logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏసీపీ కార్యాలయంపై దాడి చేసిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం భారీగా మోహరించిన పోలీసులు

2 hrs ago
user_KOTAMARTHI HANUMANTHU
KOTAMARTHI HANUMANTHU
Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
2 hrs ago

ఏసీపీ కార్యాలయంపై దాడి చేసిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం భారీగా మోహరించిన పోలీసులు

More news from తెలంగాణ and nearby areas
  • ఆలయ భూముల రక్షణకై ఆమరణ నిరాహార దీక్ష :మహా రుద్రసేన వ్యవస్థాపకులు కొండా చరణ్ చర్ల మండలంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణ దారుల నుండి స్వాధీన పరుచుకోవాలి అక్రమ కట్టడాలను కూల్చివేయాలి దేవాలయానికి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నీచులను చట్టపరంగా శిక్షించాలి అక్రమంగా నిర్మించిన ఇళ్లకు ఇచ్చిన కరెంటు మీటర్లను రద్దు చేసి తొలగించాలి రెండు సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించకుండా హిందూవుల మనోభావాలను దెబ్బతీసిన స్థానిక చర్ల ఎమ్మార్వో హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి
    1
    ఆలయ భూముల రక్షణకై ఆమరణ నిరాహార దీక్ష :మహా రుద్రసేన వ్యవస్థాపకులు కొండా చరణ్
చర్ల మండలంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణ దారుల నుండి స్వాధీన పరుచుకోవాలి
అక్రమ కట్టడాలను కూల్చివేయాలి 
దేవాలయానికి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నీచులను చట్టపరంగా శిక్షించాలి 
అక్రమంగా నిర్మించిన ఇళ్లకు ఇచ్చిన కరెంటు మీటర్లను రద్దు చేసి తొలగించాలి 
రెండు సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించకుండా హిందూవుల మనోభావాలను దెబ్బతీసిన స్థానిక చర్ల ఎమ్మార్వో హిందూ సమాజానికి  క్షమాపణలు చెప్పాలి
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను. కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది. వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను. కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది. వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.
    1
    సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.

171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను.

కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది.

వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.
సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను.
కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది.
వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
  • సత్తుపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ దివాకర్ టీఎస్ విస్తృత పర్యటన సత్తుపల్లి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంగారం గ్రామంలో పంట పొలాల్లో గట్ల వెంట నడుచుకుంటూ వెళ్లిన కలెక్టర్.. రైతుల సమక్షంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బేతుపల్లి, నారాయణపురం గ్రామాల్లో కొనసాగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ దివాకర్ టీఎస్.. భూ రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల సందేహాలను అడిగి తెలుసుకుని, వాటిని నివృత్తి చేశారు. భూ రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు
    1
    సత్తుపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ దివాకర్ టీఎస్ విస్తృత పర్యటన
సత్తుపల్లి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గంగారం గ్రామంలో పంట పొలాల్లో గట్ల వెంట నడుచుకుంటూ వెళ్లిన కలెక్టర్.. రైతుల సమక్షంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బేతుపల్లి, నారాయణపురం గ్రామాల్లో కొనసాగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ దివాకర్ టీఎస్.. భూ రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల సందేహాలను అడిగి తెలుసుకుని, వాటిని నివృత్తి చేశారు. భూ రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్ ఆసక్తి - వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల గారితో బిహార్ వ్యవసాయశాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా బేటీ - వ్యవసాయంలో సాంకేతికత, ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణపై చర్చించిన ఇరుమంత్రులు - ఆయిల్ పామ్ పై బిహార్ ఆసక్తి.... మకానాపై తెలంగాణ ఆసక్తి - తమ రాష్ట్రంలోను ఆయిల్ పామ్ సాగు అమలుకు పరిశీలిస్తామన్న బిహార్ మంత్రి - త్వరలోనే తెలంగాణకు ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామన్న బిహార్ మంత్రి - ఆయిల్ పామ్ సాగులో అవసరమైన అన్ని సహాయసహకారాలను అందిస్తామన్న మంత్రి తుమ్మల - తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి తుమ్మల - రైతుల కోసం రెండున్నరేళ్లలో 1.30 లక్షల కోట్లు ఖర్చు చేశాము - రైతుబంధు, రైతు భీమా, సన్నాలకు బోనస్ వంటి పథకాల అమలు తీరును వివరించిన మంత్రి తుమ్మల బీహార్ వ్యవసాయశాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్–తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత కార్యక్రమాలు, రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హాకు వివరించారు. వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం, రైస్‌ నేస్తం ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా అనుసంధానం, క్రాప్‌ బుకింగ్‌, శాటిలైట్‌ ఆధారిత పంటల పర్యవేక్షణ, యూరియా బుకింగ్‌ అప్లికేషన్‌, అగ్రిస్టాక్‌ ద్వారా రైతు గుర్తింపు వంటి డిజిటల్‌ కార్యక్రమాలను వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస్‌’ పంటల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పంటల్లో సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లోనే సత్వర చర్యలు చేపట్టడం ద్వారా రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, దిగుబడిని పెంచడం, లాభదాయకతను మెరుగుపర్చే విధానాలను మంత్రి తుమ్మల వివరించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్‌ తదితర కార్యక్రమాల అమలు తీరును బీహార్ మంత్రికి వివరించారు. రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సంవత్సరానికి రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12000 ఇస్తున్నామని తెలిపారు. సన్నాలకు 500 బోనస్ అందిస్తున్నామని, దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణలో వరి, పత్తితో పాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్‌, మామిడి, ఎర్ర మిరప, పసుపు, ఆయిల్‌పామ్‌ తదితర పంటల సాగు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని, 2025-26లో 3.11 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉండగా, 74 వేల మెట్రిక్‌ టన్నుల క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తితో 20.01 శాతం ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో సాధించినట్లు వివరించారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ మిల్లులు, మైక్రో ఇరిగేషన్‌ వంటి మౌలిక సదుపాయాలపై కూడా బీహార్ మంత్రి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో బీహార్‌లో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణ, పంటల క్లస్టర్ల విధానం, సాంకేతిక వినియోగం తదితర అంశాలను బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా తెలంగాణ ప్రతినిధులకు వివరించారు. బీహార్‌లో చిన్న, సన్నకారు రైతులు 91 శాతం ఉండగా, వ్యవసాయంపై ఆధారపడే జనాభా 77 శాతంగా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల వైవిధ్యానికి అనుగుణంగా ప్రత్యేక పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మకానా, మొక్కజొన్న, పండ్లు–కూరగాయలు, తృణధాన్యాల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. దర్భంగా, మధుబని, సీతామర్హి ప్రాంతాల్లో మకానా క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌లో మకానా పంటపై ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల మంత్రి తుమ్మల ఆసక్తి కనబరిచారు. ఇటీవల మకానా ఉత్పత్తి, పరిశోధన, విలువ జోడింపు, మార్కెటింగ్‌, అంతర్జాతీయ అవకాశాలను పెంపొందించేందుకు మకానా బోర్డును ఏర్పాటు చేసినట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. గత పదేళ్లలో మకానా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత 2.5 రెట్లకు పైగా పెరిగినట్లు వివరించారు. ఆయిల్‌పామ్‌పై బీహార్‌ ఆసక్తి.. మకానాపై తెలంగాణ ఆసక్తి: బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు అవకాశాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేయగా, మంత్రి తుమ్మల బీహార్‌లో ప్రత్యేకంగా సాగవుతున్న మకానా పంట, దాని ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలపై ఆసక్తి చూపారు. రెండు రాష్ట్రాల్లో రైతులకు ప్రయోజనం చేకూరే పంటల పరస్పర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి దోహదం చేసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు. ఇందుకోసం ఆయిల్‌పామ్‌ సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీహార్‌ నుంచి వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధుల బృందంతో పాటు రైతుల బృందాన్ని తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ తోటలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, సాగులో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదే విధంగా మకానా సాగు, ప్రాసెసింగ్‌, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బీహార్‌కు పంపిస్తామని తెలిపారు. బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నాటుసామగ్రి, సాగు విధానాలు, మైక్రో ఇరిగేషన్‌, ప్రాసెసింగ్‌ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో రెండు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల వైవిధ్యీకరణ విధానాలను పరస్పరం పంచుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత మెరుగుదల, విలువ జోడింపు, మార్కెట్‌ అవకాశాల విస్తరణకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ–బీహార్‌ మధ్య వ్యవసాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కోఆపరేటీవ్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి మరియు బిహార్ రాష్ట్ర వ్యవసాయశాఖ సెక్రటరీ నర్మదేశ్వర్ లాల్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ముకేష్ కుమార్ లాల్, హార్టికల్చర్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు. అర్బన్ ఫార్మింగ్‌, మిద్దె పంటలతో ఆరోగ్యకరమైన జీవనానికి బాట అర్బన్ ఫార్మింగ్, మిద్దె పంటలు మరియు కిచెన్ గార్డెనింగ్‌ను నగరప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన *అర్బన్ ఫార్మింగ్‌ & కిచెన్‌ గార్డెనింగ్‌ ఎక్స్‌పో–2026* కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నగర ప్రజలకు తాజా ఆహారం, ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కిచెన్‌ గార్డెనింగ్‌కు పెద్ద స్థలం అవసరం లేదని, ఇంటి బాల్కనీ, టెర్రస్‌, ఇంటి ప్రాంగణం వంటి చిన్న ప్రదేశాల్లోనే కుండీలు, గ్రో బ్యాగులు, ఇతర కంటైనర్లలో కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలు, కూరగాయలు, మూలికలను సులభంగా పెంచుకోవచ్చని మంత్రి తెలిపారు. నగరాల్లోని లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లలో కొంత మేరకు ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం ప్రారంభిస్తే దాని సమిష్టి ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుందని అన్నారు. వ్యవసాయం కేవలం వ్యవసాయ క్షేత్రాలకే పరిమితం కాకుండా టెర్రస్‌లు, బాల్కనీలు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థల ప్రాంగణాల్లోనూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర మొక్కలను పెంచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. తాజాగా పండిద్దాం – ఆరోగ్యంగా తిందాం – పచ్చగా జీవిద్దాం అనే సందేశం కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబ జీవన విధానంగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎక్స్‌పోకు వచ్చిన ప్రజలు ఎగ్జిబిటర్లు, నిపుణులతో చర్చించి అర్బన్‌ ఫార్మింగ్‌లోని కొత్త సాంకేతికతలను తెలుసుకుని తమ ఇళ్లు, సంస్థలు, కమ్యూనిటీలలో గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్ ఆసక్తి

- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల గారితో బిహార్ వ్యవసాయశాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా బేటీ

- వ్యవసాయంలో సాంకేతికత, ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణపై చర్చించిన ఇరుమంత్రులు

- ఆయిల్ పామ్ పై బిహార్ ఆసక్తి.... మకానాపై తెలంగాణ ఆసక్తి

- తమ రాష్ట్రంలోను ఆయిల్ పామ్ సాగు అమలుకు పరిశీలిస్తామన్న బిహార్ మంత్రి

- త్వరలోనే తెలంగాణకు ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామన్న బిహార్ మంత్రి

- ఆయిల్ పామ్ సాగులో అవసరమైన అన్ని సహాయసహకారాలను అందిస్తామన్న మంత్రి తుమ్మల

- తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి తుమ్మల

- రైతుల కోసం రెండున్నరేళ్లలో 1.30 లక్షల కోట్లు ఖర్చు చేశాము 

- రైతుబంధు, రైతు భీమా, సన్నాలకు బోనస్ వంటి పథకాల అమలు తీరును వివరించిన మంత్రి తుమ్మల

బీహార్ వ్యవసాయశాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్–తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత కార్యక్రమాలు, రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హాకు వివరించారు. వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం, రైస్‌ నేస్తం ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా అనుసంధానం, క్రాప్‌ బుకింగ్‌, శాటిలైట్‌ ఆధారిత పంటల పర్యవేక్షణ, యూరియా బుకింగ్‌ అప్లికేషన్‌, అగ్రిస్టాక్‌ ద్వారా రైతు గుర్తింపు వంటి డిజిటల్‌ కార్యక్రమాలను వివరించారు.  కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస్‌’ పంటల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పంటల్లో సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లోనే సత్వర చర్యలు చేపట్టడం ద్వారా రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, దిగుబడిని పెంచడం, లాభదాయకతను మెరుగుపర్చే విధానాలను మంత్రి తుమ్మల వివరించారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్‌ తదితర కార్యక్రమాల అమలు తీరును బీహార్ మంత్రికి వివరించారు. రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సంవత్సరానికి రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12000 ఇస్తున్నామని తెలిపారు. సన్నాలకు 500 బోనస్ అందిస్తున్నామని, దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.  

రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణలో వరి, పత్తితో పాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్‌, మామిడి, ఎర్ర మిరప, పసుపు, ఆయిల్‌పామ్‌ తదితర పంటల సాగు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని, 2025-26లో 3.11 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉండగా, 74 వేల మెట్రిక్‌ టన్నుల క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తితో 20.01 శాతం ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో సాధించినట్లు వివరించారు.  తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ మిల్లులు, మైక్రో ఇరిగేషన్‌ వంటి మౌలిక సదుపాయాలపై కూడా బీహార్ మంత్రి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఇదే సమయంలో బీహార్‌లో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణ, పంటల క్లస్టర్ల విధానం, సాంకేతిక వినియోగం తదితర అంశాలను బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా తెలంగాణ ప్రతినిధులకు వివరించారు. బీహార్‌లో చిన్న, సన్నకారు రైతులు 91 శాతం ఉండగా, వ్యవసాయంపై ఆధారపడే జనాభా 77 శాతంగా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల వైవిధ్యానికి అనుగుణంగా ప్రత్యేక పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 

ముఖ్యంగా మకానా, మొక్కజొన్న, పండ్లు–కూరగాయలు, తృణధాన్యాల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. దర్భంగా, మధుబని, సీతామర్హి ప్రాంతాల్లో మకానా క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌లో మకానా పంటపై ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల మంత్రి తుమ్మల ఆసక్తి కనబరిచారు. ఇటీవల మకానా ఉత్పత్తి, పరిశోధన, విలువ జోడింపు, మార్కెటింగ్‌, అంతర్జాతీయ అవకాశాలను పెంపొందించేందుకు మకానా బోర్డును ఏర్పాటు చేసినట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. గత పదేళ్లలో మకానా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత 2.5 రెట్లకు పైగా పెరిగినట్లు వివరించారు. 

ఆయిల్‌పామ్‌పై బీహార్‌ ఆసక్తి.. మకానాపై తెలంగాణ ఆసక్తి:

బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు అవకాశాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేయగా, మంత్రి తుమ్మల బీహార్‌లో ప్రత్యేకంగా సాగవుతున్న మకానా పంట, దాని ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలపై ఆసక్తి చూపారు. రెండు రాష్ట్రాల్లో రైతులకు ప్రయోజనం చేకూరే పంటల పరస్పర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి దోహదం చేసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు.

ఇందుకోసం ఆయిల్‌పామ్‌ సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీహార్‌ నుంచి వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధుల బృందంతో పాటు రైతుల బృందాన్ని తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ తోటలు, నర్సరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, సాగులో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదే విధంగా మకానా సాగు, ప్రాసెసింగ్‌, విలువ జోడింపు, మార్కెటింగ్‌ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బీహార్‌కు పంపిస్తామని తెలిపారు.

బీహార్‌లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నాటుసామగ్రి, సాగు విధానాలు, మైక్రో ఇరిగేషన్‌, ప్రాసెసింగ్‌ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

వ్యవసాయరంగంలో రెండు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల వైవిధ్యీకరణ విధానాలను పరస్పరం పంచుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత మెరుగుదల, విలువ జోడింపు, మార్కెట్‌ అవకాశాల విస్తరణకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ–బీహార్‌ మధ్య వ్యవసాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కోఆపరేటీవ్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి మరియు బిహార్ రాష్ట్ర వ్యవసాయశాఖ సెక్రటరీ నర్మదేశ్వర్ లాల్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ముకేష్ కుమార్ లాల్, హార్టికల్చర్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.

అర్బన్ ఫార్మింగ్‌, మిద్దె పంటలతో ఆరోగ్యకరమైన జీవనానికి బాట

అర్బన్ ఫార్మింగ్, మిద్దె పంటలు మరియు కిచెన్ గార్డెనింగ్‌ను నగరప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన *అర్బన్ ఫార్మింగ్‌ & కిచెన్‌ గార్డెనింగ్‌ ఎక్స్‌పో–2026* కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నగర ప్రజలకు తాజా ఆహారం, ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. 

కిచెన్‌ గార్డెనింగ్‌కు పెద్ద స్థలం అవసరం లేదని, ఇంటి బాల్కనీ, టెర్రస్‌, ఇంటి ప్రాంగణం వంటి చిన్న ప్రదేశాల్లోనే కుండీలు, గ్రో బ్యాగులు, ఇతర కంటైనర్లలో కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలు, కూరగాయలు, మూలికలను సులభంగా పెంచుకోవచ్చని మంత్రి తెలిపారు. నగరాల్లోని లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లలో కొంత మేరకు ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం ప్రారంభిస్తే దాని సమిష్టి ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుందని అన్నారు. 

వ్యవసాయం కేవలం వ్యవసాయ క్షేత్రాలకే పరిమితం కాకుండా టెర్రస్‌లు, బాల్కనీలు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థల ప్రాంగణాల్లోనూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర మొక్కలను పెంచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు.

తాజాగా పండిద్దాం – ఆరోగ్యంగా తిందాం – పచ్చగా జీవిద్దాం అనే సందేశం కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబ జీవన విధానంగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎక్స్‌పోకు వచ్చిన ప్రజలు ఎగ్జిబిటర్లు, నిపుణులతో చర్చించి అర్బన్‌ ఫార్మింగ్‌లోని కొత్త సాంకేతికతలను తెలుసుకుని తమ ఇళ్లు, సంస్థలు, కమ్యూనిటీలలో గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో రైతు నేస్తం చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • అడవి మల్లెల ఎస్సీ బాలికల రెసిడెన్షియల్లో విద్యార్థుల్ని ఎలుకలు కోరుట గురించి ఖమ్మం జిల్లా పెనుబల్లి అడవి మల్లెల గురుకులంలో ఎలుకల కలకలం పెనుబల్లి మండలం అడవిమల్లెల బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఎలుకల కలకలం రేపింది. గురుకులంలో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతోంది. ఎలుకల దాడితో విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గురుకులం సిబ్బంది వెంటనే విద్యార్థినులను లంకాసాగర్ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. అయితే గురుకులంలో ఎలుకల బెడదపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో పారిశుద్ధ్య పరిస్థితులు, ఎలుకల నియంత్రణ చర్యలపై అధికారులు తగినంతగా దృష్టి సారించడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గురుకులంలో ఎలుకల బెడదను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
    4
    అడవి మల్లెల ఎస్సీ బాలికల రెసిడెన్షియల్లో  విద్యార్థుల్ని ఎలుకలు కోరుట గురించి 
ఖమ్మం జిల్లా 
పెనుబల్లి అడవి మల్లెల గురుకులంలో ఎలుకల కలకలం
పెనుబల్లి మండలం అడవిమల్లెల బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఎలుకల కలకలం రేపింది.
గురుకులంలో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతోంది.
ఎలుకల దాడితో విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గురుకులం సిబ్బంది వెంటనే విద్యార్థినులను లంకాసాగర్ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.
అయితే గురుకులంలో ఎలుకల బెడదపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గురుకులంలో పారిశుద్ధ్య పరిస్థితులు, ఎలుకల నియంత్రణ చర్యలపై అధికారులు తగినంతగా దృష్టి సారించడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గురుకులంలో ఎలుకల బెడదను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తరం, ఆకుపూజ, హనుమాన్ చాలీసా తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి తమ ఇష్టదైవమని, స్వామివారికి తమలపాకుల దండ, సింధూరం సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయని తమ విశ్వాసమని తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అభివృద్ధికి సహకరించండి — ఆలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నందున దాతలు, భక్తులు, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య  సందర్భంగా అన్నప్రసాద వితరణ
సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం నుంచి ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తరం, ఆకుపూజ, హనుమాన్ చాలీసా తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి తమ ఇష్టదైవమని, స్వామివారికి తమలపాకుల దండ, సింధూరం సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయని తమ విశ్వాసమని తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.
ఆలయ అభివృద్ధికి సహకరించండి — ఆలయ కమిటీ
ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నందున దాతలు, భక్తులు, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • ఏసీపీ కార్యాలయంపై దాడి చేసిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం భారీగా మోహరించిన పోలీసులు
    1
    ఏసీపీ కార్యాలయంపై దాడి చేసిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబ సభ్యులు

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు
పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం
భారీగా మోహరించిన పోలీసులు
    user_KOTAMARTHI HANUMANTHU
    KOTAMARTHI HANUMANTHU
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.