logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైల్వే ఎకోపార్క్ లో మొక్కలు నాటిన కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా గ్రీనరీ 7 శాతంతో అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో గుంటూరు నగరంలో రైల్వే ఎకోపార్క్ లో నగరంలోని పౌర సంస్థలు 1500 మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాయని చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈనెల 24వ తేదీన గుంటూరులోని రైల్వే ఎకోపార్క్ లో కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు కొత్తగా 100 మొక్కలు నాటడం మరొక 200 మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంపుదలకు కృషి చేశారు. కల్లం హరినాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెక్రటరి డా|| యం. ఉమా శంకర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా|| బి.ఎస్.బి. రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రొఫెసర్ డి. శ్రీనివాసులు నేతృత్వంలో 60 మంది విద్యార్థినీ,విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మొక్కలు నాటి సంరక్షణను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ పర్యావరణ సమతుల్యత మరియు పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నేటితరం విద్యార్థుల్లో పర్యావరణం పట్ల బాధ్యతను పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. భూతాపాన్ని తగ్గించడంలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. వృక్షాలు జీవవైవిద్య పరిరక్షణకు తోడ్పడుతాయని మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడుతాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమిలో 31 శాతం గ్రీనరీతో ఉందని దాదాపు 3 లక్షల కోట్ల చెట్లు ప్రపంచంలో ఉన్నాయని రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా దేశాలలో గ్రీనరీ అత్యధికంగా ఉందని విద్యార్థులకు వివరించారు. భారత అటవీ సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలో 20 శాతం గ్రీనరీ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 18 శాతం లోపుగా ఉందని, గుంటూరు జిల్లాలో 7 శాతం మాత్రమే ఉండడం దురదృష్టకరమన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తోడ్పాటుతో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైల్వే డివిజన్ అధికారులు ఎస్. మంజునాథ్, రామ శేష రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

1 hr ago
user_SHOT NEWS
SHOT NEWS
Advertising agency Guntur, Andhra Pradesh•
1 hr ago

రైల్వే ఎకోపార్క్ లో మొక్కలు నాటిన కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా గ్రీనరీ 7 శాతంతో అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో గుంటూరు నగరంలో రైల్వే ఎకోపార్క్ లో నగరంలోని పౌర సంస్థలు 1500 మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాయని చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈనెల 24వ తేదీన గుంటూరులోని రైల్వే ఎకోపార్క్ లో కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు కొత్తగా 100 మొక్కలు నాటడం మరొక 200 మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంపుదలకు కృషి చేశారు. కల్లం హరినాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెక్రటరి డా|| యం. ఉమా శంకర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా|| బి.ఎస్.బి. రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రొఫెసర్ డి. శ్రీనివాసులు నేతృత్వంలో 60 మంది విద్యార్థినీ,విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మొక్కలు నాటి సంరక్షణను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ పర్యావరణ సమతుల్యత మరియు పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నేటితరం విద్యార్థుల్లో పర్యావరణం పట్ల బాధ్యతను పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. భూతాపాన్ని తగ్గించడంలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. వృక్షాలు జీవవైవిద్య పరిరక్షణకు తోడ్పడుతాయని మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడుతాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమిలో 31 శాతం గ్రీనరీతో ఉందని దాదాపు 3 లక్షల కోట్ల చెట్లు ప్రపంచంలో ఉన్నాయని రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా దేశాలలో గ్రీనరీ అత్యధికంగా ఉందని విద్యార్థులకు వివరించారు. భారత అటవీ సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలో 20 శాతం గ్రీనరీ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 18 శాతం లోపుగా ఉందని, గుంటూరు జిల్లాలో 7 శాతం మాత్రమే ఉండడం దురదృష్టకరమన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తోడ్పాటుతో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైల్వే డివిజన్ అధికారులు ఎస్. మంజునాథ్, రామ శేష రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం లారీ డ్రైవర్‌పై దాడి గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం చూపించి ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడి చేశాడు.రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్ షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    1
    గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం లారీ డ్రైవర్‌పై దాడి
గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం చూపించి ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడి చేశాడు.రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం. కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు . మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No 222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు. ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే, అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్. సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం
నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం.
కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు .
మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో  వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని  హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No  222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన  ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు.
ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో  పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే,  అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్.  సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.  కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    1
    వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఖమ్మం జిల్లా లో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుందివర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుంది. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
    1
    ఖమ్మం జిల్లా లో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుందివర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు
ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుంది. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • అంగరంగ వైభవంగా తీస్ సంబరాలు బంజారా సాంప్రదాయ లో భాగంగా అత్యంత వైభవంగా వేడుక... అంగరంగం వైభవంగా తీజ్ వేడుకలు నేలకొండపల్లి మండలం లోని శంకర్ గిరి తండా లో ఆదివారం తీజ్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డీజే ఆటా, పాటలతో గిరిజన సాంప్రాదాయ వస్త్రాలతో నృత్యాలు చేశారు. మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఘనంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ..... గ్రామంలో, అక్కా చెల్లెలు ఆడబిడ్డలు అన్నదమ్ములు సంస్కృతి సాంప్రదాయాల పండగ గతంలో లేని విధంగా ఎంతో ఆనందంగా ముగింపు సందర్భంగా దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. పంచాయతీ సర్పంచ్ ధరావత్ దీప్లా సరోజిని దంపతులు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, మొక్కులు చెల్లించగానే..అదే సమయంలో వర్షం పడటంతో గిరిజనుల సంబురాలు అంబరాన్నింటాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    1
    అంగరంగ వైభవంగా తీస్ సంబరాలు 
 బంజారా సాంప్రదాయ లో భాగంగా అత్యంత వైభవంగా వేడుక...
అంగరంగం వైభవంగా తీజ్ వేడుకలు
నేలకొండపల్లి
మండలం లోని శంకర్ గిరి తండా  లో ఆదివారం తీజ్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డీజే ఆటా, పాటలతో గిరిజన సాంప్రాదాయ వస్త్రాలతో నృత్యాలు చేశారు. మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఘనంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ..... గ్రామంలో, అక్కా చెల్లెలు ఆడబిడ్డలు అన్నదమ్ములు  సంస్కృతి సాంప్రదాయాల పండగ  గతంలో లేని విధంగా  ఎంతో ఆనందంగా ముగింపు సందర్భంగా దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. పంచాయతీ సర్పంచ్ ధరావత్ దీప్లా సరోజిని  దంపతులు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, మొక్కులు చెల్లించగానే..అదే
సమయంలో వర్షం పడటంతో గిరిజనుల సంబురాలు
అంబరాన్నింటాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_తేజవత్ గిరిబాబు
    తేజవత్ గిరిబాబు
    Local News Reporter Nelakondapalli, Khammam•
    20 hrs ago
  • ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాఠశాలలో ఉప్మా తిన్న అనంతరం 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని వేంసూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. విద్యార్థుల అస్వస్థతకు అసలు కారణమేంటి? ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు పథకాలు అమలు చేస్తున్నా.. ఆహారం నాణ్యత విషయంలో ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనంపై అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉంది? వంట సిబ్బంది నిర్లక్ష్యమా? వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యత లోపమా? లేక పథకాల అమలులోనే లోపాలున్నాయా? విద్యార్థుల భోజనం విషయంలో కక్కుర్తికి తావులేకుండా.. నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం వద్దని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    4
    ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.
పాఠశాలలో ఉప్మా తిన్న అనంతరం 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే వారిని వేంసూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అయితే.. విద్యార్థుల అస్వస్థతకు అసలు కారణమేంటి?
ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు పథకాలు అమలు చేస్తున్నా..
ఆహారం నాణ్యత విషయంలో ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి?
హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనంపై అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉంది?
వంట సిబ్బంది నిర్లక్ష్యమా?
వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యత లోపమా?
లేక పథకాల అమలులోనే లోపాలున్నాయా?
విద్యార్థుల భోజనం విషయంలో కక్కుర్తికి తావులేకుండా.. నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం వద్దని..
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    48 min ago
  • *ఘనంగా కేర్ వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య శిబిరం* SHOT NEWS:​పల్నాడు జిల్లా పెదకూరపాడులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ఆవరణలో కేర్ వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఉచిత మెగా వైద్య శిబిరం" విజయవంతంగా ముగిసింది. పెదకూరపాడు టీడీపీ నాయకులు అరిమళ్ల రమేష్ గారు, ఏటుకూరి బ్రహ్మయ్య గారు, షేక్ ముంతాజ్ గారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ & లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నాజర్ బాషా (MD, DM) గారు పాల్గొని అనేకమంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు ₹5,000 విలువైన మెడికల్ ల్యాబ్ పరీక్షలు, స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత వైద్య సలహాలను ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించారు. స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో హాజరై ఈ వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కేర్ వెల్ హాస్పిటల్ సిబ్బందికి మరియు ప్రజలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
    1
    *ఘనంగా కేర్ వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య శిబిరం*
SHOT NEWS:​పల్నాడు జిల్లా పెదకూరపాడులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ఆవరణలో కేర్ వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఉచిత మెగా వైద్య శిబిరం" విజయవంతంగా ముగిసింది. పెదకూరపాడు టీడీపీ నాయకులు అరిమళ్ల రమేష్ గారు, ఏటుకూరి బ్రహ్మయ్య గారు, షేక్ ముంతాజ్ గారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ & లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నాజర్ బాషా (MD, DM) గారు పాల్గొని అనేకమంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు ₹5,000 విలువైన మెడికల్ ల్యాబ్ పరీక్షలు, స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత వైద్య సలహాలను ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించారు. స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో హాజరై ఈ వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కేర్ వెల్ హాస్పిటల్ సిబ్బందికి మరియు ప్రజలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    3 hrs ago
  • సంచలన వీడియోను విడుదల చేసిన మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ నెలరోజులుగా నేను, నా కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురయ్యాం అని మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ సంచలన వీడియోను విడుదల చేశారు.ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్క వీడియోనే బయటపెడుతున్నాం. కేసు కోర్టు పరిధిలో ఉండటం వలన ఒక్క వీడియోనే బయటపెడుతున్నాం. కృష్ణ ప్రసాద్ .మీ పార్టీ నాయకులే నీ వ్యక్తిగత వీడియోలు నాకు పంపారు నేను అలాంటి వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్లానని చెప్పాను. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ఒక పక్క చేయాల్సిన కుట్రలు చేయిస్తూ మరో పక్క రాజీలంటూ మా వాళ్లనే నా దగ్గరకు పంపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇంత దిగజారిపోతారా అంటూ ప్రశ్నించారు. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడం, చదివించడం, పెళ్లిచేయడం మా బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగానే నా కుమారుడికి పెళ్లి జరిపించాం.రాజీవ్, మేఘనలకు ఘనంగా పెళ్లి చేశాం.వారిద్దరి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. పిల్లలు కలిసి ఉండాలని కోరుకుంటామే తప్ప విడిపోవాలని కోరుకోము. కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 8-6-2026న విడాకుల కోసం నా కుమారుడు పిటిషన్ వేశాడు. 24-7-2026న మా కుటుంబం మీద మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజీవ్,మేఘనల మధ్య పొరపచ్చాలు వచ్చుండొచ్చు.కానీ నేను నా భార్య మేఘనను కన్నకూతిరి మాదిరి చూసుకున్నాం. విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మేఘన మా కుటుంబంలోని 11 మంది పై ఫిర్యాదు చేసింది.కోర్టు పరిధిలో ఉన్న అంశాల పై ఎక్కువ మాట్లాడలేను.నెలరోజులుగా మా కుటుంబాన్ని మానసికంగా చంపేసేలా కథనాలు ప్రసారం చేశారు.కొన్ని ఛానల్స్ నాకుటుంబం పై వార్తలు వేసి వ్యాపారం చేసుకున్నాయి.
    1
    సంచలన వీడియోను విడుదల చేసిన మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్

నెలరోజులుగా నేను, నా కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురయ్యాం అని మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్
ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ సంచలన వీడియోను విడుదల చేశారు.ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్క వీడియోనే బయటపెడుతున్నాం. కేసు కోర్టు పరిధిలో ఉండటం వలన ఒక్క వీడియోనే బయటపెడుతున్నాం. కృష్ణ ప్రసాద్ .మీ పార్టీ నాయకులే నీ వ్యక్తిగత వీడియోలు నాకు పంపారు నేను అలాంటి వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్లానని చెప్పాను.
ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ఒక పక్క చేయాల్సిన కుట్రలు చేయిస్తూ మరో పక్క రాజీలంటూ మా వాళ్లనే నా దగ్గరకు పంపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇంత దిగజారిపోతారా అంటూ ప్రశ్నించారు.
తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడం, చదివించడం, పెళ్లిచేయడం మా బాధ్యత.
ఈ బాధ్యతలో భాగంగానే నా కుమారుడికి పెళ్లి జరిపించాం.రాజీవ్, మేఘనలకు ఘనంగా పెళ్లి చేశాం.వారిద్దరి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి.
పిల్లలు కలిసి ఉండాలని కోరుకుంటామే తప్ప విడిపోవాలని కోరుకోము.
కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
8-6-2026న విడాకుల కోసం నా కుమారుడు పిటిషన్ వేశాడు.
24-7-2026న మా కుటుంబం మీద మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాజీవ్,మేఘనల మధ్య పొరపచ్చాలు వచ్చుండొచ్చు.కానీ నేను నా భార్య మేఘనను కన్నకూతిరి మాదిరి చూసుకున్నాం. విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మేఘన మా కుటుంబంలోని 11 మంది పై ఫిర్యాదు చేసింది.కోర్టు పరిధిలో ఉన్న అంశాల పై ఎక్కువ మాట్లాడలేను.నెలరోజులుగా మా కుటుంబాన్ని మానసికంగా చంపేసేలా కథనాలు ప్రసారం చేశారు.కొన్ని ఛానల్స్ నాకుటుంబం పై వార్తలు వేసి వ్యాపారం చేసుకున్నాయి.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • వరుడు జావీద్ వధువు అఫ్రిన్ మ్యారేజ్ 💥పెళ్ళి రిసెప్షన్🎉 ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం vm. బంజర్ గ్రామం.సప్తపది కల్యాణ మండపం నందు ఈ రోజు షేక్ జావీద్ వెడ్స్ అఫ్రిన్ గార్లు పెళ్ళి రిసెప్షన్.. బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అభిమానులు కుటుంబీకులు ప్రజలు ఆత్మీయులు ప్రజలు మధ్య గ్రాండ్ గా వీరి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమం గొప్పగా జరిగింది.✍️
    4
    వరుడు జావీద్ వధువు అఫ్రిన్ మ్యారేజ్ 💥పెళ్ళి రిసెప్షన్🎉
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం vm. బంజర్ గ్రామం.సప్తపది కల్యాణ మండపం నందు ఈ రోజు షేక్ జావీద్ వెడ్స్ అఫ్రిన్ గార్లు పెళ్ళి రిసెప్షన్.. బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అభిమానులు కుటుంబీకులు ప్రజలు ఆత్మీయులు ప్రజలు మధ్య గ్రాండ్ గా వీరి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమం గొప్పగా జరిగింది.✍️
    user_Sudhakar kota
    Sudhakar kota
    Photographer పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.