Shuru
Apke Nagar Ki App…
తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి కూటమి నేతలు కావాలనే అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ వ్యవహారం పై మంగళవారం పాతపట్నం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఆమెతోపాటు వైసీపీ నాయకులు ఉన్నారు.
ANR
తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి కూటమి నేతలు కావాలనే అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ వ్యవహారం పై మంగళవారం పాతపట్నం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఆమెతోపాటు వైసీపీ నాయకులు ఉన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం: పోలీసు ఉద్యోగులలో ఐకమత్యం,జట్టు సమన్వయం, శారీరక–మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం లోని తండేవలసలో గల పోలీస్ శిక్షణ కేంద్రం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ ప్రారంభ వేడుకలకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ముందుగా ఎస్పీ పోలీసు క్రీడాజ్యోతిని వెలిగించి,గాలిలోకి శాంతికి చిహ్నంగా పావురాలు, బెలూన్లు ఎగురవేసి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వివిధ క్రీడా పోటీలకు ప్రారంభ సంకేతం ఇచ్చారు. ఈ వార్షిక క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించనుండగా, శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖకు చెందిన శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లు, పోలీసు కార్యాలయం, ఆర్మ్డ్ రిజర్వ్, ఎస్‌టిఎఫ్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన మొత్తం ఏడు జట్లు వివిధ క్రీడాంశాల్లో పోటీపడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయి. ఈ వార్షిక క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో పురుషుల 400 మీటర్ల పరుగు, పురుషులు – మహిళల 100 మీటర్ల పరుగు,వంటి పోటీలను ప్రారంభించి, విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులు, సిబ్బంది క్రీడాకారులకు అభినిందచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు విధులు సాధారణంగా ఒత్తిడితో కూడుకున్నవి. అలాంటి పరిస్థితుల్లో క్రీడలు మనకు శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయిని ప్రతి ఒక్కరూ క్రీడాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.క్రీడా మైదానంలో ఉన్నప్పుడు విధులు,ఒత్తిడి పూర్తిగా మర్చిపోయి, జట్టు స్పూర్తితో విజయం వైపు ముందుకు సాగుతామని తెలిపారు.స్పోర్ట్స్ ద్వారా జట్టు సమన్వయం, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయిన్నారు. ఇవే లక్షణాలు పోలీసు విధుల్లో కూడా అత్యంత అవసరం అని అన్నారు. ప్రతి సబ్ డివిజన్,పోలీసు కార్యాలయంకు చెందిన అధికారులు, సిబ్బంది, ఎస్‌టిఎఫ్, హోంగార్డులు అందరూ ఆసక్తితో పాల్గొని, ఈ క్రీడా పోటీలను స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా నిర్వహించాలి.అలాగే క్రీడాకారులు అందరూ ఆరోగ్యంగా, క్రమశిక్షణతో, స్నేహపూర్వక వాతావరణంలో పోటీల్లో పాల్గొని ఈ మూడు రోజుల క్రీడా సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.వార్షిక స్పోర్ట్స్ & గేమ్స్ మీట్‌లో భాగంగా అథ్లెటిక్స్,వాలీబాల్, బ్యాడ్మింటన్,కబాడీ,క్రికెట్, బాస్కెట్ బాల్,షాట్ పుట్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్,వంటి వివిధ క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.చివరగా ఎస్పీ క్రీడల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసి, క్రీడా స్ఫూర్తిని నింపారు.4
- బొద్దంగ్రామంలో చోరీ జరిగిన ఇంటిని సందర్శించిన డీఎస్పీ మరియు అధికారులు. బొద్దంగ్రామంలో గత ఆదివారం జనపరెడ్డి వెంకటరమణ ఇంట్లో జరిగిన భారీ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంగళవారం నాడు ఇన్చార్జి డీఎస్పీ ఆర్. గోవిందరావు, ఎస్.కోట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. అప్పలనాయుడు, మరియు ఎస్.కోట ఇన్స్పెక్టర్ నారాయణ మూర్తి ఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి విచారణ చేపట్టారు. అధికారులు చోరీ జరిగిన గదులను, బీరువాలను మరియు నిందితులు ఇంట్లోకి ప్రవేశించిన మార్గాలను పరిశీలించారు. బాధితుడు వెంకటరమణ మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడి, పోయిన నగదు, నగలు మరియు ఇతర విలువైన వస్తువుల వివరాలను సేకరించారు. క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు, స్థానిక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ.. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.1
- డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.1
- అడ్డతీగల: దుచ్చర్తి వై.జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలవరం జిల్లాలో ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.1
- 🙏🙏1
- తూ.గో జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రాత్రి స్థానిక కల్యాణ మండపం వద్ద పులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్గా మారింది. గత 5రోజులుగా పులి భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసి, బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బీజాపూర్ సిటీ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.1
- పోలాకి:మండలం సుసరాం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టెక్కలి డివిజన్ శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్, మహిళ పిసి యమున బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు సెల్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రీల్స్ చూడటంతో పాటు, ఈ యాప్ పై కూడా దృష్టి సారించాలని, ప్రమాద సమయంలో ఇది ఆదుకుంటుందని తెలిపారు.1
- గిరిజన హక్కులు, చట్టాల సమర్థ అమలుకు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపి) నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ అల్లూరి జిల్లా కన్వీనర్ కిలో రాజన్ తెలిపారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు.గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలను గత పాలకులు విస్మరించారని ఆయన విమర్శించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని రాజన్ స్పష్టం చేశారు.1
- వై.రామవరంలో జరిగిన ‘సంపూర్ణ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయని, పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా తాగునీటి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. గిరిజన గ్రామాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.1