కల్లూరు మున్సిపాలిటీ కార్మికులకు ఎనిమిది నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ సీపీఎం పార్టీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి వర్గం సభ్యులు తన్నీరు క్రిష్ణార్జునరావు ఈసందర్భంగా మాట్లాడుతూ కల్లూరు మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులకు గత ఎనిమిది నెలలుగా వేతనాలు అందడం లేదని వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.మాది ప్రజా ప్రభుత్వం,ఈరాష్ట్రంలో ఏఒక్కరికి కష్టం కలిగినా అది నాకష్టం గా ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ కార్మికులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.మంత్రులు,శాసనసభ్యులు ప్రతినెలా జీతాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు.పాశుధ్య కార్మికులు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు.ఎండనక,వాననక పని చేసినా కూడా వారి మీద దయలేకపోడం దారుణమని అన్నారు.వంటనే వారి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో తాము ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.అదేవిధంగా పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం 26 వేల 750 రూపాయలు ఇవ్వాలని.కార్మికుల రక్షణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో భీమా సౌకర్యం కల్పించాలని,దీని కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని,పారిశుధ్య కార్మికులకు మాస్కులు,గ్లౌజులు,కోబ్బరినూనె,సబ్బులు,బూట్లు,యూనిఫాం,ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించాలని,అనివార్యకారణాలవల్ల కార్మికులు చనిపోతే 20లక్షల రూపాయల భీమా ఇవ్వాలని,అంత్యక్రియలకు 20వేలరూపాయలుఇవ్వాలి.కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని,కార్మికులకు వాంతపు సెలవులు ఇవ్వాలని.పండుగలు జాతీయ శలవు దినాలలో పనిచేసే కార్మికులకు అదనపువేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్ కు,మేనేజర్ నందిశెట్టి నాగేశ్వరరావు కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ 12 వార్డు కౌన్సిలరు షేక్ ఇస్మాయిల్,బీఆర్ ఎస్ నాయకులు దార్ల నరసింహారావు,సీఐటీయు నాయకులు మీనుగు క్రిష్ణ,వేల్పుల రామారావు,రెడ్డిచర్ల సునిల్,మున్సిపల్ కార్మికులు జయమ్మ,బొల్లం మల్లికార్జున్,సుధాకర్,బొడ్డు సుజాత తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు మున్సిపాలిటీ కార్మికులకు ఎనిమిది నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ సీపీఎం పార్టీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి వర్గం సభ్యులు తన్నీరు క్రిష్ణార్జునరావు ఈసందర్భంగా మాట్లాడుతూ కల్లూరు మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులకు గత ఎనిమిది నెలలుగా వేతనాలు అందడం లేదని వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.మాది ప్రజా ప్రభుత్వం,ఈరాష్ట్రంలో ఏఒక్కరికి కష్టం కలిగినా అది నాకష్టం గా ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ కార్మికులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.మంత్రులు,శాసనసభ్యులు ప్రతినెలా జీతాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు.పాశుధ్య కార్మికులు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు.ఎండనక,వాననక పని చేసినా కూడా వారి మీద దయలేకపోడం దారుణమని అన్నారు.వంటనే వారి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో తాము ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.అదేవిధంగా
పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం 26 వేల 750 రూపాయలు ఇవ్వాలని.కార్మికుల రక్షణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో భీమా సౌకర్యం కల్పించాలని,దీని కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని,పారిశుధ్య కార్మికులకు మాస్కులు,గ్లౌజులు,కోబ్బరినూనె,సబ్బులు,బూట్లు,యూనిఫాం,ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించాలని,అనివార్యకారణాలవల్ల కార్మికులు చనిపోతే 20లక్షల రూపాయల భీమా ఇవ్వాలని,అంత్యక్రియలకు 20వేలరూపాయలుఇవ్వాలి.కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని,కార్మికులకు వాంతపు సెలవులు ఇవ్వాలని.పండుగలు జాతీయ శలవు దినాలలో పనిచేసే కార్మికులకు అదనపువేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్ కు,మేనేజర్ నందిశెట్టి నాగేశ్వరరావు కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ 12 వార్డు కౌన్సిలరు షేక్ ఇస్మాయిల్,బీఆర్ ఎస్ నాయకులు దార్ల నరసింహారావు,సీఐటీయు నాయకులు మీనుగు క్రిష్ణ,వేల్పుల రామారావు,రెడ్డిచర్ల సునిల్,మున్సిపల్ కార్మికులు జయమ్మ,బొల్లం మల్లికార్జున్,సుధాకర్,బొడ్డు సుజాత తదితరులు పాల్గొన్నారు.
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.4
- అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.1
- నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.3
- హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- Post by Syyed taher1
- Post by V Ramarao1