కామారెడ్డి మెడికల్ సెంటర్‌లోనిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు కామారెడ్డి: కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన ఓ గిరిజన యువతికి అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన Thrombotic Thrombocytopenic Purpura వ్యాధి సోకగా, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గడంతో అత్యవసరంగా Therapeutic Plasma Exchange చికిత్సతో పాటు స్టెరాయిడ్ థెరపీ అందించారు. చికిత్సకు స్పందించడంతో ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే TTP వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రోగిని కాపాడవచ్చని కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ డా. జి. విద్యుత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో జరిగిన ఈ ప్రెస్ మీట్‌లో TTP లక్షణాలు, చికిత్స, సకాలంలో వైద్యం అందించడం ప్రాముఖ్యతపై వైద్యులు అవగాహన కల్పించారు.
కామారెడ్డి మెడికల్ సెంటర్‌లోనిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు కామారెడ్డి: కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన ఓ గిరిజన యువతికి అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన Thrombotic Thrombocytopenic Purpura వ్యాధి సోకగా, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గడంతో
అత్యవసరంగా Therapeutic Plasma Exchange చికిత్సతో పాటు స్టెరాయిడ్ థెరపీ అందించారు. చికిత్సకు స్పందించడంతో ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే TTP వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రోగిని కాపాడవచ్చని కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ డా. జి. విద్యుత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో జరిగిన ఈ ప్రెస్ మీట్‌లో TTP లక్షణాలు, చికిత్స, సకాలంలో వైద్యం అందించడం ప్రాముఖ్యతపై వైద్యులు అవగాహన కల్పించారు.
- కామారెడ్డి మెడికల్ సెంటర్‌లోనిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు కామారెడ్డి: కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన ఓ గిరిజన యువతికి అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన Thrombotic Thrombocytopenic Purpura వ్యాధి సోకగా, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గడంతో అత్యవసరంగా Therapeutic Plasma Exchange చికిత్సతో పాటు స్టెరాయిడ్ థెరపీ అందించారు. చికిత్సకు స్పందించడంతో ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే TTP వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రోగిని కాపాడవచ్చని కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ డా. జి. విద్యుత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో జరిగిన ఈ ప్రెస్ మీట్‌లో TTP లక్షణాలు, చికిత్స, సకాలంలో వైద్యం అందించడం ప్రాముఖ్యతపై వైద్యులు అవగాహన కల్పించారు.2
- ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లోకి చేరికలు.. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరిన మోడేగావ్ గ్రామ సర్పంచ్ కౌడెల్లి గంగాధర్‌తో పాటు పలువురు* సదాశివనగర్ మండలం మోడేగావ్ గ్రామానికి చెందిన సర్పంచ్ *కౌడెల్లి గంగాధర్*తో పాటు *జువ్వాడ భిక్షపతి, దాసరి భాస్కర్, పెద్ద రాజయ్య, జువ్వల శ్రీనివాస్, బెస్త రాములు* తదితరులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే *మదన్ మోహన్ గారి* నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. *కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని* ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ముఖ్యంగా **ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్** వంటి సంక్షేమ కార్యక్రమాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి చొరవతో *మోడేగావ్ గ్రామంలో *రూ.35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం*, *రూ.10 లక్షలతో స్వయం సహాయక సంఘాల (SHG) భవనానికి నిధుల మంజూరు*తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తమను ఆకర్షించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చేస్తున్న కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు మరింత పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. మోడేగావ్ గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల అధ్యక్షులు గ్రామ ఉపసర్పంచ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.3
- మెదక్ : ఆషాఢ మాసం లో ఆర్య వైశ్య మహిళల విభాగం సభ్యుల భక్తి ర్యాలీ ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో భక్తి ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోదండరామాలయం నుంచి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు మహిళలు భారీగా ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడిబియ్యం సమర్పించారు. అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ర్యాలీ కొనసాగింది.2
- భీమేశ్వర ఆలయంలో ఈవో ఆకస్మిక తనిఖీ భక్తుల సౌకర్యాలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి వివిధ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశానికి భక్తుల మాదిరిగా వెళ్లి అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. భక్తులను డబ్బులు అడుగుతున్నారనే విషయంపై ఆరా తీసి, అక్కడి పరిస్థితులను భక్తులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆలయంలో దీపాలు విక్రయించే ప్రదేశాన్ని పరిశీలించి, భక్తులకు నాణ్యమైన దీపాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. విక్రయ కేంద్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వికలాంగులు, చిన్నారులు, వృద్ధులు సులభంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారా, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. దర్శన ఏర్పాట్లను పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేశారు. ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఈవో రమాదేవి గారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ పరిసరాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ తనిఖీలో డీఈఓ నవీన్, డి ఈ రామ్ కిషన్ రావు, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.2
- ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.1
- వేములవాడ భీమన్నను దర్శించుకున్న ప్రముఖ సింగర్ సత్యవతి రాథోడ్ (మంగ్లీ) శ్రీ భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు ఆలయ అర్చకుల ఆశీర్వచనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని సత్యవతి రాథోడ్ (మంగ్లీ) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మంగ్లీకి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వామి, అమ్మవార్ల శేష వస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు పేరుక శ్రీనివాస్, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.2
- జైల్ బరోతో దద్దరిల్లిన కామారెడ్డి* **అడుగడుగునా పోలీసుల అరెస్టులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేతల అరెస్టు* కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన *జైల్ బరోతో దద్దరిల్లిన కామారెడ్డి* **అడుగడుగునా పోలీసుల అరెస్టులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేతల అరెస్టు* *కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన* *అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్* లేబర్ కోర్డుల రద్దు పాత కార్మిక చట్టాల అమలు కోసం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం శాంతియుతంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్షి కొత్త నర్సింలు అరుణ్ ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కేంద్ర ప్రభుత్వానికి కామారెడ్డి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని తేటతెల్లమైందన్నారు ఈ దేశంలో రైతులు కార్మికులు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆ హక్కులు కోల్పోయే విధానాలు అమలు చేసేవే లేబర్ కోడులన్నారు భారత రాజ్యాంగాన్ని హాజరు పరిస్థితి దానికి వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల నుండి 85 ఏళ్ల ముసలి వాళ్ళని సైతం చట్టాన్ని ధిక్కరిస్తున్నారు అనే సాకుతో నరహత్యలకు పాల్పడుతుందన్నారు ఒకపక్క రాముని పేరుతో దేవుడు గుళ్లను దోపిడీ చేస్తూ మరోపక్క ప్రజల ప్రాణాలు తీస్తూ పదాన్ని అంబానీలకు దేశ సంపదను భూమిని భూమిలో ఉన్న ఖనిజ సంపదనం దోచిపెడుతుందని దానికి అడ్డుగా ఉన్న ప్రశ్నించిన మేధావులు ప్రజలపై దేశద్రోహం కేసులు పెడుతూ భారత పౌరులపై భారత పౌరులను ఉపయోగించి హత్యలు చేయిస్తుందని విమర్శించారు ఇప్పటికే భారత ప్రభుత్వ ఆస్తులు సగానికి పైగా అమ్మేసి భారత రాజ్యాంగం రద్దుకు కుట్ర జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొత్త నరసింహులు వెంకటి సిఐటియు నాయకులు రాజనర్సిం ముదాం అరుణ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్ల మోహన్ మున్సిపల్ యూనియన్ నాయకులు మహబూబ్ నర్సింగరావు సంతోష్ దీవెన శివ రాజవ్వ అంగన్వాడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబాయమ్మ ఇందిరా లక్ష్మి ఆశ యూనియన్ నాయకులు రాజశ్రీ మమత గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బాల్నర్సు మాచరెడ్డి బాలనరు స్వామి దశరథ్ తదితరులు పాల్గొన్నారు1