వడ్రాణం హరిబాబుపై కొందరు నాతో అసత్య ఆరోపణలు చేయించారు ..... ......ఫిర్యాదుదారుడు బూదల ఏసుదాసు డిసిఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు పై ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బాధితుడు బూదల ఏసుదాసు మీడియా సమక్షంలో స్వచ్ఛందంగా తెలియజేశాడు నన్ను కొంతమంది ప్రలోభాలకు గురిచేసి నేను తల్లిలాగ భావించే నా సంస్థ పైనే నాచేత అసత్య ప్రచార వీడియోలు చేయించారు . నేను అనివార్య కారణాల వలన నేను కొన్ని తప్పులు చేశాను. దానికి పర్యావసరంగా సంస్థ నాపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది . నాపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారన్న బాధలో నేను ఉంటే దానిని కొంతమంది వ్యక్తులు నన్ను ప్రలోభ పెట్టి చైర్మన్ పై అసత్య ప్రచారాలు చేయించారు . ఈ విషయంలో మా పేర్లు బయటికి రాకుండా నీవు చైర్మన్ పై ఆరోపణలు చేయమని ప్రోత్సహించారు . కానీ నేను తప్పు చేశానని భావించి నా మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని నేను స్వయంగా ఈరోజు డీసీఎంఎస్ ఆఫీసులో మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాను . నన్ను బెదిరించి చైర్మన్ పై చెప్పమని అన్నారు. నేను ఏమైనా తప్పులు చెప్పి ఉంటే నన్ను చైర్మన్ గారు దయచేసి క్షమించమని కోరుకుంటున్నాను . నాపై కొందరు వ్యక్తులు ఒత్తిడి తీసుకొని వచ్చి చైర్మన్ పై తప్పుడు ఆరోపణలు చేయించారని ఏసుదాసు అన్నాడు . తమతో ఈ విషయాలు చెప్పించిన వారి పేర్లు బయట పెడితే నన్ను ఇబ్బందులకు గురిచేస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు . తాను వాస్తవ పరిస్థితులను ప్రజలకు మీడియా ద్వారా తెలియచేయాలని ఉద్దేశంతోనే ఈ విషయాలను వెల్లడిస్తున్నానని ఏసుదాసు తెలిపాడు.

- వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.1
- *దాములూరులో విజయవంతంగా ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన సదస్సు* *ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా):* ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ప్రత్యేక ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బి. రాజు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తుల రక్షణ, భద్రత మరియు చైతన్యం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు: సైబర్ క్రైమ్స్: ఆన్‌లైన్ మోసాలు, అపరిచితులతో ఓటిపి (OTP) షేర్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు గుర్తుతెలియని లింకుల (Links) పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈగల్ ఛాలెంజ్: డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడంలోనూ, సైబర్ నేరాల నివారణలోనూ యువత మరియు గ్రామస్తులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు: రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు గొడవలు లేకుండా పూర్తి చేసుకునేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా డిసిపి జి. రామకృష్ణ మాట్లాడుతూ— రాత్రి వేళల్లో పోలీసు అధికారులే స్వయంగా గ్రామంలో ఉంటూ (పల్లె నిద్ర), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం మరియు స్థానిక శాంతిభద్రతలను పర్యవేక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.1
- విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు. నేలకొండపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్ఐ మధు తదితరులు పాల్గొన్నారు.1
- ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ **** ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.1
- రెడ్డి, చౌదరి అనేది కులం కాదు రెడ్డి చౌదరి అనేది కులం కాదు అది పూర్వకాలంలో పన్నులు వసూలు చేసే వారి పేర్లు.ఈ రోజుల్లో రెడ్డి, చౌదరి అని కుల సంఘాలు పెట్టుకొని ఇతరులను చిన్నచూపు చూస్తూ వారి జ్ఞానవంతులని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఈ అజ్ఞానాన్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరు రెడ్డి, చౌదరి తమ పిల్లలకు పేర్లు పెట్టాలి.1