Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లా : నాన్వెజ్ వండలేదని అడిగిన భర్తను చంపిన భార్య అరెస్ట్ రిమాండ్ కు తరలింపు సీఐ నరహరి కామారెడ్డి జిల్లా : నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ సీఐ నరహరి మీడియాకు వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం లక్ష్మిని భర్త శివాజీ నాన్వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆవేశంతో పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై లక్ష్మి దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో నిందితురాలు లక్ష్మిని రైల్వేస్టేషన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Narmala Swapna
కామారెడ్డి జిల్లా : నాన్వెజ్ వండలేదని అడిగిన భర్తను చంపిన భార్య అరెస్ట్ రిమాండ్ కు తరలింపు సీఐ నరహరి కామారెడ్డి జిల్లా : నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ సీఐ నరహరి మీడియాకు వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం లక్ష్మిని భర్త శివాజీ నాన్వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆవేశంతో పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై లక్ష్మి దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో నిందితురాలు లక్ష్మిని రైల్వేస్టేషన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా : నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ సీఐ నరహరి మీడియాకు వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం లక్ష్మిని భర్త శివాజీ నాన్వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆవేశంతో పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై లక్ష్మి దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో నిందితురాలు లక్ష్మిని రైల్వేస్టేషన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.1
- ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సుదూర ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో దరఖాస్తులు చేస్తున్నారని, పరిష్కారంలో జాప్యం వహించొద్దని తెలిపారు. ప్రతి అధికారి బాధ్యతగా దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ రోజు జరిగిన ప్రజావాణిలో ప్రజల నుండి 80 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వెల్దుర్తిలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకుడు కథల కృష్ణ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కేసీఆర్ పాలనలో అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు.1
- Post by Vishwamber Rao1
- మెదక్ జిల్లా మాసాయిపేట మండలం వ్యాప్తంగా ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పూర్తి వివరాలు కెళ్తే మండల కేంద్రంలో గ్రామ అధ్యక్షుడు దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామచావిడి వద్ద బిఆర్ఎస్ జెండా దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ జరగా ప్రధాన కూడలి వద్ద బిఆర్ఎస్ మాసాయిపేట మండల అధ్యక్షుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ చేసిన సేవలను కొనియాడుతూ మన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు సూచించారు. అలాగే చిట్టిమిల్ల నాగరాజు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధిని చూసి ఇప్పుడు కూడా ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారని ఈ ప్రభుత్వం వచ్చినంక చేసింది ఏం లేదని ఏదో చేశారు.1
- బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ "కేటీఆర్"పిలుపు మేరకు మాజీ మంత్రి "కొప్పుల ఈశ్వర్"ఆదేశానుసారం సోమవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి అనంతరం బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.మరియు అక్కడ ఉన్న స్థానికులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో,మాజీ మున్సిపల్ ఛైర్మన్ సంగి సత్తెమ్మ గారు, ధర్మపురి మండల కన్వీనర్ అయ్యోరి రాజేష్ కుమార్ , పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, నాయకులు ఓడ్నాల మల్లేశం, సంగి శేఖర్, చిలువేరి శ్యాంసుందర్, బండారి అశోక్,చుక్క రవి,బాకీ శేఖర్,గుర్రాల సుధాకర్,అనంతుల లక్ష్మణ్,ఎండీ షమీమా,తరాల కార్తీక్,జెట్టి రాజన్న, ఆనందాసు శ్రీనివాస్, స్తంభంకాడి మహేష్,నక్క రాజేందర్, మామిడి శ్రీనివాస్ ,అక్కనపెల్లి సురేందర్, చల్ల రవి,కాశెట్టి విజయ్,వేముల నరేష్, కళ్ళెం రిషిరెడ్డి,ఎండీ రావుఫ్ మొలుగూరి రాజన్న, చిపిరిశెట్టి రాజన్న, కనకుల స్వామి,మొలగూరి ప్రశాంత్,అంబటి లక్ష్మణ్,,మామిడి శివసాయి,మూటపెల్లి రాజేందర్,ఎడ్ల రాజేశం,ఎండీ అలీ, మూటపెల్లి రాహుల్, అప్పాల శివ,దుర్గం రవి, ముత్తునూరి మహేష్, కొండాపురం యశ్వంత్, చల్ల మున్నా,గడిపెల్లి నరేందర్ తదితరులు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది...1
- కామారెడ్డి జిల్లా : ఏప్రిల్ 27, 2026: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, ఈరోజు అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు వారి చేతుల మీదుగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించబడింది. దత్తత ప్రక్రియలు, చట్టపరమైన నిబంధనలు, అవసరమైన పత్రాలు మరియు కౌన్సెలింగ్‌పై పౌరులకు మార్గదర్శకత్వం అందించడం ఈ సహాయ కేంద్రం ఉద్దేశం. దత్తత కోరుకునే తల్లిదండ్రులు, కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి (DWO), జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO), శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, 99 రోజుల పాలన కార్యక్రమంలో బాలల సంక్షేమ సేవలను బలోపేతం చేయడానికి, దత్తత సేవల్లో పారదర్శకత తీసుకురావడానికి ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు.1