సినిమా చాన్స్ కోసం వచ్చి.. గుండెపోటుతో మృతి సినిమా ల్లో చాన్స్ కోసం వచ్చిన ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందిన ఘటన బంజా రాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరి గింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన వాడపల్లి సంజయ్(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సినిమా రంగంపై ఆసక్తి కలిగిన సంజయ్ హీరోలు చెప్పే డైలాగ్స్ చెబుతూ, పాట లు పాడుతూ ఎప్పటికైనా తాను సిని మాల్లో నటిస్తానంటూ చెప్పేవాడు. కాగా విద్యానగర్ లో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చినప్పుడల్లా ఫిలింనగర్ తో పాటు ఇందిరానగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో అవకాశాల కోసం తిరిగేవాడు. ఈ క్ర మంలో గతనెల 14న అనకాపల్లి నుంచి నగరానికి వచ్చిన సంజయ్ బుధవారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీకి వెళ్లాడు. అక్కడ నేత క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కార్యాల యానికి ఉదయం పదిన్నరకు వెళ్లాడు. ఆఫీసులోకి వెళ్లి వాకబు చేయగా ఆడి షన్స్ గతంలోనే జరిగాయని, ప్రస్తుతం ఏవరినీ తీసుకోవడం లేదని సిబ్బంది చెప్పారు. అక్కడే కుర్చీలో కూర్చున్న సంజయ్ కాసేపటికే కుర్చీలోనే పక్కకు ఒరిగి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నా రు. సినిమా చాన్స్ కోసం అంటూ ఎన్నో ఏళ్లుగా తపిస్తున్న సంజయ్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లప ర్యంతం అయ్యారు.

- ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరు, బోధనలో నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఇళ్లు ఇచ్చారని మండిపడ్డారు. సమస్యలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- సినిమా ల్లో చాన్స్ కోసం వచ్చిన ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందిన ఘటన బంజా రాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరి గింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన వాడపల్లి సంజయ్(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సినిమా రంగంపై ఆసక్తి కలిగిన సంజయ్ హీరోలు చెప్పే డైలాగ్స్ చెబుతూ, పాట లు పాడుతూ ఎప్పటికైనా తాను సిని మాల్లో నటిస్తానంటూ చెప్పేవాడు. కాగా విద్యానగర్ లో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చినప్పుడల్లా ఫిలింనగర్ తో పాటు ఇందిరానగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో అవకాశాల కోసం తిరిగేవాడు. ఈ క్ర మంలో గతనెల 14న అనకాపల్లి నుంచి నగరానికి వచ్చిన సంజయ్ బుధవారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీకి వెళ్లాడు. అక్కడ నేత క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కార్యాల యానికి ఉదయం పదిన్నరకు వెళ్లాడు. ఆఫీసులోకి వెళ్లి వాకబు చేయగా ఆడి షన్స్ గతంలోనే జరిగాయని, ప్రస్తుతం ఏవరినీ తీసుకోవడం లేదని సిబ్బంది చెప్పారు. అక్కడే కుర్చీలో కూర్చున్న సంజయ్ కాసేపటికే కుర్చీలోనే పక్కకు ఒరిగి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నా రు. సినిమా చాన్స్ కోసం అంటూ ఎన్నో ఏళ్లుగా తపిస్తున్న సంజయ్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లప ర్యంతం అయ్యారు.1
- అగ్ని ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండలం ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. గురువారం జన్నారంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో షాట్ సర్క్యూట్స్ తో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గడ్డివాముల వద్ద తాగిన సిగరెట్లు పారి వేయడం, తదితర కారణాలతో అగ్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఈవో రాహుల్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- 244 (A) से असम की जनता को ताकत मिलती है और ये उन्हें फैसले लेने की शक्ति देता है। कांग्रेस और BJP में यही फर्क है। : नेता विपक्ष श्री2
- ఆదిలాబాద్ జిల్లా : తలమడుగు మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా కోసాయి గ్రామంలో గల ప్రసిద్ధి గాంచిన హనుమాన్ ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ప్రతిఏటా నిర్వహించే కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని కబడ్డీ ఆడి అందరిని ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. రావణుడు సీత ను ఎత్తుకొని వెళ్ళినప్పుడు రాముని కోసం లంకను అగ్గి పెట్టిన హనుమంతుని కథను ఎమ్మెల్యే గుర్తుచేశారు. హనుమంతుని ధైర్యం మనతో ఉంటే ఏదైనా సాధ్యమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.1
- సిర్పూర్(టి) గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభ ఉపసర్పంచ్ దుర్గం ప్రశాంత్ ఆందోళనతో అర్ధాంతరంగా ముగిసింది. సమావేశానికి సంబంధిత అధికారులు హాజరు కాకపోవడాన్ని కారణంగా చూపుతూ ఆయన సభను అడ్డుకుని తీవ్రంగా నిలదీశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, పింఛన్లు, ఇతర ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికారులు లేకుండా గ్రామసభ నిర్వహించడం సరికాదని ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో కొంతమంది గ్రామస్తులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్ నాగమణి, ఇతరులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కోరం లేక గ్రామసభను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది.2