తమ హక్కులు,డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టిన చెన్నారావుపేట మండల ఉద్యోగ ఉపాధ్యాయులు.... చెన్నారావుపేట మండలంలోని ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, రెవెన్యూ శాఖ ఉద్యోగులు, ఎంపీడీవో ఆఫీస్ ఉద్యోగులు అందరు కలిసి... ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ , నినాదాలు చేస్తూ మండల విద్యా వనరుల కేంద్రం నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ తీసి మండల తహసిల్దార్ గారికి మెమోరండం అందించడం జరిగింది. ఉద్యోగుల ముఖ్య సమస్యలైన పిఆర్సి రిపోర్ట్ తెప్పించి వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల పెన్షనర్ల ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని, 2004 తర్వాత నియామకం పొందిన ఉద్యోగులు లకు శాపం అయినటువంటి పెన్షన్ విధానం అయిన కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అయిన సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని, ఈ పెట్టుబడుల పెన్షన్ బ్రతకంతా టెన్షన్ ల ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్టియుటీఎస్ చెన్నారావుపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేందర్ గౌడ్ భానోతు వెంకన్న, డిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భద్రయ్య ఉమా శంకర్ గార్లు, యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పత్తి నరసింహారెడ్డి, టీవీ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు వికాస్, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు నరేందర్ శ్రీనివాస్ గురుమూర్తి , రెవెన్యూ శాఖ ఉద్యోగులు రషీద్, అంకూస్, బిక్షపతి మమత, అంజద్ ఖాన్ , రాజేందర్ సామ్రాట్ రాజు గ్రామ పాలనా అధికారులు చెన్నారావుపేట మండల విద్యాధికారి పాపమ్మ అవినాష్ లక్ష్మి పరుపాటి సుధాకర్ రెడ్డి, హరి పోలేపల్లి రవి అనిల్ మరి రాజు ప్రభాకర్ రావు తగరం యాకయ్య అజ్మీర స్వామి బోడరాజు, రత్నాసిందూర్ సుదర్శన చారి వెంకటేశ్వర్లు రాజు పరమేశ్వర్ బొమ్మెర సతీష్ సుష్మ పద్మ రజిత తదితరులు అశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

- ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.1
- వర్దన్నపేట (వరంగల్ జిల్లా): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారి (NH-563) పై వర్దన్నపేట పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు డెమో ప్రమాదాన్ని సృష్టించి, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రాథమిక సహాయంపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ACP, CI, SIలతో పాటు హైవే, R&B మరియు MVI అధికారులు పాల్గొని యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.1
- ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది1
- అసలే పేదరికం...ఆపై అమాయకత్వం...నలుగురు మహిళలను మోసం చేసింది దివ్యాంగురాలైన మాయలేడి... ఐదు కోట్ల ఆస్థి ఉందని నలుగురు మహిళలను నమ్మించి తన వెంట తిప్పుకుంది. వారి అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుని ఉడాయించింది. అడ్రస్ లేకుండా పోయిన మాయలేడి చేతిలో మోసపోయిన మహిళలు ఆవేధనతో ఆందోళన చెందుతున్నారు. తమకు జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. పేరు శైలజారెడ్డి. అసలు పేరు, అడ్రస్ ఎక్కడో స్పష్టంగా తెలియదు. దివ్యాంగురాలైన ఆమే, నలుగురు అమాయకులైన మహిళలను మోసం చేసి ధర్మపురిలో వదిలేసి పారిపోయింది. తిరుపతి రైల్వే స్టేషన్ లో మంచిర్యాలకు వెళ్ళాల్సిన మహరాష్ట్రకు చెందిన లక్ష్మి, మంచిర్యాలకు చెందిన రమాదేవిని శైలజారెడ్డి అలియాస్ మాయలేడి పరిచయం చేసుకుంది. చదువురాని ఆ ఇద్దరు మహిళలను మాయమాటలతో నమ్మించి అక్కున చేర్చుకుంది. అక్కడి నుంచి మంచిర్యాలకు వచ్చిన ఆ ముగ్గురు మరో ఇద్దరు మహిళలను కమాన్ పూర్ కు చెందిన మణెమ్మ, సిద్దిపేటకు చెందిన స్వరూపను చేరదీశారు. ఐదుగురు కలిసి గత కొద్దిరోజులుగా ప్రీ బస్ ప్రయాణంతో గుళ్ళు గోపురాలు తిరిగారు. దివ్యాంగురాలైన శైలజరెడ్డి తన తండ్రీ సుదర్శన్ రెడ్డి పేరిట బ్యాంక్ లాకర్ లో ఐదు కోట్లు ఉన్నాయని బ్యాంక్ పని అయిపోగానే నలుగురికి పది లక్షల చొప్పున క్యాష్ తోపాటు ఇళ్ళు కొనిస్తానని నమ్మించింది. అందుకు సంబందించి చెక్కుల రూపంలో 25 లక్షలు, 75 లక్షల నకిలీ చెక్కులు, బాండ్ పేపర్, బ్యాంక్ మేనేజర్ కు రాసిన లేఖ చూపించింది. చదువురాని అమాయకులైన మహిళలు నిజమే కావచ్చని నమ్మి ఆమె వెంట తిరిగారు. అటో లేదంటే కారు ఎంగేజ్ చేసుకుని తిరిగారు అందుకు కావాల్సిన ఖర్చుల కోసం నలుగురు మహిళల నుంచే వసూలు చేసింది. గత దీపావళి ముందు రెండు పెట్టెలు తీసుకొచ్చి అందులో డబ్బులు ఉన్నాయని నమ్మించి పూజలు సైతం చేయించిందట. వాటిని తెరవకుండా నలుగురు మహిళలను కావలిపెట్టేదట. ఇప్పటికే 15 మందికి ఇళ్ళు కొనిచ్చానని మీకు కూడా ఇళ్ళు కొనస్తానని నమ్మేలా తాళం చెవిల గుత్తి చూపించింది. ఇళ్ళు కావాలంటే ఖర్చుల క్రింద మనిషికి కొంత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో జల్సాలు చేసింది. అలా తిరుక్కుంటు తిరుక్కుంటు ధర్మపురికి చేరుకున్న ఐదుగురు గోదావరి తీరంలో గుడివద్ద రెండు పెట్టెలను పెట్టి ఇద్దరి అక్కడ ఉంచింది. ఒకరిని తన వెంట తీసుకుని వెళ్ళి సిరిసిల్లలో వదిలేసి పత్తాలేకుండా పారిపోయింది. ఓ రోజు గడిచినా శైలజారెడ్డి అలియాస్ మాయలేడి రాకపోయే సరికి అనుమానం వచ్చి నలుగురు మహిళలు కలిసి పెట్టెలను తెరిచిచూడగా అందులో చిత్తుకాగితాలు, తాళం చెవిల గుత్తి మాత్రమే లభించాయి. డబ్బులని, ఇళ్ళు కొనిస్తానని నమ్మించి గత 9 నెలలుగా తన వెంట తిప్పుకుని అందినకాడికి దండుకుని పారిపోయిందని ఆవేధనతో ఆందోళన చెందుతున్నారు. కుటుంబసమస్యలతో బయటకు వచ్చిన తమకు సాయం చేస్తానంటే నమ్మి ఆమెకు సేవ చేశామని అంటున్నారు మోసపోయిన మహిళలు. దివ్యాంగురాలు, పైగా మహిళ కావడంతో నమ్మి ఆమె వెంట తిరిగామని అంటున్నారు. ఇలా మోసం చేస్తుందని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. నమ్మితే నట్టేట ముంచేలా చేసిందని అంటున్నారు. హైదారాబాద్ అని మాత్రమే అని చెప్పిందని చదువురానితాము పూర్తిగా అడ్రస్ కూడా కనుక్కోలేదని చెబుతున్నారు. మోసం చేసిన మాయలేడి ఫేక్ బ్యాంక్ మేనేజర్ కు రాసిన లేటర్ లు, ఫేక్ ఫోన్ నెంబర్ అందులో పొందుపర్చింది. అక్షరజ్ఞానం లేని అమాయకులైన మహిళలను మోసం చేసిన మాయలేడి ఆచూకిలేక ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు పిర్యాదు చేసేందుకు నిరాకరించిన మహిళలు, దివ్యాంగురాలు ఇలా మోసం చేస్తుందని ఉహించలేదని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతు స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. --------2
- సాధన సురుల ఇంద్రజాల విన్యాసాలు... గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు. సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..1
- నల్గొండ నల్ల రిబ్బన్లతో రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు.. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు... తెలంగాణను పాకిస్తాన్ విభజనతో పోల్చడం దుర్మార్గ రాజకీయమని మండిపడ్డ పున్న కైలాష్ నేత.! సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కల సాకారం చేసింది... బిజెపి తెలంగాణపై విషం చిమ్ముతుంది.. అనేకమంది బలిదానాలు పోరాటాలు, త్యాగాలను అవహేళన చేస్తుంది... ఖబర్దార్ బిజెపి నాయకుల్లారా! తెలంగాణలో బిజెపి పార్టీని భూస్థాపితం చేస్తాం అంటూ హెచ్చరిక.. మహిళా బిల్లు ముసుకులో బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చలు పక్క ద్రోవ పట్టిస్తుంది... త్వరలో తెలంగాణలో బిజెపి గద్దెలు కూలుతాయని హెచ్చరిక... డిలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లేకే బీజేపీ డ్రామాలు చేస్తోందని విమర్శ... తేజస్వి సూర్య చేసిన వాక్యాలపై మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్.. కార్యక్రమంలో ఎండి ముంతాజ్ అలీ, పేరిక వెంకటేశ్వర్లు, నోముల జనార్ధన్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, వేముల గోపీనాథ్, అంబల హరీష్, పల్లా రవితేజతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.1