కేవీకేలో వ్యవసాయాధారిత వ్యాపారాభివృద్ధిపై కిసాన్ మేళా. ఆమదాలవలస: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 6వ తేదీన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘వ్యవసాయాధారిత వ్యాపారాభివృద్ధి’ అంశంపై కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మి దేవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మేళాలో భాగంగా ఏర్పాటు చేసే వ్యవసాయ ప్రదర్శన, రైతు సదస్సు, క్షేత్ర సందర్శన వంటి కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన ముఖ్య ప్రజా ప్రతినిధులు, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ, పరిశోధనా సంచాలకులు డాక్టర్ పి.వి.సత్యనారాయణ, ఐసీఏఆర్-అటారి డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు, మహిళా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఔత్సాహిక యువత ఈ మేళాకు పెద్ద ఎత్తున హాజరై సాగులో వ్యాపార మెళకువలను తెలుసుకోవాలని కోరారు.
కేవీకేలో వ్యవసాయాధారిత వ్యాపారాభివృద్ధిపై కిసాన్ మేళా. ఆమదాలవలస: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 6వ తేదీన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘వ్యవసాయాధారిత వ్యాపారాభివృద్ధి’ అంశంపై కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి
విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మి దేవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మేళాలో భాగంగా ఏర్పాటు చేసే వ్యవసాయ ప్రదర్శన, రైతు సదస్సు, క్షేత్ర సందర్శన వంటి కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన ముఖ్య ప్రజా ప్రతినిధులు, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ, పరిశోధనా సంచాలకులు
డాక్టర్ పి.వి.సత్యనారాయణ, ఐసీఏఆర్-అటారి డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు, మహిళా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఔత్సాహిక యువత ఈ మేళాకు పెద్ద ఎత్తున హాజరై సాగులో వ్యాపార మెళకువలను తెలుసుకోవాలని కోరారు.
- ఆమదాలవలస: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 6వ తేదీన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘వ్యవసాయాధారిత వ్యాపారాభివృద్ధి’ అంశంపై కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మి దేవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మేళాలో భాగంగా ఏర్పాటు చేసే వ్యవసాయ ప్రదర్శన, రైతు సదస్సు, క్షేత్ర సందర్శన వంటి కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన ముఖ్య ప్రజా ప్రతినిధులు, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ, పరిశోధనా సంచాలకులు డాక్టర్ పి.వి.సత్యనారాయణ, ఐసీఏఆర్-అటారి డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు, మహిళా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఔత్సాహిక యువత ఈ మేళాకు పెద్ద ఎత్తున హాజరై సాగులో వ్యాపార మెళకువలను తెలుసుకోవాలని కోరారు.3
- Post by APPARAO KONCHADA1
- ఫిబ్రవరి 4,టెక్కలి మండలం నర్సింగపల్లి తదితర గ్రామాల్లో బుధవారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి నలుగురిని గాయపరిచిన విషయం తెలిసిందే. మధ్యాహ్నానానికి ఆ సంఖ్య 9కి చేరింది. గాయపడిన మరో ఐదుగురు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. ఒక రోజులో తొమ్మిది మంది కుక్క కాటుకు గురవ్వడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.3
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో నర్సింగపల్లి మొక్ర. మొఖలింగపురం. కిట్టలపాడు తదితర గ్రామాల్లో పిచ్చుకలు స్వైర విహారం చేస్తూ కనబడిన వారి కల్లా కరిచి గాయాల పాలు చేస్తున్నాయి. దీనితో తెల్లవారి నుండి టెక్కలి జిల్లా ఆసుపత్రికి కుక్కలు కరిచిన బాధితులు చికిత్స కోసం తరలివస్తున్నారు .ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పిచ్చి కుక్కల్ని అరికట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు4
- చాలా మంది రోగులు దంత చికిత్సలను ధరల ఆధారంగా మాత్రమే పోల్చుతారు. కానీ దంతవైద్యంలో, సత్వరమార్గాలు తరచుగా పునరావృత విధానాలు, చిగుళ్ల సమస్యలు లేదా నెలల తర్వాత విఫలమైన పనిగా మారుతాయి. నైతిక దంతవైద్యం నైతిక దంతవైద్యం ఖరీదైనది కాదు. ఇది మీ దీర్ఘకాలిక నోటి ఆరోగ్యానికి సురక్షితమైనది మరియు శాశ్వతమైనది చేయడం గురించి. ఎందుకంటే ఒకే పంటిని రెండుసార్లు సరిచేయడం దీర్ఘకాలంలో ఎప్పుడూ చౌకగా ఉండదు.1
- 'రాష్ట్రీయ సేవా సమ్మాన్' పురస్కారంతో మరింత బాధ్యత పెరిగింది విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, విజయనగరం మండలం గుంకలాం జెడ్.పి.హైస్కూలులో హెడ్ మాస్టరుగా పని చేస్తున్న వెలమల శ్రీనివాస రావు 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డు అందుకోవడంపట్ల జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హర్షం వ్యక్తం చేసి, జిల్లా పోలీసు కార్యాలయంలో వెలమల శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభిందించి, మిఠాయి తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు మాస్టరు జాతీయ పురస్కారం లభించడం అభినందనీయమన్నారు. శ్రీనివాసరావు మాస్టరు ఒక వైపు హెడ్ మాస్టరుగా విధులు నిర్వహిస్తూ, మరోవైపు వలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వ్యాఖ్యానం అందిస్తూ, ప్రజలందరికీ చేరువయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషను ఆధ్వర్యంలో ఎంపికైన ఉద్యోగులకు భారతీయ వారసత్వం సంస్కృతి గొప్పదనాన్ని వివిరిస్తూ తరగతులు నిర్వహించడం, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతో నీతి అయోగ్ ఆధ్వర్యంలోని బృందం వెలమల శ్రీనివాసరావు సేవలను జాతీయ స్థాయిలో గుర్తించి 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డును జనవరి 25న న్యూఢిల్లీలో ప్రదానం చేసిందన్నారు. ఈ అవార్డు అందుకోవడంతో శ్రీనివాసరావు మాస్టరు పై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అకాంక్షించారు. జాతీయ పురస్కారం పొందిన వెలమల శ్రీనివాసరావు ఫిబ్రవరి 3న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించి, మిఠాయిలు తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్.గోపాల నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, శ్రీనివాసరావు మాస్టరును అభినందించారు.1
- తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి కూటమి నేతలు కావాలనే అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ వ్యవహారం పై మంగళవారం పాతపట్నం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఆమెతోపాటు వైసీపీ నాయకులు ఉన్నారు.2
- శ్రీకాకుళం: పోలీసు ఉద్యోగులలో ఐకమత్యం,జట్టు సమన్వయం, శారీరక–మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం లోని తండేవలసలో గల పోలీస్ శిక్షణ కేంద్రం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ ప్రారంభ వేడుకలకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ముందుగా ఎస్పీ పోలీసు క్రీడాజ్యోతిని వెలిగించి,గాలిలోకి శాంతికి చిహ్నంగా పావురాలు, బెలూన్లు ఎగురవేసి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వివిధ క్రీడా పోటీలకు ప్రారంభ సంకేతం ఇచ్చారు. ఈ వార్షిక క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించనుండగా, శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖకు చెందిన శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లు, పోలీసు కార్యాలయం, ఆర్మ్డ్ రిజర్వ్, ఎస్‌టిఎఫ్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన మొత్తం ఏడు జట్లు వివిధ క్రీడాంశాల్లో పోటీపడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయి. ఈ వార్షిక క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో పురుషుల 400 మీటర్ల పరుగు, పురుషులు – మహిళల 100 మీటర్ల పరుగు,వంటి పోటీలను ప్రారంభించి, విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులు, సిబ్బంది క్రీడాకారులకు అభినిందచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు విధులు సాధారణంగా ఒత్తిడితో కూడుకున్నవి. అలాంటి పరిస్థితుల్లో క్రీడలు మనకు శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయిని ప్రతి ఒక్కరూ క్రీడాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.క్రీడా మైదానంలో ఉన్నప్పుడు విధులు,ఒత్తిడి పూర్తిగా మర్చిపోయి, జట్టు స్పూర్తితో విజయం వైపు ముందుకు సాగుతామని తెలిపారు.స్పోర్ట్స్ ద్వారా జట్టు సమన్వయం, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయిన్నారు. ఇవే లక్షణాలు పోలీసు విధుల్లో కూడా అత్యంత అవసరం అని అన్నారు. ప్రతి సబ్ డివిజన్,పోలీసు కార్యాలయంకు చెందిన అధికారులు, సిబ్బంది, ఎస్‌టిఎఫ్, హోంగార్డులు అందరూ ఆసక్తితో పాల్గొని, ఈ క్రీడా పోటీలను స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా నిర్వహించాలి.అలాగే క్రీడాకారులు అందరూ ఆరోగ్యంగా, క్రమశిక్షణతో, స్నేహపూర్వక వాతావరణంలో పోటీల్లో పాల్గొని ఈ మూడు రోజుల క్రీడా సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.వార్షిక స్పోర్ట్స్ & గేమ్స్ మీట్‌లో భాగంగా అథ్లెటిక్స్,వాలీబాల్, బ్యాడ్మింటన్,కబాడీ,క్రికెట్, బాస్కెట్ బాల్,షాట్ పుట్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్,వంటి వివిధ క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.చివరగా ఎస్పీ క్రీడల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసి, క్రీడా స్ఫూర్తిని నింపారు.4