అరకు: డ్రోన్ సహాకారంతో విత్తన బంతులు జల్లుతున్న అటవీ శాఖ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, అటవీశాఖ అధికారుల ఆదేశాలతో అరకు అటవీ రేంజ్ పరిదిలో గుర్తించిన డీ గ్రేడెడ్ భూములలో పచ్చదనం పెంచడానికి 1.50 లక్షల సీడ్ బాల్స్ జల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు FRO కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు అటవీ శాఖ సిబ్బంది, స్ధానిక ప్రజా ప్రతినిధులు, యువత సహకారంతో గుర్తించిన డీ గ్రేడెడ్ భూములలో 50 వేల విత్తన బంతులను విసరడం జరిగిందన్నారు. మిగిలిన 1 లక్ష విత్తన బంతులను డ్రోన్ సహాకారం వెదజల్లనున్నట్లు ఎఫ్ఆర్ఓ పేర్కొన్నారు. శనివారం అరకులోయ మండలం, శిరగం పంచాయితీ, లంతంపాడు కొండల్లో డ్రోన్ సహకారంతో విత్తన బంతులను విసిరే ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, యువత, పెద్దలు పాల్గొన్నారు.
అరకు: డ్రోన్ సహాకారంతో విత్తన బంతులు జల్లుతున్న అటవీ శాఖ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, అటవీశాఖ అధికారుల ఆదేశాలతో అరకు అటవీ రేంజ్ పరిదిలో గుర్తించిన డీ గ్రేడెడ్ భూములలో పచ్చదనం పెంచడానికి 1.50 లక్షల సీడ్ బాల్స్ జల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు FRO కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు అటవీ శాఖ సిబ్బంది, స్ధానిక ప్రజా ప్రతినిధులు, యువత సహకారంతో గుర్తించిన డీ గ్రేడెడ్ భూములలో 50 వేల విత్తన బంతులను విసరడం జరిగిందన్నారు. మిగిలిన 1 లక్ష విత్తన బంతులను డ్రోన్ సహాకారం వెదజల్లనున్నట్లు ఎఫ్ఆర్ఓ పేర్కొన్నారు. శనివారం అరకులోయ మండలం, శిరగం పంచాయితీ, లంతంపాడు కొండల్లో డ్రోన్ సహకారంతో విత్తన బంతులను విసిరే ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, యువత, పెద్దలు పాల్గొన్నారు.
- శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న తలుపులమ్మ భక్తుల రద్దీతో కళకళలాడుతున్న ఆలయం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ ఆలయంలో ఆషాడమాస ఆదివారం కావడంతో ఇసక వేస్తే రాలని విధంగా వేకువ జాము నుండి వాహనాల్లో భక్తలు లక్షలాదిగా లోవ క్షేత్రానికి చేరుకున్నారు. అమ్మవారిని శాకంబరీ దేవి అలంకరణలో అలంకరించారు. మూలవిరాట్ ఉత్సవ మూర్తులను శాకంబరి అలంకరణలో అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు. బీరకాయ, వంకాయ, బెండకాయ ,టమాటా, బంగాళదుంప, కాకరకాయ, చామదుంపలు, పొట్లకాయలు ఇలా ఎన్నో రకాల కూరగాయలతో పాటు పండ్ల మధ్య దేదీప్యమానంగా కొండ గృహలో దర్శనమిస్తున్న అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు. అమ్మవారి దర్శనం ఒక ఎత్తైతే ఇదే అటవీ ప్రాంతంలో కుటుంబాల సమేతంగా భక్తులు వంటావార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరించారు, ఏది ఏమైనా లోవక్షేత్రం భక్తజన సందోహంతో ఈ ఆదివారం దర్శనమిచ్చింది .1
- హృదయపూర్వక నమస్కారములు 🙏 గురు పూర్ణిమ మహోత్సవానికి వేలాది మంది సాయిభక్తులు విచ్చేసినప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రమశిక్షణతో, సహనంతో, పరస్పర సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి సాయిభక్తునికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించడానికి బలంగా నిలిచింది. శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్ 🙏 – దువ్వాడ శ్రీధర్ బాబా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం శివాజీనగర్, పలాస1
- బిహారీలకు ఏదైనా సాధ్యమే….🐊* ఏకంగా మొసలినే మడతపెట్టేశాడు! బిహార్లో ఓ రైతు మొసలిని తాళ్లతో కట్టేసి భుజాలపై వేసుకొని వెళ్తున్న వీడియో వైరలవుతోంది. అమిత్ కుమార్ తన పొలంలో మొసలి కనిపించగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది లేకపోవడంతో అతడే దాన్ని తాళ్లతో బంధించి మోసుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. తర్వాత అటవీ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకొని నదిలో వదిలేశారు. బిహారీలకు ఏదైనా సాధ్యమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.1
- July in frames ✨ Farmers. Students. Youth. Women. From fields to protests to charity to empowerment - Grateful for this month of listening, learning, and connecting across every section and age group.1
- వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వైరా లో ఘనంగా బోనాల జాతర ఖమ్మం జిల్లా వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు1
- రేపటి బీసీ ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ముగింపు – టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న ప్రజలకు నాణ్యమైన, సమానమైన మరియు ఉచిత విద్యను అందించడం లక్ష్యంగా రాబోయే బీసీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీఆర్పీ చీఫ్ తెలిపారు. ప్రస్తుత ప్రైవేట్ విద్యా వ్యవస్థ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బలమైన విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను అమలు చేసి, విద్యను వ్యాపారం కాకుండా ప్రతి విద్యార్థి హక్కుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యలో అసమానతలను తొలగించి, ప్రభుత్వ విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అవసరం లేకుండా చేసే విధానాన్ని అమలు చేస్తామని టీఆర్పీ చీఫ్ తెలిపారు.1
- పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఘనంగా నివాళులు మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఆకూరి శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ భారత జాతీయ జెండా రూపకల్పనలో పింగళి వెంకయ్య చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. యువత పింగళి వెంకయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లంకిశెట్టి బాలాజీ, చిలకలపూడి ఎస్సై యేసుబాబు, పెద్దిరాజులు, చందమామ బాబు తదితరులు పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి, విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలాపనతో గౌరవప్రదంగా ముగిసింది.1
- విద్యార్ధుల రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులు.... హైదరాబాద్‌లోని చంపాపేట్ ఉన్న Aira Junior College విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగారు. స్థానికులు Dial 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఘర్షణకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1