logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వరంగల్ బట్టుపల్లి రోడ్డులో పవన్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని..... వరంగల్ బట్టుపల్లి రోడ్డులో కరీమాబాద్ కి చెందిన పవన్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు..ఆ వ్యక్తిని కాపాడడానికి పోలీస్ చేసిన కృషికి శభాష్ పోలీస్ అనాల్సిందే....

21 hrs ago
user_Chetty:Ramesh
Chetty:Ramesh
నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
21 hrs ago

వరంగల్ బట్టుపల్లి రోడ్డులో పవన్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని..... వరంగల్ బట్టుపల్లి రోడ్డులో కరీమాబాద్ కి చెందిన పవన్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు..ఆ వ్యక్తిని కాపాడడానికి పోలీస్ చేసిన కృషికి శభాష్ పోలీస్ అనాల్సిందే....

More news from తెలంగాణ and nearby areas
  • ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్:వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    1
    ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్:వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.
    3
    అశ్వారావుపేట  బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్
అశ్వారావుపేట  బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు…
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు.
విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
బైట్:
ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    23 hrs ago
  • తాత్కాలిక పారిశుధ్య సిబ్బందికి తొలి నెల జీతాల చెక్కులు.. కార్మికులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు కొత్తగా నియమించిన 8 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులకు తొలి నెల జీతాల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బుధవారం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. పారిశుధ్య సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, మలోతు దేవేందర్, తిరుపేల్లి వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు భాను ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
    1
    తాత్కాలిక పారిశుధ్య సిబ్బందికి తొలి నెల జీతాల చెక్కులు.. కార్మికులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు కొత్తగా నియమించిన 8 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులకు తొలి నెల జీతాల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బుధవారం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. పారిశుధ్య సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, మలోతు దేవేందర్, తిరుపేల్లి వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు భాను ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • వరంగల్ బట్టుపల్లి రోడ్డులో పవన్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని..... వరంగల్ బట్టుపల్లి రోడ్డులో కరీమాబాద్ కి చెందిన పవన్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు..ఆ వ్యక్తిని కాపాడడానికి పోలీస్ చేసిన కృషికి శభాష్ పోలీస్ అనాల్సిందే....
    1
    వరంగల్ బట్టుపల్లి రోడ్డులో పవన్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని.....
వరంగల్ బట్టుపల్లి రోడ్డులో కరీమాబాద్ కి చెందిన పవన్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు..ఆ వ్యక్తిని కాపాడడానికి పోలీస్ చేసిన కృషికి శభాష్ పోలీస్ అనాల్సిందే....
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.