logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ సూచన జన్నారం ప్రభుత్వ ఐటిఐ కళాశాల, ఏటీసీ కేంద్రాలలో మొదటి విడతలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల రిపోర్టింగ్ తేదీని పొడిగించడం జరిగిందని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ వై రమేష్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటిఐ, ఎటిసి కేంద్రాలలో మొదటి విడుదల విద్యార్థులు అడ్మిషన్లు పొందారున్నారు. ఆ విద్యార్థులు ఆగస్టు 4 సాయంత్రం 5 గంటలలోపు ఆ కేంద్రాలలో రిపోర్టింగ్ చేయాలని, ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.

3 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
3 hrs ago
14279c50-c68d-47ca-89f3-028677efe180

అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ సూచన జన్నారం ప్రభుత్వ ఐటిఐ కళాశాల, ఏటీసీ కేంద్రాలలో మొదటి విడతలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల రిపోర్టింగ్ తేదీని పొడిగించడం జరిగిందని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ వై రమేష్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటిఐ, ఎటిసి కేంద్రాలలో మొదటి విడుదల విద్యార్థులు అడ్మిషన్లు పొందారున్నారు. ఆ విద్యార్థులు ఆగస్టు 4 సాయంత్రం 5 గంటలలోపు ఆ కేంద్రాలలో రిపోర్టింగ్ చేయాలని, ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    1
    ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు
అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం బట్టకాల్చి మీద వేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు అవినీతికి తావులేకుండా ప్రజలకు సేవలందిస్తున్నాం*తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం యూఐడీఎఫ్ నిధుల టెండర్లతో మాకు సంబంధమే లేదు టెండర్ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది *అవినీతి బురదలో కూరుకుపోయిన వాళ్లే బురద చల్లుతుంటే చూస్తూ ఊరుకోవాలా?* *అట్లాంటి వారికి లీగల్ నోటీసులు ఇవ్వండి* క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడ్చండి* తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం ‘‘గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించిన నాయకులే మనకు అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారు. మనకు సంబంధం లేని విషయంలోనూ బట్ట కాల్చి మీదేస్తున్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు. అట్లాంటి వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. వెంటనే లీగల్ నోటీసులు పంపండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోండి’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంగనర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను ఆదేశించారు. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో తమకు ఏ మాత్రం సంబంధం లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పారు. అయినప్పటికీ కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలనే తమపై అవినీతి బురద చల్లాలని చూస్తున్నారని చెప్పారు. అట్లాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈరోజు కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో యూఐడీఎఫ్ నిధుల అంశం, టెండర్ల వ్యవహారంపై చర్చించారు. ఈ విషయంలో తమకు సంబంధం లేనప్పటికీ పదేపదే బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ కావాలని బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని కొలగాని, సునీల్ రావు బండిసంజయ్ ద్రుష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ ‘‘యూఐడీఎఫ్ నిధుల టెండర్ల వ్యవహారం మనకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఆ టెండర్లో మనకు సంబంధమేంటి? కావాలనే బట్టకాల్చి మీదేయాలనుకుంటున్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ను ఏలిన వాళ్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, ప్రతి పనికీ లంచాలకు అలవాటుపడ్డారు. ఇతరుల మీద కూడా అట్లాంటి బురద చల్లాలనుకుంటున్నారు. వాళ్లను ఉపేక్షించొద్దు. వెంటనే లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కండి’’అని సూచించారు. బీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనతో విసిగిపోయిన కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతికి తావులేని విధంగా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే ఓర్వలేకపోతున్నారని తెలిపారు. ‘‘తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూదన్నదే మా విధానం. అదే సమయంలో నోటికి వచ్చినట్లు వాగుతూ అబద్దాలను ప్రచారం చేస్తూ ఏ తప్పు చేయకపోయినా మాపై అవినీతి బురద చల్లేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లాంటి వారిపై చట్ట, న్యాయపరమైన చర్యలకూ వెనుకాడబోం. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించి నిర్వహించిన టెండర్లతో మాకు సంబంధమే లేదు. ఇందులో ఏనాడూ ఇన్ వాల్వ్ కాలేదు. అయినా మాపై అవినీతి ఆరోపణలు చేస్తూ మా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. తక్షణమే వారికి లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయమైన చర్యలకు సిద్ధం కండి.’’అని మేయర్, డిప్యూటీ మేయర్ లకు స్పష్టం చేశారు.
    1
    తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి
మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం
బట్టకాల్చి మీద వేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు అవినీతికి తావులేకుండా ప్రజలకు సేవలందిస్తున్నాం*తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి
మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం
యూఐడీఎఫ్ నిధుల టెండర్లతో మాకు సంబంధమే లేదు
టెండర్ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది
*అవినీతి బురదలో కూరుకుపోయిన వాళ్లే  బురద చల్లుతుంటే చూస్తూ ఊరుకోవాలా?*
*అట్లాంటి వారికి లీగల్ నోటీసులు ఇవ్వండి* క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడ్చండి* తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి
మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం
‘‘గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించిన నాయకులే మనకు అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారు. మనకు సంబంధం లేని విషయంలోనూ బట్ట కాల్చి మీదేస్తున్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు. అట్లాంటి వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. వెంటనే లీగల్ నోటీసులు పంపండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోండి’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంగనర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను ఆదేశించారు. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో తమకు ఏ మాత్రం సంబంధం లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పారు. అయినప్పటికీ కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలనే తమపై అవినీతి బురద చల్లాలని చూస్తున్నారని చెప్పారు. అట్లాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. 
ఈరోజు కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో యూఐడీఎఫ్ నిధుల అంశం, టెండర్ల వ్యవహారంపై చర్చించారు. ఈ విషయంలో తమకు సంబంధం లేనప్పటికీ పదేపదే బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ కావాలని బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని కొలగాని, సునీల్ రావు బండిసంజయ్ ద్రుష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ ‘‘యూఐడీఎఫ్ నిధుల టెండర్ల వ్యవహారం మనకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఆ టెండర్లో మనకు సంబంధమేంటి? కావాలనే బట్టకాల్చి మీదేయాలనుకుంటున్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ను ఏలిన వాళ్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, ప్రతి పనికీ లంచాలకు అలవాటుపడ్డారు. ఇతరుల మీద కూడా అట్లాంటి బురద చల్లాలనుకుంటున్నారు. వాళ్లను ఉపేక్షించొద్దు. వెంటనే లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కండి’’అని సూచించారు. 
బీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనతో విసిగిపోయిన కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతికి తావులేని విధంగా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే ఓర్వలేకపోతున్నారని తెలిపారు. ‘‘తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూదన్నదే మా విధానం. అదే సమయంలో నోటికి వచ్చినట్లు వాగుతూ అబద్దాలను ప్రచారం చేస్తూ ఏ తప్పు చేయకపోయినా మాపై అవినీతి బురద చల్లేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లాంటి వారిపై చట్ట, న్యాయపరమైన చర్యలకూ వెనుకాడబోం. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించి నిర్వహించిన టెండర్లతో మాకు సంబంధమే లేదు. ఇందులో ఏనాడూ ఇన్ వాల్వ్ కాలేదు. అయినా మాపై అవినీతి ఆరోపణలు చేస్తూ మా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. తక్షణమే వారికి లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయమైన చర్యలకు సిద్ధం కండి.’’అని మేయర్, డిప్యూటీ మేయర్ లకు స్పష్టం చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    41 min ago
  • నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి మంత్రి కామెంట్స్ ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి.. అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఉత్తమ్ కుమార్ కామెంట్స్ శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా ఉన్నాయి బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా ఎలా ఉంది ప్రజలు గమనించాలి జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము
    4
    నిజామాబాదు జిల్లా 

శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి 

మంత్రి కామెంట్స్ 

ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది 

కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు

బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి 

గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు 

దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి..

అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది 
కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది 

కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది


ఉత్తమ్ కుమార్ కామెంట్స్ 

శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది 

మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది 



రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది  స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం 

మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది 

దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి 

నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు 

ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు 

కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై 

అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా  ఉన్నాయి 

బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా  ఎలా ఉంది ప్రజలు గమనించాలి 

జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము
    user_Boss
    Boss
    Photographer భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంటల సర్పంచ్ బంగారం.......... ADB: నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం తిరిగి MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంటాల గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే MLA అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సర్పంచ్ గంగారాం పేర్కొన్నారు.
    1
    బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంటల సర్పంచ్ బంగారం..........
ADB: నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం తిరిగి MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంటాల గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే MLA అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సర్పంచ్ గంగారాం పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • ​కుంటాల బి లో మళ్లీ గులాబీ జోష్ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో చేరికలు నెరడిగొండ మండలం కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వారు పార్టీలో చేరగా,ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగారాం మాట్లాడుతూ.. గతంలో మరో పార్టీలో చేరడం తప్పిదమని, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ సహకరిస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో కొనసాగుతామని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ​కుంటాల బి లో మళ్లీ గులాబీ జోష్ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో చేరికలు
నెరడిగొండ మండలం కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వారు పార్టీలో చేరగా,ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగారాం మాట్లాడుతూ.. గతంలో మరో పార్టీలో చేరడం తప్పిదమని, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ సహకరిస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో కొనసాగుతామని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    5 hrs ago
  • వరద పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ హరిత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం 146.65 మీటర్ల వద్ద ఉండగా, దిగువకు 7.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళుతోందని, ఎగువ నుంచి మరో 12 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆందోళనకర పరిస్థితి లేదని, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు వరద ప్రాంతాలు, నదీ తీరాలు, వంతెనల వద్దకు వెళ్లొద్దని, సెల్ఫీలు, ఈత వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, నీటి అవసరం తక్కువగా ఉండే పత్తి, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ వద్ద పెన్‌గంగా వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి, ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. వంతెన వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా ఆరా తీసి, నాణ్యతతో వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌సీ వినయ్ బాబు, డిప్యూటీ ఈఈ వెంకటరమణ, ఏఈ రాజ్‌కుమార్, తుమ్మిడిహెట్టి సర్పంచ్ సూరజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
    4
    వరద పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 కలెక్టర్ హరిత
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం 146.65 మీటర్ల వద్ద ఉండగా, దిగువకు 7.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళుతోందని, ఎగువ నుంచి మరో 12 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఆందోళనకర పరిస్థితి లేదని, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు వరద ప్రాంతాలు, నదీ తీరాలు, వంతెనల వద్దకు వెళ్లొద్దని, సెల్ఫీలు, ఈత వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, నీటి అవసరం తక్కువగా ఉండే పత్తి, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ వద్ద పెన్‌గంగా వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి, ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. వంతెన వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా ఆరా తీసి, నాణ్యతతో వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌సీ వినయ్ బాబు, డిప్యూటీ ఈఈ వెంకటరమణ, ఏఈ రాజ్‌కుమార్, తుమ్మిడిహెట్టి సర్పంచ్ సూరజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • నిరపుత్రి పూజ కోసం శబరిమల కు వెళ్ళిన తెలంగాణ అయ్యప్ప స్వాములు కేరళలోని పందలం శబరిమలలో ఆగస్టు 3వ తేదీన జరిగే నీరపుత్రి పూజకు తెలంగాణ రాష్ట్రంలోని అయ్యప్ప స్వాములు శబరిమల కు ప్రయాణమయ్యారు.
    1
    నిరపుత్రి పూజ కోసం శబరిమల కు వెళ్ళిన తెలంగాణ అయ్యప్ప స్వాములు
కేరళలోని పందలం శబరిమలలో ఆగస్టు 3వ తేదీన జరిగే నీరపుత్రి పూజకు తెలంగాణ రాష్ట్రంలోని అయ్యప్ప స్వాములు శబరిమల కు ప్రయాణమయ్యారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు...... ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పాలిచ్చే తల్లులకు ఉచితంగా ప్రోటీన్ పౌడర్, విటమిన్ బిళ్లలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 35వ డివిజన్ కార్పొరేటర్ సదావేణి సుజాత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, డాక్టర్ విజయ రేకులపల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లులకు 200 ప్రోటీన్ పౌడర్ బాక్సులు, రూ.50,000 విలువగల ఈఎస్‌వివై కంపెనీ విటమిన్ మాత్రలతో పాటు ప్లాస్టిక్ నివారణకు గుడ్డ సంచులను అందజేశారు. నవజాత శిశువుల సమగ్ర ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమని, ప్రతి తల్లి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ కృషిని కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మ్యాడం శివకాంత్, కార్యదర్శి బట్టు వినోద్, కోశాధికారి మేతుకు కృష్ణ చైతన్య, ఉదారంగా సహకరించిన గజవాడ రాధాకృష్ణ, గజవాడ ప్రభు, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
    3
    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు......
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పాలిచ్చే తల్లులకు ఉచితంగా ప్రోటీన్ పౌడర్, విటమిన్ బిళ్లలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 35వ డివిజన్ కార్పొరేటర్ సదావేణి సుజాత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, డాక్టర్ విజయ రేకులపల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తల్లులకు 200 ప్రోటీన్ పౌడర్ బాక్సులు, రూ.50,000 విలువగల ఈఎస్‌వివై కంపెనీ విటమిన్ మాత్రలతో పాటు ప్లాస్టిక్ నివారణకు గుడ్డ సంచులను అందజేశారు. నవజాత శిశువుల సమగ్ర ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమని, ప్రతి తల్లి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ కృషిని కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మ్యాడం శివకాంత్, కార్యదర్శి బట్టు వినోద్, కోశాధికారి మేతుకు కృష్ణ చైతన్య, ఉదారంగా సహకరించిన గజవాడ రాధాకృష్ణ, గజవాడ ప్రభు, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • *ఇంటి పనివాడే దొంగతనానికి సూత్రధారి..* *వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా జులై 31 :- *మొత్తం 1.4 కేజీల తులాల వెండి ఆభరణాలు,15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.* *బోథ్ సిఐ డి గురుస్వామి* బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసును వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బోథ్ సీఐ డి గురుస్వామి తెలిపారు. ఈ నెల 29న బోథ్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 186/2026, సెక్షన్ 331(4), 305 BNS కింద కేసు నమోదైంది. కేసు వివరాల ప్రకారం, సోనాల మండలం సూర్యనగర్ (సఖేరా) గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఈ నెల 26న తన తల్లిని తీసుకురావడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఫరాస్‌గావ్ గ్రామానికి వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు మరియు నగదును ట్రంకు పెట్టెలో భద్రపరచి ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఈ విషయాన్ని ఇంటి పనివాడైన *అర్జున్ ఆడే (A2) తనకు పరిచయం ఉన్న **రథోడ్ గణేష్ (A1)**కు తెలిపాడు. తమకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ఇద్దరూ కలిసి దొంగతనానికి పథకం రచించారు. అదే రోజు రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రథోడ్ గణేష్ ఇనుప రాడ్‌తో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉన్న 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,000 నగదును అపహరించగా, అర్జున్ ఆడే ఇంటి బయట కాపలా కాశాడు. అనంతరం దొంగిలించిన సొత్తును తమ మధ్య పంచుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన బోథ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించారు. కేసు నమోదైన విషయం తెలుసుకుని చోరీ సొత్తుతో పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి మొత్తం 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని బోథ్ పోలీస్ స్టేషన్ సీఐ డి గురుస్వామి సూచించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వి పురుషోత్తం, పోలీసు సిబ్బంది మదన్, హఫీజ్, రాహుల్, సంతోష్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    *ఇంటి పనివాడే దొంగతనానికి సూత్రధారి..*

*వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.*
*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా
జులై 31 :-
*మొత్తం 1.4 కేజీల తులాల వెండి ఆభరణాలు,15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.*
*బోథ్ సిఐ డి గురుస్వామి* 
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసును వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బోథ్ సీఐ డి గురుస్వామి తెలిపారు.
ఈ నెల 29న బోథ్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 186/2026, సెక్షన్ 331(4), 305 BNS కింద కేసు నమోదైంది. కేసు వివరాల ప్రకారం, సోనాల మండలం సూర్యనగర్ (సఖేరా) గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఈ నెల 26న తన తల్లిని తీసుకురావడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఫరాస్‌గావ్ గ్రామానికి వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు మరియు నగదును ట్రంకు పెట్టెలో భద్రపరచి ఇంటికి తాళం వేసి వెళ్లారు.
ఈ విషయాన్ని ఇంటి పనివాడైన *అర్జున్ ఆడే (A2) తనకు పరిచయం ఉన్న **రథోడ్ గణేష్ (A1)**కు తెలిపాడు. తమకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ఇద్దరూ కలిసి దొంగతనానికి పథకం రచించారు. అదే రోజు రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రథోడ్ గణేష్ ఇనుప రాడ్‌తో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉన్న 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,000 నగదును అపహరించగా, అర్జున్ ఆడే ఇంటి బయట కాపలా కాశాడు. అనంతరం దొంగిలించిన సొత్తును తమ మధ్య పంచుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన బోథ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించారు. కేసు నమోదైన విషయం తెలుసుకుని చోరీ సొత్తుతో పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి మొత్తం 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని బోథ్ పోలీస్ స్టేషన్ సీఐ డి గురుస్వామి సూచించారు.
దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వి పురుషోత్తం, పోలీసు సిబ్బంది మదన్, హఫీజ్, రాహుల్, సంతోష్ లను అభినందించారు. 
ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.