Shuru
Apke Nagar Ki App…
అగ్ని ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండలం ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. గురువారం జన్నారంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో షాట్ సర్క్యూట్స్ తో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గడ్డివాముల వద్ద తాగిన సిగరెట్లు పారి వేయడం, తదితర కారణాలతో అగ్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఈవో రాహుల్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
P.G. Murthy
అగ్ని ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండలం ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. గురువారం జన్నారంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో షాట్ సర్క్యూట్స్ తో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గడ్డివాముల వద్ద తాగిన సిగరెట్లు పారి వేయడం, తదితర కారణాలతో అగ్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఈవో రాహుల్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- అగ్ని ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండలం ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. గురువారం జన్నారంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో షాట్ సర్క్యూట్స్ తో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గడ్డివాముల వద్ద తాగిన సిగరెట్లు పారి వేయడం, తదితర కారణాలతో అగ్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఈవో రాహుల్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- సిర్పూర్(టి) గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభ ఉపసర్పంచ్ దుర్గం ప్రశాంత్ ఆందోళనతో అర్ధాంతరంగా ముగిసింది. అధికారుల గైర్హాజరును కారణంగా చూపుతూ సమావేశాన్ని అడ్డుకుని తీవ్రంగా నిలదీశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, పింఛన్లు, ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికారులు లేకుండా సభ నిర్వహించడం సరైందికాదని ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా వార్డు సభ్యులు వాకౌట్ చేయడంతో ప్రజలు కూడా బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్ నాగమణి, అధికారులు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోవడంతో కోరం లేక గ్రామసభను అర్ధాంతరంగా ముగించారు.2
- సినిమా ల్లో చాన్స్ కోసం వచ్చిన ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందిన ఘటన బంజా రాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరి గింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన వాడపల్లి సంజయ్(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సినిమా రంగంపై ఆసక్తి కలిగిన సంజయ్ హీరోలు చెప్పే డైలాగ్స్ చెబుతూ, పాట లు పాడుతూ ఎప్పటికైనా తాను సిని మాల్లో నటిస్తానంటూ చెప్పేవాడు. కాగా విద్యానగర్ లో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చినప్పుడల్లా ఫిలింనగర్ తో పాటు ఇందిరానగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో అవకాశాల కోసం తిరిగేవాడు. ఈ క్ర మంలో గతనెల 14న అనకాపల్లి నుంచి నగరానికి వచ్చిన సంజయ్ బుధవారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీకి వెళ్లాడు. అక్కడ నేత క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కార్యాల యానికి ఉదయం పదిన్నరకు వెళ్లాడు. ఆఫీసులోకి వెళ్లి వాకబు చేయగా ఆడి షన్స్ గతంలోనే జరిగాయని, ప్రస్తుతం ఏవరినీ తీసుకోవడం లేదని సిబ్బంది చెప్పారు. అక్కడే కుర్చీలో కూర్చున్న సంజయ్ కాసేపటికే కుర్చీలోనే పక్కకు ఒరిగి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నా రు. సినిమా చాన్స్ కోసం అంటూ ఎన్నో ఏళ్లుగా తపిస్తున్న సంజయ్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లప ర్యంతం అయ్యారు.1
- నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 24 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. భక్తిశ్రద్ధలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సోన్ పెట్ గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సుమారు 24 లక్షల రూపాయల వ్యయంతో గ్రామస్థులు దాతల సహకారంతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఉదయం నుండే అర్చకులు గణపతి పూజ పుణ్యాహవాచనం హోమాలు ఇతర విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి గ్రామ కమిటీని అభినందించారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక హారతి ఇచ్చి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగడం శుభపరిణామమని, భక్తి మార్గం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకకు సోన్ పెట్ గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జై హనుమాన్ నినాదాలతో సోన్ పెట్ గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు భక్తజనులు బీ.ఆర్.ఎస్. నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ జిల్లా : తలమడుగు మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా కోసాయి గ్రామంలో గల ప్రసిద్ధి గాంచిన హనుమాన్ ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ప్రతిఏటా నిర్వహించే కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని కబడ్డీ ఆడి అందరిని ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. రావణుడు సీత ను ఎత్తుకొని వెళ్ళినప్పుడు రాముని కోసం లంకను అగ్గి పెట్టిన హనుమంతుని కథను ఎమ్మెల్యే గుర్తుచేశారు. హనుమంతుని ధైర్యం మనతో ఉంటే ఏదైనా సాధ్యమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- Assam is all set to bless the BJP-NDA. The energy at Behali says it all!1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది2
- జన్నారం మండలంలోని అన్నిగ్రామాలలో భక్తిశ్రద్ధల మధ్య హనుమాన్ జయంతిని భక్తులు, ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం జన్నారం మండల కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, హనుమాన్, పైడిపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయాలు, వివిధ గ్రామాలలో ఉన్న హనుమాన్ దేవాలయాల్లోని ఆంజనేయస్వామి వారిని వేద పండితులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే భక్తులు కూడా పూజలు చేయిస్తున్నారు. దీంతో అన్ని గ్రామాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.1