Shuru
Apke Nagar Ki App…
NH 516 బాధితులకు పరిహారం ఇవ్వాలి: రైతు సంఘం ఎన్ హెచ్ 516 నిర్మాణంలో కాఫీ తోటలు కోల్పోయిన కాట్రగడ్డ, రొంపుల, చాపరాతిపాలెం రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. పెదవలస రైతులకు మాత్రమే పరిహారం ఇచ్చి, తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా బాధితులందరికీ పరిహారం చెల్లించకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Shyam
NH 516 బాధితులకు పరిహారం ఇవ్వాలి: రైతు సంఘం ఎన్ హెచ్ 516 నిర్మాణంలో కాఫీ తోటలు కోల్పోయిన కాట్రగడ్డ, రొంపుల, చాపరాతిపాలెం రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. పెదవలస రైతులకు మాత్రమే పరిహారం ఇచ్చి, తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా బాధితులందరికీ పరిహారం చెల్లించకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు.
More news from Alluri Sitharama Raju and nearby areas
- అల్లూరి పాడేరు జిల్లా, రాజవొమ్మంగి మండలం, కొమరాపురం గ్రామంలో అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఓ మహిళను మోసం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. లోవకుమారి అనే మహిళ వాహనం కోసం వేచి చూస్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు లిఫ్ట్ ఇచ్చారు. మార్గమధ్యలో మాటలు కలిపి, తమ వద్ద ఉన్న తాయత్తుతో కష్టాలన్నీ తీరుస్తామని ఆమెను నమ్మించారు. ఆ మాయమాటలకు లొంగిపోయిన ఆమె వద్ద నుంచి బంగారు కమ్మలను తీసుకొని నిందితులు పరారయ్యారు. కొంత సమయం తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు లబోదిబోమంది.1
- డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.1
- చాలా మంది రోగులు దంత చికిత్సలను ధరల ఆధారంగా మాత్రమే పోల్చుతారు. కానీ దంతవైద్యంలో, సత్వరమార్గాలు తరచుగా పునరావృత విధానాలు, చిగుళ్ల సమస్యలు లేదా నెలల తర్వాత విఫలమైన పనిగా మారుతాయి. నైతిక దంతవైద్యం నైతిక దంతవైద్యం ఖరీదైనది కాదు. ఇది మీ దీర్ఘకాలిక నోటి ఆరోగ్యానికి సురక్షితమైనది మరియు శాశ్వతమైనది చేయడం గురించి. ఎందుకంటే ఒకే పంటిని రెండుసార్లు సరిచేయడం దీర్ఘకాలంలో ఎప్పుడూ చౌకగా ఉండదు.1
- 'రాష్ట్రీయ సేవా సమ్మాన్' పురస్కారంతో మరింత బాధ్యత పెరిగింది విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, విజయనగరం మండలం గుంకలాం జెడ్.పి.హైస్కూలులో హెడ్ మాస్టరుగా పని చేస్తున్న వెలమల శ్రీనివాస రావు 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డు అందుకోవడంపట్ల జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హర్షం వ్యక్తం చేసి, జిల్లా పోలీసు కార్యాలయంలో వెలమల శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభిందించి, మిఠాయి తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు మాస్టరు జాతీయ పురస్కారం లభించడం అభినందనీయమన్నారు. శ్రీనివాసరావు మాస్టరు ఒక వైపు హెడ్ మాస్టరుగా విధులు నిర్వహిస్తూ, మరోవైపు వలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వ్యాఖ్యానం అందిస్తూ, ప్రజలందరికీ చేరువయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషను ఆధ్వర్యంలో ఎంపికైన ఉద్యోగులకు భారతీయ వారసత్వం సంస్కృతి గొప్పదనాన్ని వివిరిస్తూ తరగతులు నిర్వహించడం, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతో నీతి అయోగ్ ఆధ్వర్యంలోని బృందం వెలమల శ్రీనివాసరావు సేవలను జాతీయ స్థాయిలో గుర్తించి 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డును జనవరి 25న న్యూఢిల్లీలో ప్రదానం చేసిందన్నారు. ఈ అవార్డు అందుకోవడంతో శ్రీనివాసరావు మాస్టరు పై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అకాంక్షించారు. జాతీయ పురస్కారం పొందిన వెలమల శ్రీనివాసరావు ఫిబ్రవరి 3న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించి, మిఠాయిలు తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్.గోపాల నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, శ్రీనివాసరావు మాస్టరును అభినందించారు.1
- ఏపీలోని ప్రముఖ పుణ్య క్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థం సీతారామస్వామి దేవస్థానం లో లక్ష పుష్ప అర్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.1
- Post by APPARAO KONCHADA1
- 🙏🙏1
- అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు): పాడేరు మండలం చింతలవీధి గ్రామ సచివాలయం వద్ద పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. సచివాలయం ఎదుట డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వెలువడుతోంది. దీనివల్ల వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో అక్కడే నిల్వ ఉండిపోతోందని, దీనివల్ల దోమల బెడద విపరీతంగా పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, మురుగు నీటిని తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1