Shuru
Apke Nagar Ki App…
భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు నీటి విడుదల భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల యాత్ర పేరుతో విహారయాత్రలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.
Anji
భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు నీటి విడుదల భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల యాత్ర పేరుతో విహారయాత్రలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రామ్ సార్ షాపింగ్ మాల్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రధాన రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ లేని రహదారిపై ప్రమాద గంటికలు వనపర్తి (ప్రత్యేక ప్రతినిధి): వనపర్తి పట్టణంలోని జి గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు రాంస షాపింగ్ మాల్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగం మితిమీరిపోవడంతో రోడ్డు దాటే కాలినడక ప్రయాణికులు తీవ్ర తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు రోడ్డు దాటాల్సి వస్తోంది. అయితే, ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు వేగంగా రావడంతో కాలినడకన వెళ్లేవారు రోడ్డు దాటడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ పలు చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ప్రజల విజ్ఞప్తి: అధికారులు తక్షణమే స్పందించి జి గార్డెన్ – రాంస షాపింగ్ మాల్ సమీపంలో వెంటనే ప్రమాద నివారణకు స్పీడ్ బ్రేకర్లను మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు సంబంధిత మున్సిపల్, పోలీసు, మరియు రహదారుల శాఖ అధికారులను కోరుతున్నారు.1
- NGKL: బీచుపల్లి వద్ద నురగలు గక్కుతున్న కృష్ణమ్మ పరవళ్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బీచుపల్లి వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ప్రాజెక్టుల నుంచి నీటిని కిందకు విడుదల చేయడంతో నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బీచుపల్లి వంతెన వద్ద కృష్ణమ్మ పరుగులు తీస్తున్న దృశ్యాలు పర్యాటకులను, ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జలకాలాడేందుకు నదిలోకి ఎవరూ దిగవద్దని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం హెచ్చరించింది.2
- శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు అత్యాధునిక, మినిమల్లీ ఇన్వేసివ్ విధానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 41 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స అందించి, గర్భాశయాన్ని తొలగించకుండా కాపాడారు. తీవ్రమైన యోని రక్తస్రావంతో బాధపడుతున్న మహిళకు సంప్రదాయ శస్త్రచికిత్స అవసరం లేకుండా "నో సర్జరీ – నో స్కార్" విధానంలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సాంకేతికతను ఉపయోగించి రక్తస్రావాన్ని నియంత్రించారు. దీంతో గర్భాశయాన్ని తొలగించే అవసరం లేకుండా రోగి ప్రాణాలను, గర్భాశయాన్ని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ సందర్భంగా మెడికోవర్ వైద్య నిపుణులు మాట్లాడుతూ, అసాధారణమైన యోని రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఆధునిక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా అనేక గైనకాలజీ సమస్యలకు శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఈ విధానంలో శరీరంపై పెద్ద కోతలు లేకుండా, మచ్చలు లేకుండా చికిత్స అందించడంతో పాటు రోగులు తక్కువ సమయంలోనే కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వైద్యులు వివరించారు. ఈ విజయవంతమైన చికిత్సకు సంబంధించిన వివరాలను హైటెక్ సిటీలోని మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధునిక వైద్య సాంకేతికతతో మహిళల ఆరోగ్య సంరక్షణలో మెడికోవర్ అందిస్తున్న సేవలను వివరించారు.1
- ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ చౌరస్తా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వర త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్నిమాపక సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు1
- చెరువుల పరిరక్షణే లక్ష్యంగా.. శేరిలింగంపల్లిలో హైడ్రాకు భారీ మద్దతు! హైదరాబాద్‌లోని తమ్మిడికుంట చెరువు వద్ద హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలకు ప్రజా మద్దతు మరింత పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నాలకు సంఘీభావంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మేట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆక్రమణల చెర నుంచి జలవనరులను కాపాడుతూ, నగర భవిష్యత్తు కోసం హైడ్రా అడుగులు వేయడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై హైడ్రా ముద్రించే కఠిన చర్యలు నిరంతరం కొనసాగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.4
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- 10 కిలోల గంజాయినికి స్వాధీనం చేసుకున్న కొల్లేరు పోలీసులు ఒడిశా రాష్ట్రానికి చెందిన జయదేవ్ బిశ్వాస్ (23), ప్రశంజిత్ రాయ్ (22) అనే ఇద్దరు యువకులు 10 కిలోల గంజాయిని హైదరాబాద్‌కు తరలించి కొల్లూరు లేబర్ క్యాంపులో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసిన ఎస్‌ఐపీ రాంబాబు శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.1