*ఘనంగా కేర్ వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య శిబిరం* SHOT NEWS:పల్నాడు జిల్లా పెదకూరపాడులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ఆవరణలో కేర్ వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఉచిత మెగా వైద్య శిబిరం" విజయవంతంగా ముగిసింది. పెదకూరపాడు టీడీపీ నాయకులు అరిమళ్ల రమేష్ గారు, ఏటుకూరి బ్రహ్మయ్య గారు, షేక్ ముంతాజ్ గారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ & లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నాజర్ బాషా (MD, DM) గారు పాల్గొని అనేకమంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు ₹5,000 విలువైన మెడికల్ ల్యాబ్ పరీక్షలు, స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత వైద్య సలహాలను ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించారు. స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో హాజరై ఈ వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కేర్ వెల్ హాస్పిటల్ సిబ్బందికి మరియు ప్రజలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
*ఘనంగా కేర్ వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య శిబిరం* SHOT NEWS:పల్నాడు జిల్లా పెదకూరపాడులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ఆవరణలో కేర్ వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఉచిత మెగా వైద్య శిబిరం" విజయవంతంగా ముగిసింది. పెదకూరపాడు టీడీపీ నాయకులు అరిమళ్ల రమేష్ గారు, ఏటుకూరి బ్రహ్మయ్య గారు, షేక్ ముంతాజ్ గారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ & లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నాజర్ బాషా (MD, DM) గారు పాల్గొని అనేకమంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు ₹5,000 విలువైన మెడికల్ ల్యాబ్ పరీక్షలు, స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత వైద్య సలహాలను ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించారు. స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో హాజరై ఈ వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కేర్ వెల్ హాస్పిటల్ సిబ్బందికి మరియు ప్రజలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- రైల్వే ఎకోపార్క్ లో మొక్కలు నాటిన కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా గ్రీనరీ 7 శాతంతో అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో గుంటూరు నగరంలో రైల్వే ఎకోపార్క్ లో నగరంలోని పౌర సంస్థలు 1500 మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాయని చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈనెల 24వ తేదీన గుంటూరులోని రైల్వే ఎకోపార్క్ లో కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు కొత్తగా 100 మొక్కలు నాటడం మరొక 200 మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంపుదలకు కృషి చేశారు. కల్లం హరినాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెక్రటరి డా|| యం. ఉమా శంకర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా|| బి.ఎస్.బి. రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రొఫెసర్ డి. శ్రీనివాసులు నేతృత్వంలో 60 మంది విద్యార్థినీ,విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మొక్కలు నాటి సంరక్షణను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ పర్యావరణ సమతుల్యత మరియు పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నేటితరం విద్యార్థుల్లో పర్యావరణం పట్ల బాధ్యతను పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. భూతాపాన్ని తగ్గించడంలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. వృక్షాలు జీవవైవిద్య పరిరక్షణకు తోడ్పడుతాయని మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడుతాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమిలో 31 శాతం గ్రీనరీతో ఉందని దాదాపు 3 లక్షల కోట్ల చెట్లు ప్రపంచంలో ఉన్నాయని రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా దేశాలలో గ్రీనరీ అత్యధికంగా ఉందని విద్యార్థులకు వివరించారు. భారత అటవీ సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలో 20 శాతం గ్రీనరీ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 18 శాతం లోపుగా ఉందని, గుంటూరు జిల్లాలో 7 శాతం మాత్రమే ఉండడం దురదృష్టకరమన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తోడ్పాటుతో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైల్వే డివిజన్ అధికారులు ఎస్. మంజునాథ్, రామ శేష రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి పాల్గొన్నారు.1
- అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే వ్యక్తిని తాను కాదని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యునిగా తన కార్యాలయానికి ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు, వివిధ వర్గాల వారు వస్తుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.మేఘన కుటుంబ వ్యవహారం కావడంతో ఇరు వర్గాలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు వివరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తన పాత్ర కేవలం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడం వరకే పరిమితమైందని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం, తన వ్యవహారశైలి ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని నేను కాదు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు. ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24: కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే వ్యక్తిని తాను కాదని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.శాసనసభ్యునిగా తన కార్యాలయానికి ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు, వివిధ వర్గాల వారు వస్తుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. మేఘన కుటుంబ వ్యవహారం కావడంతో ఇరు వర్గాలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వివరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తన పాత్ర కేవలం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడం వరకే పరిమితమైందని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం, తన వ్యవహారశైలి ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.1
- ట్రేడింగ్ పేరుతో మోసం: గోల్డ్ శేఖర్, అరాఫత్‌పై చర్యలకు ఫిర్యాదు నరసరావుపేటకు చెందిన కందుకూరి వీరశేఖర్ (గోల్డ్ శేఖర్), అరాఫత్‌లు ట్రేడింగ్ పేరుతో పెట్టుబడులు తీసుకుని మోసం చేశారంటూ బాధితుడు భాషా సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో డీఆర్వోకు మెమోరాండం సమర్పించారు. తన వద్ద నుంచి దఫాల వారీగా సుమారు రూ.20 లక్షలు తీసుకుని, అనంతరం క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోయాయని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఇదే విధంగా మరికొందరిని కూడా మోసం చేసినట్లు పేర్కొంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై తగిన చర్యల కోసం పట్టణ రెండో పోలీస్ స్టేషన్‌కు అధికారులు ఫార్వర్డ్ చేశారు.1
- చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్లో మందుబాబులు వీరంగం కృష్ణ జిల్లా మచిలీపట్నం : చిలకపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్ లో మందు బాబుల వీరంగం ఒకరి ఫై ఒకరు దాడి చేసుకున్న ఇరువురు వ్యక్తులు కనుముడి నాగరాజు అనే వ్యక్తి ఫై దాడి చేసిన వేముల. మహేష్ అనే వ్యక్తి మెరుగైన చికిత్స కోసం నాగరాజు ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయవాడ ఆసుపత్రి కు తరలిస్తున్న వైద్యులు కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు1
- భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.1
- బోనమెత్తిన పల్లె... కొత్త కొత్తూరు గ్రామంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు... బోనమెత్తిన పల్లెలు... నేలకొండపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం బోనమెత్తారు. ముత్యాలమ్మ తల్లి పండగ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. బోనాలను ఎత్తుకుని ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారికి బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాలలో కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా పడాలని... పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తకొత్తూరు గ్రామంలో బొడ్రాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల * సీతారాములు, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.1
- గుంటూరులో నగరపాలక సంస్థలో ఏసీబీ దాడులు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో పది మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొని రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏసీబీ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో నగరపాలక సంస్థలోని ఇతర విభాగాల అధికారులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది.1