హిందువుల్లో ఐక్యత పెరుగుతుంది * భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీక హనుమంతుడు... * అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా.. ఇందూరు: హిందువుల్లో ఐక్యత పెరుగుతుందని, మరింత పెరగాల్సిన అవసరం ఇందూరు: హిందువుల్లో ఐక్యత పెరుగుతుందని, మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ గురువారం నిర్వహించిన వీర హనుమాన్ విజయాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీకైన ఆంజనేయస్వామి మనందరికీ స్ఫూర్తి అన్నారు. ఆయన జీవితం గొప్ప పాఠం చెబుతుందని, సంకల్పం ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదన్నారు. శ్రీరాముడు సేవలో హనుమంతుడు చూపిన అంకితభావం, నిజాయితీ, ధైర్యం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమన్నారు. ఇవే విలువలు మన సమాజానికి అత్యంత అవసరమని తెలిపారు. హనుమంతుడి శక్తి అంటే కేవలం శారీరక బలం కాదని, మనోబలం, విశ్వాసం, సేవా భావమని కొనియాడారు. ఇది ఒక పండుగ మాత్రమే కాదని, మనలోని శక్తిని మేల్కొలిపే రోజన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి రవికుమార్, విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ రాకూర్, ప్రధాన కార్యదర్శి దయానంద్, దుర్గా వాహిని ప్రముఖ్ సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.
హిందువుల్లో ఐక్యత పెరుగుతుంది * భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీక హనుమంతుడు... * అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా.. ఇందూరు: హిందువుల్లో ఐక్యత పెరుగుతుందని, మరింత పెరగాల్సిన అవసరం ఇందూరు: హిందువుల్లో ఐక్యత పెరుగుతుందని, మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ గురువారం నిర్వహించిన వీర హనుమాన్ విజయాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీకైన ఆంజనేయస్వామి మనందరికీ స్ఫూర్తి అన్నారు. ఆయన జీవితం గొప్ప పాఠం చెబుతుందని, సంకల్పం ఉంటే అసాధ్యం అనేది
ఏదీ లేదన్నారు. శ్రీరాముడు సేవలో హనుమంతుడు చూపిన అంకితభావం, నిజాయితీ, ధైర్యం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమన్నారు. ఇవే విలువలు మన సమాజానికి అత్యంత అవసరమని తెలిపారు. హనుమంతుడి శక్తి అంటే కేవలం శారీరక బలం కాదని, మనోబలం, విశ్వాసం, సేవా భావమని కొనియాడారు. ఇది ఒక పండుగ మాత్రమే కాదని, మనలోని శక్తిని మేల్కొలిపే రోజన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి రవికుమార్, విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ రాకూర్, ప్రధాన కార్యదర్శి దయానంద్, దుర్గా వాహిని ప్రముఖ్ సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోడ రాజు తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఆ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురికి నీటి ప్రవాహంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కౌన్సిలర్ రాజు శనివారం జెసిపి సహాయంతో రోడ్డు పక్కన కాలువను తవ్వించి తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఇరిగేషన్ కెనాల్లో పూడికను తీయించారు. దీంతో స్థానికులు కౌన్సిలర్ రాజును అభినందించారు.1
- ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు1
- Puducherry has decided to re-elect the NDA Government. Here are some special moments from yesterday’s roadshow.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు4
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి APM ప్రసాద్ సీసీ భూమయ్య, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.1
- జన్నారం మండలంలోని పోనకల్ గ్రామంలో రన్ ఫర్ జీసస్( యేసు కొరకే పరుగు) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థానం సందర్భంగా జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులు శనివారం ఉదయం జన్నారంలోని బస్టాండ్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ యూత్ సభ్యులు మంద రాజేష్ పాల్గొన్నారు.1
- బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. లాఠీ ఛార్జ్ చేయగా స్వల్పంగా గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్.1