చెత్త నుంచి విజ్ఞాన వెలుగులు పంచిన స్వచ్ఛ రథాలు... స్కూల్స్ నుండి చెత్త సేకరణ చెత్త నుంచి విజ్ఞాన వెలుగులు పంచిన స్వచ్ఛ రథాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాలను క్రమం తప్పకుండా సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణ సాధించాలనే లక్ష్యంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి , పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆలోచనలో భాగంగా ప్రారంభమైన స్వచ్ఛ రథాలు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు 537 పాఠశాలల పరిధిలో, విద్యార్థులు ఘన, ద్రవ వ్యర్థాలను వేరు చేసి ఘన మరియు ద్రవ వనరుల నిర్వహణ (SLRM) కు అనుగుణంగా అందించగా, ఈ కార్యక్రమంలో మొత్తం 576 స్వచ్ఛ రథాలు పాల్గొన్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమంలో భాగంగా, ఒక్క రోజులోనే దాదాపు 1 లక్ష కేజీల చెత్తను స్వచ్ఛ సారథులు సేకరించారు. సేకరించిన వ్యర్థాల ద్వారా సుమారు ₹11.96 లక్షల ఆదాయం లభించనుందని అధికారులు తెలిపారు. అనంతరం, చెత్తను అందించిన విద్యార్థులకు పంచాయతీరాజ్ అధికారులు మరియు స్వచ్ఛ సారథులు కొత్త పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

- ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏1
- Post by వేముల నాగరాజు1
- ములకలకాలువ గ్రామ సభ1
- Post by Ramprasad islavath1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 22వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దడువాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మహాధర్నాకు అధ్యక్షులు వంటేపాక లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమ్మకాయల మార్కెట్ యార్డులో స్థానిక దడువాయులకు తగిన పని అవకాశాలు కల్పించాలని, వారి జీవనోపాధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.3
- సాధారణంగా బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా మందికి అదొక పెద్ద బరువని ‘పోలీసుల కోసమే కదా’ అని నామమాత్రంగా తగిలించుకునే వారు కొందరైతే.. ఇంట్లో మరిచిపోయామని సాకులు చెప్పేవారు మరికొందరు. కానీ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ గీత కార్మికుడు మాత్రం అందరికీ భిన్నం. ప్రాణం విలువ తెలిసిన వాడు కాబట్టే.. గాల్లో ఊగే తాటి చెట్టు మీద కూడా ‘హెల్మెట్’తోనే తన కులవృత్తి చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గండి కమలాకర్ ఒక సాధారణ గీత కార్మికుడు. కులవృత్తిలో భాగంగా రోజుకు వందల అడుగుల ఎత్తు ఉన్న తాటి చెట్లను ఎక్కడం ఆయనకు దినచర్య. అయితే, కమలాకర్ మిగతా వారికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఆయన నడుముకు కల్లు గీసే ముత్తాడు ఉంటే.. తల మీద మాత్రం ధృడమైన హెల్మెట్ ఉంటుంది. గీత కార్మికులు చెట్టు ఎక్కే క్రమంలో ఒక్కోసారి ప్రమాదవశాత్తు జారిపడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు తలకు గాయాలైతే ప్రాణాలకే ముప్పు. అందుకే తన భద్రతను తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు కమలాకర్. బైక్ మీద వెళ్లేటప్పుడే కాదు.. తాను నిత్యం శ్రమించే తాటి చెట్టు మీద కూడా హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నాడు. రోడ్డు మీద వెళ్లే వాహనదారులు హెల్మెట్ బరువుగా ఉందని, చెమట పడుతుందని సాకులు చెబుతుంటే.. మండుటెండలో తాటి చెట్టు ఎక్కుతూ కూడా కమలాకర్ హెల్మెట్ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నా ప్రాణం నా కుటుంబానికి ముఖ్యం.. అందుకే ఈ జాగ్రత్త" అని ఆయన చెబుతున్న మాటలు వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నాయి. 1
- Post by Bondhu Suresh1
- Post by వేముల నాగరాజు1