Shuru
Apke Nagar Ki App…
నాగర్ కర్నూల్ :చదువుకు పేదరికం అడ్డుకావద్దు: అదనపు కలెక్టర్ నాగర్‌కర్నూల్ టౌన్: నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా దాతలు ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్, శ్యాంప్రసాద్ లాల్ కోరారు. క్లాస్మేట్ క్లబ్ 111వ రోజు సేవా కార్యక్రమంలో భాగంగా హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10 వేల నగదు ప్రోత్సాహకాన్ని మంగళవారం పంపిణీ చేశారు. జర్నలిస్టు సంఘాల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శనీయమన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రమణ కుమార్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
MALLIKARJUN T
నాగర్ కర్నూల్ :చదువుకు పేదరికం అడ్డుకావద్దు: అదనపు కలెక్టర్ నాగర్‌కర్నూల్ టౌన్: నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా దాతలు ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్, శ్యాంప్రసాద్ లాల్ కోరారు. క్లాస్మేట్ క్లబ్ 111వ రోజు సేవా కార్యక్రమంలో భాగంగా హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10 వేల నగదు ప్రోత్సాహకాన్ని మంగళవారం పంపిణీ చేశారు. జర్నలిస్టు సంఘాల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శనీయమన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రమణ కుమార్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మన్ననూరు పీహెచ్‌సీని సందర్శించిన ఆయన లేబర్ రూమ్, ల్యాబ్, మెడికల్ స్టోర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపీ సంఖ్యను పెంచి, పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.1
- పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- Post by Mohammed javeed1
- ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.1
- ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్1
- వికారాబాద్, నవాబ్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను అందజేసింది. అందులో భాగంగా నూతనంగా నవాబుపేట మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీచర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో చిన్నారుల అభివృద్ధికి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం అందజేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వారి పనితీరును మరింత సులభతరం చేస్తాయని టెక్నాలజీ సహాయంతో సేవలను వేగవంతంగా పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.1
- నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే )సందర్బంగా బాదంపప్పు బద్ద పై మైక్రో బ్రష్ ల తో వాటర్ కలర్ పెయింటిగ్స్ ద్వారా నలబై సూక్ష్మ చిత్రాలను ఒక గంటలో వేసి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో భూమాత భూమిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ వేదనతో వేడుకున్నట్లు, అలాగే వన్య ప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించి పోయి భూమాతకు మొర పెట్టుకున్నట్లు, ఎండి పోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల,జంతువుల కళే బరాలు వున్నట్లు, అలాగే నీటి బొట్టులో చెట్టు వున్నట్లు అంటే నీరును, చెట్లను కాపాడు కోవాలని అర్థం. ఇలా చిన్న బాదం పప్పు పై ఇన్ని సూక్ష్మ చిత్రాలను వేసానని తెలిపారు .ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ సకల జీవరాశులకు భూమి నిలయం. కాని మానవులు తమ అవసరాల కోసం భూమికి హాని కలిగిస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి అత్యంత వేడిమి వుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. భూమి మీద దృష్టి పెట్టకుంటే భవిష్యత్ లో మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి. మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నీటిని వృధా చేయకూడదు, విపరీతంగా చెట్లను పెంచాలి. పర్యావరణం పచ్చగా వుంటేనే భూమిలోని వేడి తగ్గి చల్ల బరుస్తుంది. ప్రతి జీవరాశికి భూమిలో నివసించే హక్కు వుంది. భూమి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ప్రభుత్వం కూడా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి భూమిని కాపాడుకోవాలని తెలియ చెప్పాలి . భూమి నుండి అన్ని అవసరాలు తీర్చుకొని మనం భూమిని కాపాడుకోలేక పోతున్నాము . నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమినుండి వచ్చిందే. భూమి అంటే మనకు కావాలిసినది ఇచ్చే అక్షయపాత్ర.మన భూమిని చేయకు - మరు భూమి.అందరూ పర్యావరణాన్ని కాపాడుకొని భూమిని రక్షించు కొందాం అని పిలుపునిచ్చారు.1
- जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।1