logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా : కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ అధ్యక్షతన కులగణన స్వీయ నమోదు విధానంపై సమగ్ర వివరణ పాల్గొన్న షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా, 26-04-2026 దేశవ్యాప్తంగా చేపట్టనున్న సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 కార్యక్రమానికి సంబంధించి స్వీయ నమోదు (Self Enumeration) ప్రక్రియపై అవగాహన కల్పించే భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదరపు కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొనీ మీడియా ప్రతినిధుల కోసం ఓరియంటేషన్ సెషన్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో కులగణన స్వీయ నమోదు విధానం, దాని ప్రాముఖ్యతపై సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పాల్గొని, జిల్లాలో తొలి వ్యక్తిగా స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. అనంతరం మీడియాతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడారు ఆయన, సెన్సస్ ప్రక్రియ దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. “నేను వ్యక్తిగతంగా నా వివరాలను సమర్పించి కులగణనలో స్వీయ నమోదు చేసుకున్నాను. ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా ముందుకు వచ్చి తమ వివరాలను నిజాయితీగా నమోదు చేయాలి. ఇది కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది అని షబ్బీర్ అలీ గారు తెలిపారు. కులగణన ద్వారా ప్రతి వర్గానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని, అందువల్ల సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం బాధ్యతగా భావించి సెన్సస్‌లో పాల్గొనాలని, స్వీయ నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్,మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, ఐరేని సందీప్, మసూద్, కాళ్ళ గణేష్, కారంగుల అశోక్ రెడ్డి, షేరు, జిల్లా అధికార యంత్రాంగం, మీడియా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
3 hrs ago

కామారెడ్డి జిల్లా : కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ అధ్యక్షతన కులగణన స్వీయ నమోదు విధానంపై సమగ్ర వివరణ పాల్గొన్న షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా, 26-04-2026 దేశవ్యాప్తంగా చేపట్టనున్న సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 కార్యక్రమానికి సంబంధించి స్వీయ నమోదు (Self Enumeration) ప్రక్రియపై అవగాహన కల్పించే భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదరపు కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొనీ మీడియా ప్రతినిధుల కోసం ఓరియంటేషన్ సెషన్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో కులగణన స్వీయ నమోదు విధానం, దాని ప్రాముఖ్యతపై సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పాల్గొని, జిల్లాలో తొలి వ్యక్తిగా స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. అనంతరం మీడియాతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడారు ఆయన, సెన్సస్ ప్రక్రియ దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. “నేను వ్యక్తిగతంగా నా వివరాలను సమర్పించి కులగణనలో స్వీయ నమోదు చేసుకున్నాను. ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా ముందుకు వచ్చి తమ వివరాలను నిజాయితీగా నమోదు చేయాలి. ఇది కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది అని షబ్బీర్ అలీ గారు తెలిపారు. కులగణన ద్వారా ప్రతి వర్గానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని, అందువల్ల సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం బాధ్యతగా భావించి సెన్సస్‌లో పాల్గొనాలని, స్వీయ నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్,మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, ఐరేని సందీప్, మసూద్, కాళ్ళ గణేష్, కారంగుల అశోక్ రెడ్డి, షేరు, జిల్లా అధికార యంత్రాంగం, మీడియా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పత్రికా ప్రకటన తేది: 26.04.2026 కామారెడ్డి జిల్లా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శతమి నాడు వాసవి మాతా జయంతి ఉత్సవాలను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సందర్బంగా వాసవి మాతా జయంతి ఉత్సవం ఆదివారం నాడు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు మధుమోహన్ జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాల అలంకరించారు. ఈ కార్యక్రమం లో వైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    పత్రికా ప్రకటన
తేది: 26.04.2026
కామారెడ్డి జిల్లా 
ఆదివారం 
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు.
జిల్లా యువజన, క్రీడల శాఖ  ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శతమి నాడు వాసవి మాతా జయంతి ఉత్సవాలను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సందర్బంగా  వాసవి మాతా జయంతి ఉత్సవం ఆదివారం నాడు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు మధుమోహన్ జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాల అలంకరించారు.
ఈ కార్యక్రమం లో వైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, జెస్సి నగేష్ డివైఎస్ఓ రమేష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వాసవి మాత చిత్రపటానికి పుష్పమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాసవి మాత గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ కార్యదర్శి బుక్ అశోక్ పట్టణ పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్ ఉత్సవా కమిటీ చైర్మన్ రాయి కంటి నాగరాజ్ మున్సిపల్ కౌన్సిలర్ తోడుపునూరి శివరామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ మాజీ కౌన్సిలర్ రాగి వనజ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడం బాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొండ శ్రీనివాస్ బిక్షపతి శ్రీనివాస్ కొత్త పద్మ తూర్పుగోదావరి సుష్మ జర్నలిస్టు రామకృష్ణ సీనియర్ జర్నలిస్టు మురళి ధర్ తదితరులు పాల్గొన్నారు.
    1
    మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, జెస్సి నగేష్ డివైఎస్ఓ రమేష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వాసవి మాత చిత్రపటానికి పుష్పమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాసవి మాత గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ కార్యదర్శి బుక్ అశోక్ పట్టణ పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్ ఉత్సవా కమిటీ చైర్మన్ రాయి కంటి నాగరాజ్ మున్సిపల్ కౌన్సిలర్ తోడుపునూరి శివరామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ మాజీ కౌన్సిలర్ రాగి వనజ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడం బాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొండ శ్రీనివాస్ బిక్షపతి
శ్రీనివాస్ కొత్త పద్మ తూర్పుగోదావరి సుష్మ జర్నలిస్టు రామకృష్ణ సీనియర్ జర్నలిస్టు మురళి ధర్ తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    7 hrs ago
  • జనగణన 2027లో భాగంగా స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కో సాగుతుందని అందుకు సంబంధించిన వివరాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందని ఈ కార్యక్రమంలో తాను పాల్గొని స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజలందరూ జనగణనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ఎంతో కీలకమని తెలిపారు. సరైన గణాంకాలు అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వ పథకాలు సమర్థ వంతంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    2
    జనగణన 2027లో భాగంగా స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కో సాగుతుందని అందుకు సంబంధించిన వివరాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందని ఈ కార్యక్రమంలో తాను పాల్గొని స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజలందరూ జనగణనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ఎంతో కీలకమని తెలిపారు.
సరైన గణాంకాలు అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వ పథకాలు సమర్థ వంతంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • ప్రజాధనం వృధాకి నిదర్శనం కోరుట్ల మున్సిపాలిటీ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచడం, పౌరులకు మెరుగైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డంపింగ్ యార్డ్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై దయనీయ స్థితికి చేరుకుంది. ఈ ప్రదేశం మురికి, చెత్త, దుర్వాసనతో నిండిపోయి చెత్త కొండను తలపిస్తోంది. అక్కడ అడుగు పెట్టడమే కష్టసాధ్యంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ కోసం ఈ డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ తన అసలు లక్ష్యాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ప్రజాధనంతో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలు కూడా ప్రస్తుతం అదే ప్రదేశంలో పాడుబడిన స్థితిలో నిరుపయోగంగా నిలిచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన వనరులను సక్రమంగా వినియోగించకపోవడం మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని పట్టణవాసులు విమర్శిస్తున్నారు.వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు, నిరుపయోగంగా ఉన్న వాహనాలను పునర్వినియోగంలోకి తీసుకురావాలని కోరుట్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    ప్రజాధనం వృధాకి నిదర్శనం కోరుట్ల మున్సిపాలిటీ
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచడం, పౌరులకు మెరుగైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డంపింగ్ యార్డ్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై దయనీయ స్థితికి చేరుకుంది.  ఈ ప్రదేశం మురికి, చెత్త, దుర్వాసనతో నిండిపోయి చెత్త కొండను తలపిస్తోంది. అక్కడ అడుగు పెట్టడమే కష్టసాధ్యంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ కోసం ఈ డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ తన అసలు లక్ష్యాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ప్రజాధనంతో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలు కూడా ప్రస్తుతం అదే ప్రదేశంలో పాడుబడిన స్థితిలో నిరుపయోగంగా నిలిచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రజల పన్నుల ద్వారా సమకూరిన వనరులను సక్రమంగా వినియోగించకపోవడం మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని పట్టణవాసులు విమర్శిస్తున్నారు.వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు, నిరుపయోగంగా ఉన్న వాహనాలను పునర్వినియోగంలోకి తీసుకురావాలని కోరుట్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • గన్నేరువరం మండలం మైలారం–కాసింపేట చౌరస్తా వద్ద ఆదివారం బైక్‌పై గొర్రెను తరలిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం ఖాసింపేట గ్రామానికి చెందిన సందవేని నాగరాజు గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వెనకాల ఉన్న ఒక గొర్రెను గన్నేరువరం మండలానికి ఒక ఫంక్షన్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. వీరు బెజ్జంకి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారు TS26D9283 నంబర్ గల రెడ్ కలర్ గ్లామర్ బైక్‌పై గొర్రెను తీసుకెళ్తుండగా, గన్నేరువరం వద్ద గొర్ల కాపర్లు వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒకరు పరారీలోకి వెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    గన్నేరువరం మండలం మైలారం–కాసింపేట చౌరస్తా వద్ద ఆదివారం బైక్‌పై గొర్రెను తరలిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సమాచారం ప్రకారం ఖాసింపేట గ్రామానికి చెందిన సందవేని నాగరాజు గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వెనకాల ఉన్న ఒక గొర్రెను గన్నేరువరం మండలానికి ఒక ఫంక్షన్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. వీరు బెజ్జంకి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారు TS26D9283 నంబర్ గల రెడ్ కలర్ గ్లామర్ బైక్‌పై గొర్రెను తీసుకెళ్తుండగా, గన్నేరువరం వద్ద గొర్ల కాపర్లు వెంబడించి పట్టుకున్నారు.
ఈ క్రమంలో ముగ్గురిలో ఒకరు పరారీలోకి వెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • హైద‌రాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవ‌ర్లు నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌర‌స్తాలో ఆటో డ్రైవర్ల నిరసన డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి ప‌ర్మిష‌న్ ఇవ్వొద్దంటూ నిర‌స‌న‌ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
    1
    హైద‌రాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవ‌ర్లు
నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు 
ఎంజే మార్కెట్ చౌర‌స్తాలో ఆటో డ్రైవర్ల నిరసన 
డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్
ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి ప‌ర్మిష‌న్ ఇవ్వొద్దంటూ నిర‌స‌న‌
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • కామారెడ్డి జిల్లా, 26-04-2026 కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఘనంగా నిర్వహించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు మరియు శివపార్వతుల కల్యాణ మహోత్సవం కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథిగా హాజరై నారు, కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ గారు ముందుగా వాసవి మాత ఆలయంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో భాగస్వామ్యం అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ గారు మాట్లాడుతూ, వాసవి మాత వైశ్య సమాజానికి ఆరాధ్య దైవమని, ఆమె త్యాగం, ధర్మం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైశ్యుల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా వైశ్య సమాజానికి తగిన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సమానంగా కృషి చేస్తోందని, ప్రతి సమాజానికి తమ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని షబ్బీర్ అలీ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి , ఐరేనీ సందీప్, దేవరాజ గౌడ్, గంప ప్రసాద్,దివ్య పాత, వలిపిశెట్టి లక్ష్మీ రాజ్యం, భాస్కర్. తిరుమల గౌడ్, ఐరనీ నరసయ్య, ఇంద్రసేనారెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వైశ్య సంఘాల నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి భావంతో జరిగిన ఈ వేడుకలు పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.
    1
    కామారెడ్డి జిల్లా, 26-04-2026
కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఘనంగా నిర్వహించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు మరియు శివపార్వతుల కల్యాణ మహోత్సవం కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథిగా హాజరై నారు,
కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ గారు ముందుగా వాసవి మాత ఆలయంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో భాగస్వామ్యం అయ్యారు. 
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ గారు మాట్లాడుతూ,
వాసవి మాత వైశ్య సమాజానికి ఆరాధ్య దైవమని, ఆమె త్యాగం, ధర్మం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైశ్యుల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో గర్వకారణమని అన్నారు.
ఈ నిర్ణయం ద్వారా వైశ్య సమాజానికి తగిన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సమానంగా కృషి చేస్తోందని, ప్రతి సమాజానికి తమ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని షబ్బీర్ అలీ గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి , ఐరేనీ  సందీప్, దేవరాజ గౌడ్, గంప ప్రసాద్,దివ్య పాత, వలిపిశెట్టి లక్ష్మీ రాజ్యం, భాస్కర్. తిరుమల గౌడ్, ఐరనీ నరసయ్య, ఇంద్రసేనారెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వైశ్య సంఘాల నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి భావంతో జరిగిన ఈ వేడుకలు పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.