బద్వేలు లో అంగరంగ వైభవంగా ముగిసిన స్వామి వారి బ్రహ్మోత్సవాలు. బద్వేలు :నియోజకవర్గం లోని గోపవరం మండలం వల్లేరవారి పల్లె గ్రామం లో వెలసిన స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు వేకువజామునే స్వామివారికి పంచామృత అభిషేకం,తదుపరి స్వామి అమ్మ వారు పలు రకాల పుష్పలతో ప్రత్యేక అలంకరణ లో భక్తులకు దర్శనం ఇచ్చార,తదుపరి ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహించారు మొదటి బహుమతి ఓబుళం పల్లె సతీష్ రెడ్డి 40116 రెండవ బహుమతి ఎర్రిపల్లె విజయ్ కుమార్ రెడ్డి 30116 మూడవ బహుమతి రంగోరి పల్లె జస్విత్ రెడ్డి 20116 నాల్గవ బహుమతి సగిలి శ్రీనివాస్ రెడ్డి కోనరాసపల్లె 10116 బహుమతులు పొందారు,సాయంత్రం స్వామి పులంగి సేవ కార్యాక్రమం నిర్వహించడం జరిగింది,తదుపరి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిచి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు,వల్లేరవారి పల్లె గ్రామానికి చెందిన దండా. శ్రీనివాసులు రెడ్డి ధర్మపత్ని అనిత వీరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
బద్వేలు లో అంగరంగ వైభవంగా ముగిసిన స్వామి వారి బ్రహ్మోత్సవాలు. బద్వేలు :నియోజకవర్గం లోని గోపవరం మండలం వల్లేరవారి పల్లె గ్రామం లో వెలసిన స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు వేకువజామునే స్వామివారికి పంచామృత అభిషేకం,తదుపరి స్వామి అమ్మ వారు పలు రకాల పుష్పలతో ప్రత్యేక అలంకరణ లో భక్తులకు దర్శనం ఇచ్చార,తదుపరి ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహించారు మొదటి బహుమతి ఓబుళం పల్లె సతీష్ రెడ్డి 40116 రెండవ బహుమతి ఎర్రిపల్లె విజయ్
కుమార్ రెడ్డి 30116 మూడవ బహుమతి రంగోరి పల్లె జస్విత్ రెడ్డి 20116 నాల్గవ బహుమతి సగిలి శ్రీనివాస్ రెడ్డి కోనరాసపల్లె 10116 బహుమతులు పొందారు,సాయంత్రం స్వామి పులంగి సేవ కార్యాక్రమం నిర్వహించడం జరిగింది,తదుపరి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిచి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు,వల్లేరవారి పల్లె గ్రామానికి చెందిన దండా. శ్రీనివాసులు రెడ్డి ధర్మపత్ని అనిత వీరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1
- Post by Bondhu Suresh1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం... కార్యాలయమా? పార్కింగ్ స్థలమా? గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు – ఆలస్యంగా ప్రారంభమవుతున్న ఫిర్యాదుల స్వీకరణపై విమర్శలు. చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందాల్సిన సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.తహశీల్దార్ కార్యాలయ వరండా, ఆవరణ ప్రాంతం మొత్తం ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలను ఎటు పడితే అటు పార్కింగ్ చేయడంతో వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన చోట పూర్తిగా పార్కింగ్ స్థలంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం గత రెండు వారాలుగా 11 గంటల తర్వాత ప్రారంభమవుతుండటంపై కూడా ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుండి తెల్లవారుజామునే బయలుదేరి కార్యాలయానికి చేరుకున్న ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ ఆలస్యానికి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమా..? లేక ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యమా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలి గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ప్రాంగణంలో సరైన పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం... కార్యాలయమా? పార్కింగ్ స్థలమా? గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు – ఆలస్యంగా ప్రారంభమవుతున్న ఫిర్యాదుల స్వీకరణపై విమర్శలు. చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందాల్సిన సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.తహశీల్దార్ కార్యాలయ వరండా, ఆవరణ ప్రాంతం మొత్తం ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలను ఎటు పడితే అటు పార్కింగ్ చేయడంతో వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన చోట పూర్తిగా పార్కింగ్ స్థలంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం గత రెండు వారాలుగా 11 గంటల తర్వాత ప్రారంభమవుతుండటంపై కూడా ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుండి తెల్లవారుజామునే బయలుదేరి కార్యాలయానికి చేరుకున్న ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ ఆలస్యానికి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమా..? లేక ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యమా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలి గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ప్రాంగణంలో సరైన పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- కొల్లు రవీంద్రా మీరు వేసుకున్న పచ్చ కళ్లజోడుని తీసేసి చూస్తే.. వైయస్ జగన్ గారు చేసిన మంచి కనిపిస్తుంది అభివృద్ధి పనులు చేయడం, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, పేదలకు పథకాలు ఇవ్వడం రాష్ట్రాన్ని నా*శనం చేయడమా కొల్లు రవీంద్రా? -వంగవీటి నరేంద్ర గారు, వైయస్‌ఆర్‌సీపీ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1