logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పొలంలో దాచిన రూ.5 లక్షలు.. చెదలు తినడంతో ముక్కలైన నోట్లు! 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన.. బ్యాంకు సైతం డబ్బు మార్చేందుకు నిరాకరణ రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రా పరిధిలోని నెవాయి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రైతు మంగీలాల్ మేఘ్వాల్ తన వద్ద ఉన్న రూ.5 లక్షల నగదును భద్రంగా ఉంచాలనే ఉద్దేశంతో పాలిథిన్ సంచిలో పెట్టి పొలంలో పాతిపెట్టాడు. కొంతకాలం తర్వాత డబ్బు అవసరం రావడంతో నగదు కోసం వెతికిన మంగీలాల్‌కు తాను డబ్బును ఎక్కడ పాతిపెట్టాడో గుర్తుకు రాలేదు. ఈ విషయాన్ని తన కుమారులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు 10 బీఘాల పొలాన్ని పలుచోట్ల తవ్వి వెతికినా నగదు ఆచూకీ లభించలేదు. ఇటీవల వర్షాలు కురవడంతో విత్తనాలు వేసే సమయంలో నగదు ఉన్న పాలిథిన్ సంచి అనూహ్యంగా నేలపైకి వచ్చింది. సంచిని చూసిన కుటుంబ సభ్యులు ఆనందంతో దాన్ని తెరిచి చూడగా షాక్‌కు గురయ్యారు. సంచిలోని రూ.5 లక్షల నోట్లను చెదలు పూర్తిగా తినేయడంతో అవి చిన్నచిన్న ముక్కలుగా మారిపోయాయి. నోట్లు తీవ్రంగా దెబ్బతినడంతో వాటిని మార్చుకునేందుకు బ్యాంకు అధికారులను సంప్రదించినప్పటికీ, బ్యాంకు అధికారులు కూడా నగదును మార్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. భద్రంగా దాచుకున్న రూ.5 లక్షలు.. చివరకు చెదల పాలవడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.

11 hrs ago
user_Mirza Hassan Baig
Mirza Hassan Baig
Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
11 hrs ago

పొలంలో దాచిన రూ.5 లక్షలు.. చెదలు తినడంతో ముక్కలైన నోట్లు! 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన.. బ్యాంకు సైతం డబ్బు మార్చేందుకు నిరాకరణ రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రా పరిధిలోని నెవాయి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రైతు మంగీలాల్ మేఘ్వాల్ తన వద్ద ఉన్న రూ.5 లక్షల నగదును భద్రంగా ఉంచాలనే ఉద్దేశంతో పాలిథిన్ సంచిలో పెట్టి పొలంలో పాతిపెట్టాడు. కొంతకాలం తర్వాత డబ్బు అవసరం రావడంతో నగదు కోసం వెతికిన మంగీలాల్‌కు తాను డబ్బును ఎక్కడ పాతిపెట్టాడో గుర్తుకు రాలేదు. ఈ విషయాన్ని తన కుమారులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు 10 బీఘాల పొలాన్ని పలుచోట్ల తవ్వి వెతికినా నగదు ఆచూకీ లభించలేదు. ఇటీవల వర్షాలు కురవడంతో విత్తనాలు వేసే సమయంలో నగదు ఉన్న పాలిథిన్ సంచి అనూహ్యంగా నేలపైకి వచ్చింది. సంచిని చూసిన కుటుంబ సభ్యులు ఆనందంతో దాన్ని తెరిచి చూడగా షాక్‌కు గురయ్యారు. సంచిలోని రూ.5 లక్షల నోట్లను చెదలు పూర్తిగా తినేయడంతో అవి చిన్నచిన్న ముక్కలుగా మారిపోయాయి. నోట్లు తీవ్రంగా దెబ్బతినడంతో వాటిని మార్చుకునేందుకు బ్యాంకు అధికారులను సంప్రదించినప్పటికీ, బ్యాంకు అధికారులు కూడా నగదును మార్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. భద్రంగా దాచుకున్న రూ.5 లక్షలు.. చివరకు చెదల పాలవడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.

More news from తెలంగాణ and nearby areas
  • గుంతల మయమైన నిర్మల్ టు మంచిర్యాల రోడ్డు... నిర్మల్ టు జన్నారం లక్షెట్టిపేట్ మంచిర్యాల రోడ్లు గుంతలమయం నిర్మల్ టు మంచిర్యాల వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై పడ్డ గుంతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వచ్చిపోయే వాహనదారులు అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితిలో ఉన్న రోడ్డును మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాలు అత్యంత వేగంతో వస్తున్నాయని గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు ఇకనైనా గుంతలను పూడ్చి రోడ్డు పనులను చేపట్టాలని గ్రామస్తులు కోరారు.
    1
    గుంతల మయమైన నిర్మల్ టు మంచిర్యాల రోడ్డు...
నిర్మల్ టు జన్నారం లక్షెట్టిపేట్ మంచిర్యాల రోడ్లు గుంతలమయం
నిర్మల్ టు మంచిర్యాల వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై పడ్డ గుంతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వచ్చిపోయే వాహనదారులు అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితిలో ఉన్న రోడ్డును మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాలు అత్యంత వేగంతో వస్తున్నాయని గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు ఇకనైనా గుంతలను పూడ్చి రోడ్డు పనులను చేపట్టాలని గ్రామస్తులు కోరారు.
    user_Dasari krishna murthy
    Dasari krishna murthy
    ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • ఖానాపూర్ లోని శ్రీరామ్ నగర్ లోని మహ దేవ అన్నపూర్ణ దేవాలయంలో పత జ్ఞాపకలు ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో అతి పురతమైన మహ దేవ అన్నపూర్ణ దేవాలయంలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు రాత్రి మస్కాపూర్ కళ భజన బృందంచే సాంస్కృతిక దేవుని పాటలు అల పిస్తు భక్తులను మంత్రముగ్ధులను చేశారు ఈ భక్తి కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
    1
    ఖానాపూర్  లోని శ్రీరామ్ నగర్ లోని మహ దేవ  అన్నపూర్ణ  దేవాలయంలో  పత జ్ఞాపకలు
ఖానాపూర్  మున్సిపాలిటీ పరిధిలోని  శ్రీరామ్ నగర్  లో అతి పురతమైన మహ దేవ అన్నపూర్ణ దేవాలయంలో   పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు రాత్రి  మస్కాపూర్ కళ  భజన బృందంచే  సాంస్కృతిక దేవుని పాటలు అల పిస్తు  భక్తులను మంత్రముగ్ధులను   చేశారు   ఈ భక్తి కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు  కమిటీ సభ్యులు  మరియు అధిక సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    23 hrs ago
  • మెదక్ : ఆషాఢ మాసం లో ఆర్య వైశ్య మహిళల విభాగం సభ్యుల భక్తి ర్యాలీ ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో భక్తి ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోదండరామాలయం నుంచి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు మహిళలు భారీగా ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడిబియ్యం సమర్పించారు. అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ర్యాలీ కొనసాగింది.
    2
    మెదక్ : ఆషాఢ మాసం లో ఆర్య వైశ్య మహిళల విభాగం సభ్యుల భక్తి ర్యాలీ 
ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో భక్తి ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోదండరామాలయం నుంచి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు మహిళలు భారీగా ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడిబియ్యం సమర్పించారు. అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ర్యాలీ కొనసాగింది.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
  • జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల శోభాయాత్ర జగిత్యాల : జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాకారుల ఆధ్వర్యంలో జగిత్యాల మినీ స్టేడియం నుండి పోచమ్మ వాడలో పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ మరియు సాంస్కృతిక కార్యక్రమాల పండుగ నిర్వహించారు. మినీ స్టేడియం నుండి పూజల అనంతరం ప్రారంభమైన కళాకారుల బోనాల శోభాయాత్ర ముస్తాబైన ఆడపడుచులు తమ తలపై బోనాలు, పోతురాజుల వేషధారణతో ఉగ్రరూపాలు మరియు వివిధ రూపాలతో డప్పు చప్పుళ్ళు, యువతీ యువకుల కోలాహలం, కళాకారులతో శోభాయాత్ర తదితర అంశాలతో జగిత్యాల పట్టణంలో సాగిన బోనాల జాతర ఘనంగా సాగింది.
    1
    జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల శోభాయాత్ర 
జగిత్యాల : 
జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాకారుల ఆధ్వర్యంలో జగిత్యాల మినీ స్టేడియం నుండి పోచమ్మ వాడలో పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ మరియు సాంస్కృతిక కార్యక్రమాల పండుగ నిర్వహించారు. 
మినీ స్టేడియం నుండి పూజల అనంతరం ప్రారంభమైన కళాకారుల బోనాల శోభాయాత్ర ముస్తాబైన ఆడపడుచులు తమ తలపై బోనాలు, పోతురాజుల వేషధారణతో ఉగ్రరూపాలు మరియు వివిధ రూపాలతో డప్పు చప్పుళ్ళు, యువతీ యువకుల కోలాహలం, కళాకారులతో శోభాయాత్ర తదితర అంశాలతో జగిత్యాల పట్టణంలో సాగిన బోనాల జాతర ఘనంగా సాగింది.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    32 min ago
  • సిరిసిల్లలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్లలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వెంగళ వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా సృష్టించి బిఆర్ఎస్ పార్టీపై అట్టి నేపం నెట్టాలని దురుద్దేశంతో వెంగళ వెంకటేశం హత్యకు పూనుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు కానీ సిరిసిల్లలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్ట కరమని వెంగళ వెంకటేశం హత్యలో ఎంతటి వారు ఉన్నా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పార్టీ పక్షాన పద్మశాలీల పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిరిసిల్లలో బిఆర్ఎస్ నాయకుల పట్ల కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతుండడం ప్రజలందరూ చూస్తున్నారని ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని కానీ ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
    4
    సిరిసిల్లలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వెంగళ వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా సృష్టించి బిఆర్ఎస్ పార్టీపై అట్టి నేపం నెట్టాలని దురుద్దేశంతో వెంగళ వెంకటేశం హత్యకు పూనుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు కానీ సిరిసిల్లలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్ట కరమని వెంగళ వెంకటేశం హత్యలో ఎంతటి వారు ఉన్నా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పార్టీ పక్షాన పద్మశాలీల పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిరిసిల్లలో బిఆర్ఎస్ నాయకుల పట్ల కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతుండడం ప్రజలందరూ చూస్తున్నారని ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని కానీ ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    44 min ago
  • ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
    1
    ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ 
ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • తర్లపాడులో. దోమల నివారణకు పిచికారి విధానం.. గ్రామంలో ప్రతి కాలనీలో స్ప్రే విధానంతో దోమల నిర్మూలన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఉప సర్పంచ్ నరసయ్య ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టారు గ్రామపంచాయతీ కార్మికులతో స్ప్రే పిచికారి విధానంతో డ్రైనేజీలపై పిచ్చి మొక్కలపై గడ్డి పొదలపై స్ప్రే చేయించి దోమల అని పట్టారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టారు
    1
    తర్లపాడులో. దోమల నివారణకు పిచికారి విధానం.. 
గ్రామంలో ప్రతి కాలనీలో స్ప్రే విధానంతో దోమల నిర్మూలన
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్  ఉప సర్పంచ్ నరసయ్య ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టారు గ్రామపంచాయతీ కార్మికులతో స్ప్రే పిచికారి విధానంతో డ్రైనేజీలపై పిచ్చి మొక్కలపై గడ్డి పొదలపై స్ప్రే చేయించి దోమల అని పట్టారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టారు
    user_Dasari krishna murthy
    Dasari krishna murthy
    ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల : అనంతారం గ్రామంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే  జగిత్యాల మండలం అనంతారం గ్రామంలో గాదె సంధ్య శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు. షేర్వాల్ టెక్నాలజీ తో అతి తక్కువ ఖర్చు తక్కువ సమయంలో ఇళ్లు నిర్మాణం చేపట్టడం తో పరిశీలించారు. హబ్సి పూర్ కి చెందిన యువత సతీష్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ షేర్వాల్ టెక్నాలజీ తో ఇళ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయం.
    3
    షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 
జగిత్యాల :
అనంతారం గ్రామంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే 
జగిత్యాల మండలం అనంతారం గ్రామంలో గాదె సంధ్య శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంను  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు.
షేర్వాల్ టెక్నాలజీ తో అతి తక్కువ ఖర్చు తక్కువ సమయంలో ఇళ్లు నిర్మాణం చేపట్టడం తో పరిశీలించారు.
హబ్సి పూర్ కి చెందిన యువత సతీష్ విద్యాసాగర్  ఆధ్వర్యంలో ఈ షేర్వాల్ టెక్నాలజీ తో ఇళ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయం.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    39 min ago
  • అధ్వానంగా రోడ్డు..ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు:బీజేపీ నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నుంచి రూరల్ మండలంలోని జయవరం,మల్లారం,హన్మాజీపేట గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి రోడ్డు అధ్వానంగా ఉందని బీజేపీ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు పరమేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.రోడ్డును బాగు చేయించి, అభివృద్ధి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రధాని మోదీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డును బాగు చేయించి సమస్యల పరిష్కరించాలన్నారు.
    1
    అధ్వానంగా రోడ్డు..ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు:బీజేపీ నేతలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నుంచి రూరల్ మండలంలోని జయవరం,మల్లారం,హన్మాజీపేట గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి రోడ్డు అధ్వానంగా ఉందని బీజేపీ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు పరమేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.రోడ్డును బాగు చేయించి, అభివృద్ధి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రధాని మోదీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డును బాగు చేయించి సమస్యల పరిష్కరించాలన్నారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.