*పెళ్లిరోజు వేడుకలు పురస్కరించుకొని విద్యార్థులతో కలిసి ఆనందం పంచుకున్న దంపతులు* కథలాపూర్ జనవరి 08 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన బోయిని పద్మ కిషన్ దంపతులు వారి 14వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం కథలాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు అన్న ప్రసాదం అందజేశారు. విద్యార్థులు సంతోషంగా సామూహిక సహపంక్తి భోజనం చేశారు. వారిని పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు కలిసి దంపతులను శాలువాలతో సన్మానించారు.ఆయురారోగ్యాలతో, క్షేమంగా ఉండాలని కోరారు. భవిష్యత్తు లో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు.అనంతరం దంపతులకు విద్యార్థులు చప్పట్లతో ఉత్సాహంగా పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనిత, గంగారాం, రవి, మోహన్, దొప్పల జలంధర్, గాంధారి శ్రీనివాస్, కందరి కిషన్ రెడ్డి, మారంపల్లి రాజం, ఇప్పల దేవదాస్, సాయాబు, లక్ష్మణ్, బాలయ్య,పోశాలు తదితరులు పాల్గొన్నారు.
*పెళ్లిరోజు వేడుకలు పురస్కరించుకొని విద్యార్థులతో కలిసి ఆనందం పంచుకున్న దంపతులు* కథలాపూర్ జనవరి 08 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన బోయిని పద్మ కిషన్ దంపతులు వారి 14వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం కథలాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు అన్న ప్రసాదం అందజేశారు. విద్యార్థులు సంతోషంగా సామూహిక సహపంక్తి భోజనం చేశారు. వారిని పాఠశాల ప్రిన్సిపల్,
ఉపాధ్యాయులు కలిసి దంపతులను శాలువాలతో సన్మానించారు.ఆయురారోగ్యాలతో, క్షేమంగా ఉండాలని కోరారు. భవిష్యత్తు లో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు.అనంతరం దంపతులకు విద్యార్థులు చప్పట్లతో ఉత్సాహంగా పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనిత, గంగారాం, రవి, మోహన్, దొప్పల జలంధర్, గాంధారి శ్రీనివాస్, కందరి కిషన్ రెడ్డి, మారంపల్లి రాజం, ఇప్పల దేవదాస్, సాయాబు, లక్ష్మణ్, బాలయ్య,పోశాలు తదితరులు పాల్గొన్నారు.
- పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.1
- నాను మహారాజ్1
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- Post by Ravi Poreddy1
- ట్రాక్టర్ ఆటో ఢీకొని ఒకరు మృతి బాన్సువాడ ప్రతినిధి రెవిన్యూ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా ఒకేసారి రెండు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తరలించడానికి అనుమతులు ఇవ్వడంతో, వారు అట్టివేగంగా ట్రాక్టర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ట్రాక్టర్ల వల్ల, ఇసుక లారీల వల్ల బీర్కూర్, కిష్టాపూర్, కొల్లూర్, దామరించ, చించోల్లి బిచ్కుంద, జూకల్, పిట్లం, నిజం సాగర్, మద్నూర్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఒకటే రోజు చించొల్లి, కిష్టాపూర్ గ్రామాల మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. ఎక్కువగా ఇసుక ట్రిప్పులు జరుగుతే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలను తీస్తున్నారు. గురువారం రాత్రి బుడిమి నుంచి నాగారం గ్రామంలో వరి నాట్లు వేయడానికి వచ్చి తిరిగి వెళుతుండగా కొల్లూరు శివారులోని రైస్ మిల్ వద్ద 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ను అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకేసారి ఆటో బోల్తా పడి రుక్మిణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలు కుకురైన కూలీలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నారు. ఏ గ్రామానికి చెందిన ట్రాక్టర్, డ్రైవర్ ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.2
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, అధికారులు పాల్గొన్నారు.2