Shuru
Apke Nagar Ki App…
APPARAO KONCHADA
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సంతబొమ్మాలి ఫిబ్రవరి 4,నియోజకవర్గంలో బూరగాం గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి ధర్మ శాస్త్ర సన్నిధానం ఆలయంలో అయ్యప్ప స్వామికి బుధవారం నాడు భక్తులు విశేష అభిషేకాలు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామికి 11 రకాల పుష్పాలు చేత పూజించి అలంకారం చేశారు. అలాగే స్వామికి తర్వాత భస్మాభిషేక నిర్వహించి వచ్చిన భక్తులకు అరవణ ప్రసాదం పంచి పెట్టారు ఆలయ అర్చకులు భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ చేసి పంచిపెట్టారు.2
- బొద్దంగ్రామంలో చోరీ జరిగిన ఇంటిని సందర్శించిన డీఎస్పీ మరియు అధికారులు. బొద్దంగ్రామంలో గత ఆదివారం జనపరెడ్డి వెంకటరమణ ఇంట్లో జరిగిన భారీ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంగళవారం నాడు ఇన్చార్జి డీఎస్పీ ఆర్. గోవిందరావు, ఎస్.కోట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. అప్పలనాయుడు, మరియు ఎస్.కోట ఇన్స్పెక్టర్ నారాయణ మూర్తి ఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి విచారణ చేపట్టారు. అధికారులు చోరీ జరిగిన గదులను, బీరువాలను మరియు నిందితులు ఇంట్లోకి ప్రవేశించిన మార్గాలను పరిశీలించారు. బాధితుడు వెంకటరమణ మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడి, పోయిన నగదు, నగలు మరియు ఇతర విలువైన వస్తువుల వివరాలను సేకరించారు. క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు, స్థానిక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ.. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.1
- డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.1
- అడ్డతీగల: దుచ్చర్తి వై.జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలవరం జిల్లాలో ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.1
- 🙏🙏1
- తూ.గో జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రాత్రి స్థానిక కల్యాణ మండపం వద్ద పులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్గా మారింది. గత 5రోజులుగా పులి భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసి, బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బీజాపూర్ సిటీ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.1
- పోలాకి:మండలం సుసరాం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టెక్కలి డివిజన్ శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్, మహిళ పిసి యమున బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు సెల్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రీల్స్ చూడటంతో పాటు, ఈ యాప్ పై కూడా దృష్టి సారించాలని, ప్రమాద సమయంలో ఇది ఆదుకుంటుందని తెలిపారు.1
- గిరిజన హక్కులు, చట్టాల సమర్థ అమలుకు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపి) నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ అల్లూరి జిల్లా కన్వీనర్ కిలో రాజన్ తెలిపారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు.గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలను గత పాలకులు విస్మరించారని ఆయన విమర్శించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని రాజన్ స్పష్టం చేశారు.1
- వై.రామవరంలో జరిగిన ‘సంపూర్ణ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయని, పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా తాగునీటి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. గిరిజన గ్రామాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.1