logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బేలా మండల కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతం: ‘సంఘట సృజన్ అభియాన్’ సమావేశంలో రచ్చ బేలా: బేలా మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. ‘సంఘట సృజన్ అభియాన్’ నిమిత్తం ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఈ వర్గపోరు బహిర్గతమైంది. వేదికపైకి తమ నాయకులను ఆహ్వానించకపోవడంపై ఒక వర్గానికి చెందిన అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విలాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రకాంత్‌లను వేదికపైకి పిలవకపోవడాన్ని నిరసిస్తూ వారి అనుచరులు నాయకులను నిలదీశారు. దీంతో సమావేశ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా నాయకులు రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఇరువర్గాలు వినకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది

8 hrs ago
user_Jakkula Sujith
Jakkula Sujith
Local News Reporter Adilabad Urban, Telangana•
8 hrs ago

బేలా మండల కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతం: ‘సంఘట సృజన్ అభియాన్’ సమావేశంలో రచ్చ బేలా: బేలా మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. ‘సంఘట సృజన్ అభియాన్’ నిమిత్తం ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఈ వర్గపోరు బహిర్గతమైంది. వేదికపైకి తమ నాయకులను ఆహ్వానించకపోవడంపై ఒక వర్గానికి చెందిన అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విలాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రకాంత్‌లను వేదికపైకి పిలవకపోవడాన్ని నిరసిస్తూ వారి అనుచరులు నాయకులను నిలదీశారు. దీంతో సమావేశ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా నాయకులు రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఇరువర్గాలు వినకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది

More news from Telangana and nearby areas
  • పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరం : శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'సంఘటన్ శ్రీజన్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా బోరాజ్,జైనథ్,బేలా,సాత్నాల మండలాల్లో ఆదివారం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15లోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐక్యత, క్రమశిక్షణ,సమిష్టి కృషితోనే పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. నూతన కమిటీల ఏర్పాటులో వర్గ విభేదాలకు తావివ్వకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. సామాజిక న్యాయం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గీమ్మ సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ పటేల్, గీమ్మ దీపక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మల్యాల కరుణాకర్, అక్తర్ అలీ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు బెజ్జంకి అనిల్, బోరాజ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, జైనథ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం జగదీశ్వర్ రెడ్డి, బేలా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రూపీరావు, సాత్నాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కినక బాపురావుతో పాటు ఎస్సీ సెల్, మైనారిటీ సెల్, కిసాన్ సెల్, బీసీ సెల్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరం : శ్రీకాంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'సంఘటన్ శ్రీజన్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా బోరాజ్,జైనథ్,బేలా,సాత్నాల మండలాల్లో ఆదివారం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15లోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐక్యత, క్రమశిక్షణ,సమిష్టి కృషితోనే పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. నూతన కమిటీల ఏర్పాటులో వర్గ విభేదాలకు తావివ్వకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. సామాజిక న్యాయం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గీమ్మ సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ పటేల్, గీమ్మ దీపక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మల్యాల కరుణాకర్, అక్తర్ అలీ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు బెజ్జంకి అనిల్, బోరాజ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, జైనథ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం జగదీశ్వర్ రెడ్డి, బేలా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రూపీరావు, సాత్నాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కినక బాపురావుతో పాటు ఎస్సీ సెల్, మైనారిటీ సెల్, కిసాన్ సెల్, బీసీ సెల్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    1 hr ago
  • బేలా మండల కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతం: ‘సంఘట సృజన్ అభియాన్’ సమావేశంలో రచ్చ బేలా: బేలా మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. ‘సంఘట సృజన్ అభియాన్’ నిమిత్తం ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఈ వర్గపోరు బహిర్గతమైంది. వేదికపైకి తమ నాయకులను ఆహ్వానించకపోవడంపై ఒక వర్గానికి చెందిన అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విలాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రకాంత్‌లను వేదికపైకి పిలవకపోవడాన్ని నిరసిస్తూ వారి అనుచరులు నాయకులను నిలదీశారు. దీంతో సమావేశ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా నాయకులు రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఇరువర్గాలు వినకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది
    1
    బేలా మండల కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతం: ‘సంఘట సృజన్ అభియాన్’ సమావేశంలో రచ్చ
బేలా: బేలా మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. ‘సంఘట సృజన్ అభియాన్’ నిమిత్తం ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఈ వర్గపోరు బహిర్గతమైంది.
వేదికపైకి తమ నాయకులను ఆహ్వానించకపోవడంపై ఒక వర్గానికి చెందిన అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విలాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రకాంత్‌లను వేదికపైకి పిలవకపోవడాన్ని నిరసిస్తూ వారి అనుచరులు నాయకులను నిలదీశారు.
దీంతో సమావేశ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా నాయకులు రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఇరువర్గాలు వినకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    8 hrs ago
  • संत शिरोमणि गुरु रविदास जी की 650वीं पावन जयंती के उपलक्ष्य में चलाया जा रहा *'समरसता संकल्प अभियान'* अब देशभर में जनआंदोलन का स्वरूप ले चुका है। वाराणसी में उनकी जन्मस्थलि से प्रारंभ हुई पावन कलश यात्रा पंजाब, राजस्थान, मध्य प्रदेश सहित अनेक राज्यों तक पहुँच चुकी है, जहाँ भव्य कलश यात्राओं, सत्संगों और सामाजिक समरसता कार्यक्रमों के माध्यम से गुरु जी की अमर शिक्षाओं का व्यापक प्रसार हो रहा है। *समानता, सामाजिक समरसता, आपसी प्रेम, मानव सेवा और भाईचारे का उनका संदेश आज पूरे राष्ट्र को एकता के सूत्र में बाँधने का कार्य कर रहा है। 🙏🚩*
    1
    संत शिरोमणि गुरु रविदास जी की 650वीं पावन जयंती के उपलक्ष्य में चलाया जा रहा
*'समरसता संकल्प अभियान'* अब देशभर में जनआंदोलन का स्वरूप ले चुका है। 
वाराणसी में उनकी जन्मस्थलि से प्रारंभ हुई पावन कलश यात्रा पंजाब, राजस्थान, मध्य प्रदेश सहित अनेक राज्यों तक पहुँच चुकी है, जहाँ भव्य कलश यात्राओं, सत्संगों और सामाजिक समरसता कार्यक्रमों के माध्यम से गुरु जी की अमर शिक्षाओं का व्यापक प्रसार हो रहा है।
*समानता, सामाजिक समरसता, आपसी प्रेम, मानव सेवा और भाईचारे का उनका संदेश आज पूरे राष्ट्र को एकता के सूत्र में बाँधने का कार्य कर रहा है। 🙏🚩*
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    12 hrs ago
  • ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా నాయకులు అమ్మవారిని వేడుకున్నారు.
    1
    ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా నాయకులు అమ్మవారిని వేడుకున్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • వాహనదారుల ఇక్కట్లు తీరుస్తున్న యువకుడు సుకరి చందు.. శభాష్ అంటున్న ఇరు గ్రామాల ప్రజలు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అని ఎదురు చూడకుండా తన సొంత ఖర్చుతో రోడ్డును బాగు చేస్తున్నాడు వైకుంఠ పూర్ గ్రామవాసి సుకరి చందు.వంజర్ నుండి వానల్పాడు వెళ్లే రహదారి మొత్తం పాడైపోయి అధ్వాన్నంగా తయారయ్యింది. ఈ సమస్యను ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని చందు వాపోయాడు.దీంతో తన సొంత ఖర్చులతో మొరం తెప్పించుకొని గుంతలు ఏర్పడ్డ చోట మొరం పోసి బాగు చేస్తున్నాడు. ఈ విషయాన్ని విన్న పలువురు వాహనదారులు, ఇరు గ్రామాల ప్రజలు సుంకర చెందును శభాష్ అంటున్నారు.
    1
    వాహనదారుల ఇక్కట్లు తీరుస్తున్న యువకుడు సుకరి చందు.. శభాష్ అంటున్న ఇరు గ్రామాల ప్రజలు
ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అని ఎదురు చూడకుండా తన సొంత ఖర్చుతో రోడ్డును బాగు చేస్తున్నాడు వైకుంఠ పూర్ గ్రామవాసి సుకరి చందు.వంజర్ నుండి వానల్పాడు వెళ్లే రహదారి మొత్తం పాడైపోయి అధ్వాన్నంగా తయారయ్యింది. ఈ సమస్యను ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని చందు వాపోయాడు.దీంతో తన సొంత ఖర్చులతో మొరం తెప్పించుకొని గుంతలు ఏర్పడ్డ చోట మొరం పోసి బాగు చేస్తున్నాడు. ఈ విషయాన్ని విన్న పలువురు వాహనదారులు, ఇరు గ్రామాల ప్రజలు సుంకర చెందును శభాష్ అంటున్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • సదర్మార్ట్ ఆయకట్టుకు నీరు అందించండి నారుమల్లు సిద్ధం చేసుకుంటున్న ఆయకట్టు రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని సదర్ మార్ట్ రైతాంగానికి నీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు బ్రోకపోవడంతో పంట సాగుకు ఆలస్యం అవుతుందని ప్రస్తుతం ఆయకట్టుకు సరిపోయి నీరు ప్రాజెక్టులో నిల్వ ఉందని అన్నారు నీటిని విడుదల చేస్తే సాగు పనులు చేసుకుంటామని రైతులు కోరారు ఇటీవల కురిసిన వర్షంతో ఆయకట్టు యువ ప్రాంతంలో రైతులు నారుమడులను సిద్ధం చేసి నాట్లు పోసుకుంటున్నారు
    1
    సదర్మార్ట్ ఆయకట్టుకు నీరు అందించండి
నారుమల్లు సిద్ధం చేసుకుంటున్న ఆయకట్టు రైతంగం
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని సదర్ మార్ట్ రైతాంగానికి నీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు బ్రోకపోవడంతో పంట సాగుకు ఆలస్యం అవుతుందని ప్రస్తుతం ఆయకట్టుకు సరిపోయి నీరు ప్రాజెక్టులో నిల్వ ఉందని అన్నారు నీటిని విడుదల చేస్తే సాగు పనులు చేసుకుంటామని రైతులు కోరారు ఇటీవల కురిసిన వర్షంతో ఆయకట్టు యువ ప్రాంతంలో రైతులు నారుమడులను సిద్ధం చేసి నాట్లు పోసుకుంటున్నారు
    user_Dasari krishna murthy
    Dasari krishna murthy
    ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    16 hrs ago
  • అటవీ అధికారుల తీరులో అసలు మార్పు రావడం లేదు: ఎమ్మెల్యే ఆగ్రహం తాను చాలాసార్లు చెప్పినా అడవి అధికారుల తీరు మారడం లేదని ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసుల ఆందోళన నేపథ్యంలో ఆదివారం రాత్రి అటవీశాఖ ఉన్నతాధికారి శాంతారామ్ తో ఐటిడిఏపిఓ మకరందు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడారు. అటవీ అధికారుల తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఆదివాసులను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన అటవీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    అటవీ అధికారుల తీరులో అసలు మార్పు రావడం లేదు: ఎమ్మెల్యే ఆగ్రహం
తాను చాలాసార్లు చెప్పినా అడవి అధికారుల తీరు మారడం లేదని ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసుల ఆందోళన నేపథ్యంలో ఆదివారం రాత్రి అటవీశాఖ ఉన్నతాధికారి శాంతారామ్ తో ఐటిడిఏపిఓ మకరందు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడారు. అటవీ అధికారుల తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఆదివాసులను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన అటవీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • *ड्रग्स के खिलाफ निर्णायक लड़ाई…* देखिए, कैसे मोदी सरकार ड्रग्स के खिलाफ मिशन मोड में कार्रवाई करते हुए युवाओं को नशे से मुक्त भारत की ओर ले जाने के लिए लगातार प्रयास कर रही है।
    1
    *ड्रग्स के खिलाफ निर्णायक लड़ाई…*

देखिए, कैसे मोदी सरकार ड्रग्स के खिलाफ मिशन मोड में
कार्रवाई करते हुए युवाओं को नशे से मुक्त भारत की ओर ले जाने के लिए लगातार प्रयास कर रही है।
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.