Shuru
Apke Nagar Ki App…
వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వ విప్ కాలువ సామాగ్రి పంపిణీ రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక వసతి గృహాలలోని విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నాణ్యమైన ట్రంకు పెట్టి, ప్లేట్లు, గ్లాసులు,దుప్పట్లు తదితర సామాగ్రిని ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. కూటమిపాలనలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
PHANI JOURNALIST
వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వ విప్ కాలువ సామాగ్రి పంపిణీ రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక వసతి గృహాలలోని విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నాణ్యమైన ట్రంకు పెట్టి, ప్లేట్లు, గ్లాసులు,దుప్పట్లు తదితర సామాగ్రిని ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. కూటమిపాలనలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాయదుర్గంలో బెస్త కులస్తులు ఆధ్వర్యంలో ఘనంగా వేద మహర్షి జయంతి వేడుకలు రాయదుర్గం పట్టణంలో బుధవారం బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వేద మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 400 మంది బెస్త కులస్తులు నడుమ ఊరేగింపు చేపట్టారు.సీతారాముల కళ్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాయదుర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. ఆయనకు బెస్త సేవా సంఘం నాయకులు, సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి తమ అభినందనలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ బెస్త సమాజం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బెస్త కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ వేద మహర్షి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఐక్యత, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.1
- ఎల్‌నినో కరవు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి -అధికారులకు బిసి సంక్షేమ,చేనేత శాఖ మంత్రి ఆదేశం పుట్టపర్తి :-ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ నందు కరవు నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సంసిద్ధతపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ ,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లే సింధూర రెడ్డి , కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్,ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ... ఎల్‌నినో కరవు పరిస్థితుల ఎదుర్మానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి.సూపర్ ఎల్‌నినో కరవు ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.మంత్రి సవిత అన్ని శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో కరవు పరిస్థితులను ఎదుర్కోవాలి.జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా గ్రామీణ మంచి నీటి సరఫరా (RWS) అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలి. సమస్యాత్మక గ్రామాలను ముందే గుర్తించి, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. చేతిపంపుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.కరవు కాలంలో మూగజీవాలకు పశుగ్రాసం, తాగునీటి కొరత లేకుండా చూసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు సైలేజ్, ఎండుగ్రాసాన్ని అందుబాటులో ఉంచాలి. పశుగ్రాస క్షేత్రాల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద కూలీలకు క్రమం తప్పకుండా పనులు కల్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించేలా ఉపాధి పనులను వేగవంతం చేయాలని, సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో ప్రతివారం గ్రామస్థాయి పరిస్థితులను సమీక్షించుకోవాలి. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రజాఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...* జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత లేదా కరవు పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం మరియు గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు సమగ్ర ప్రణాళికను రూపొందించాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎండ తీవ్రత, భూగర్భ జలాల మట్టాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించాం. బోర్ల రీబోరింగ్, పైప్‌లైన్ మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం చేశాం.కరవు ఉపశమన చర్యల్లో భాగంగా రైతులకు ఉపాధి హామీ పనులు, మూగజీవాలకు పశుగ్రాసం కొరత రాకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.1
- ఆదోనిలో కలుద్దాం..: చిన్నారులకు మంత్రి లోకేశ్ హామీ...! లోకేశ్ సార్.. ఎప్పుడూ మా నాన్న, తాతే మీతో ఫొటో దిగుతున్నారు. నాతో, తమ్మడితోనూ దిగండి. మీరు ఆదోని వస్తున్నారు కదా.. అక్కడికి మమ్మల్నీ పిలుచుకోండి ప్లీజ్' అంటూ ఇద్దరు చిన్నారులు వీడియో ద్వారా మంత్రి నారా లోకేశ్ను కోరారు. చిన్నారుల అమాయక విజ్ఞప్తికి స్పందించిన ఆయన.. 'ఇంత ముద్దైన కోరికను నేను ఎలా కాదనగలను? ఈరోజు ఆదోనిలో మీ ఇద్దరినీ కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నా. అక్కడ కలుద్దాం' అంటూ బదులిచ్చారు.1
- ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి గా కేంద్రం నిధులు రాష్ట్రానికి రావడానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోసిస్తున్న.. మన ధర్మవరం అసెంబ్లీ శాసనసభ్యులు ప్రజా నాయకుడు శ్రీ సత్యకుమార్ అన్నగారికి పోరాటపటిమను మీడియా ముఖంగా ప్రజలకు వివరించిన బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి & బీజేపి SIR రాయలసీమ జోనల్ ఇంచార్జ్ ( జల్లి మధుసూదన్ గారు)1
- ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌కు ఘనంగా భూమిపూజ అభివృద్ధికి కొత్త శ్రీకారం | ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి1
- c.ereddy c.ereddy4
- సమాజంలో అవినీతి పెరిగిపోయింది:ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద సమాజంలో అవినీతి పెరిగిపోయిందని.. ప్రజల్లో చైతన్యం రావాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల రెడ్డి పిలుపునిచ్చారు. కొంతమంది అధికారులు లంచాన్ని హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇవ్వందే ఏపని చేయడం లేదు. నూటికి 95 మంది లంచాలు తీసుకుంటున్నారు. ఏసీబీ అధికారులు ఎక్కడ.. ఈ లంచాలు కనబడటం లేదా.. ఏసీబీ కూడా లంచాలకు అలవాటు పడింది అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.1
- వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వ విప్ కాలువ సామాగ్రి పంపిణీ రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక వసతి గృహాలలోని విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నాణ్యమైన ట్రంకు పెట్టి, ప్లేట్లు, గ్లాసులు,దుప్పట్లు తదితర సామాగ్రిని ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. కూటమిపాలనలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.1