Shuru
Apke Nagar Ki App…
*పెదనందిపాడు మండల కేంద్రంలో పాత బస్టాండ్ సెంటర్లో ధర్నాను నిర్వహించిన రైతు సంఘ నాయకులు రైతులు మొక్కజొన్న పంటను వెంటనే 2400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Syyed taher
*పెదనందిపాడు మండల కేంద్రంలో పాత బస్టాండ్ సెంటర్లో ధర్నాను నిర్వహించిన రైతు సంఘ నాయకులు రైతులు మొక్కజొన్న పంటను వెంటనే 2400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం పరిధిలో గల పినకోటకు వెళ్లే ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుంచి బల్ల గురువు మీదుగా వాజంగి గ్రామానికి వెళ్లే రోడ్డును మరమ్మత్తులు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.15ఏళ్ళ క్రితం గ్రామాలకు రోడ్డు పనులు చేపట్టరన్నారు.అటుగా భారీ వాహనాలు వెళ్లడంతో 10కిలోమీటర్ల తారు రోడ్డు పూర్తిగాపాడైపోయి గోతులు ఏర్పడ్డాయి.తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బంగారు జాల కు చెందిన మహిళపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. తనతో మాట్లాడుకుందామని చెప్పి కోపంతో ఆమెపై బీరు సీసా, కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని బంగారు జలకకు చెందిన తాటి నికిత (24) ఒక కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మండల పరిధిలోని కరకవాగు ప్రాంతానికి చెందిన వజ్జా పవన్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం నటరాజ్ సెంటర్ వద్ద ఆమెను అడ్డగించి వేధించడమే కాకుండా, అందరి ముందూ భయభ్రాంతులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. ఫిర్యాదు రాసిమ్మని సిబ్బంది చెప్పటంతో స్టేషన్ నుండి బయటకు వస్తున్న క్రమం లో, పవన్ మరో వ్యక్తి (ఆటో డ్రైవర్) కలిసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కరకవాగు రైల్వే ట్రాక్ ప్రాంతానికి తీసుకువెళ్లాడని యువతి తెలిపింది.. పవన్, అక్కడ యువతిపై అత్యాచారం చేసి,బీరు సీసా, కర్రతో కొట్టడంతో ఆమె తల, చేతులు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలిని ఆటోలోనే ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేసి నిందితుడు పరారయ్యాడని యువతి ఆరోపిస్తుంది... ప్రస్తుతం బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.4
- నెల్లూరు నగరంలో భాస్కర్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభం నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా జేమ్స్ గార్డెన్ థర్డ్ క్రాస్ రోడ్డు వెంకటరమణాపురం ఎస్ఆర్ఎం ట్రావెల్స్ సమీపంలో భాస్కర్ ఆర్థోపెటిక్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరులోని నాయకులు నేతలు పాల్గొన్నారు. అధునాతన ఎక్విప్మెంట్తో నగరాలకు మాత్రమే పరిమితంగా ఉండే ఇటువంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ భాస్కర్ డాక్టర్ నీరజాలను అభినందించారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు డాక్టర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.4
- Post by Bondhu Suresh1
- నల్గొండ బ్రేకింగ్: _ప్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్న జనం అనుకునేరు! ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు ఎగబడుతున్న తల్లిదండ్రులు.!_ నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడా *కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల* లో అడ్మిషన్ల కోసం భారీగా క్యూ లైన్లు... తెల్లవారుజామునే పాఠశాల గేట్ల ముందు తల్లిదండ్రులు, విద్యార్థుల రద్దీ! కార్పొరేట్ స్కూల్స్‌కు గీటుగా,పోటీగా మారిన ప్రభుత్వ పాఠశాలపై ప్రశంసల వెల్లువ... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఆధునిక విద్యా మందిరం... స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్‌తో విద్యార్థులకు నూతన అనుభవం... పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం – తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోంది... విశాలమైన క్రీడా మైదానం – చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం... అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు – నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.. నల్గొండ జిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచీ భారీగా దరఖాస్తులు... *ఇది ప్రభుత్వ పాఠశాల కాదు.. కార్పొరేట్ స్థాయి కు దీటైన విశ్వ విద్యాలయం..* అంటూ తల్లిదండ్రుల అభిప్రాయం... ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచిన మోడల్ స్కూల్‌గా నిలిచిన కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ స్కూల్... ప్రభుత్వ విద్యకు కొత్త దిశ – మంత్రి విజన్‌కు ఇదే నిదర్శనం.. అంటూ ప్రజల ప్రశంసలు... సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ కోసం పోటీ తీవ్రం... ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుతూ.. నల్గొండలో విద్యా విప్లవానికి నాంది పలుకుతున్న బొట్టుగూడా కోమటిరెడ్డి ప్రతీక్ హై స్కూల్!1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఏనుగల్లు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సరైన ధర కల్పించడం, పంట సేకరణను సులభతరం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.1
- Post by Syyed taher1
- సంఘ సంస్కర్తగా, దళితుల పక్షపాతిగా బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు నేటితరానికి ఆదర్శమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. భారత తొలి దళిత ఉప ప్రధానమంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జివన్ రామ్ 119వ జయంతిని ఆదివారం స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నందు బాబూ జగ్జివన్ రామ్ విగ్రహ నిర్మాణం కమిటీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాబీర్ పాషా తొలుత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యదయానికి అహర్నిశలు కృషి చేశారని, మహాణీయుల్లో జగ్జీవన్ రామ్ ప్రముఖుడన్నారు. భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రిగా నిస్వార్ధంగా సేవలందించారని, మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్ గా ప్రజల పక్షాన వారి గళాన్ని వినిపించి ప్రజలు, నిమ్నజాతి సంక్షేమకోసం అహర్నిషలు కృషి చేశారన్నారు. అసమానతలు లేని సమాజ స్థాపనకోసం జగ్జీవన్ రామ్ పరితపించాడని అన్నారు. అయన అందించిన సేవలకు గుర్తింపుగా దేశ ప్రజలు బాబూజీగా నామకరణం చేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని కులరక్కసిని పారద్రోలేందుకు కృషి చేయాలని, రాజ్యంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.3
- తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ 2025 ఉత్తమ ఫోటోజర్నలిస్టుల అవార్డు ప్రధాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్, నాంపల్లి, తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఏం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నల్గొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ అవార్డు అందుకున్నరు1