల చాలామంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చదువులకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞానానికి పునాది అయిన విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు అసౌకర్యంగా ఉండటం, సమస్యలతో స్వాగతం పలకడం చాలా బాధాకరమని, ఇది రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలపై వివక్ష చూపుతోందనడానికి నిదర్శనమని అరవింద్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఉమేష్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని SFI డిమాండ్ చేసింది. ఈ సమస్యను పట్టించుకోకుండా యథావిధిగా వదిలేస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు బుద్ధి చెప్పే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని, ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతారని కాంపెల్లి అరవింద్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో SFI శాతవాహన యూనివర్సిటీ కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షులు నవీన్, ఓం ప్రకాష్, నాయకులు ప్రశాంత్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.2