logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అధికారుల నిర్లక్ష్యం వలన ప్రజాధనం వృధాకి నిదర్శనంగా కోరుట్ల మున్సిపాలిటీ ప్రజాధనం వృధాకి నిదర్శనం కోరుట్ల మున్సిపాలిటీ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచడం, పౌరులకు మెరుగైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డంపింగ్ యార్డ్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై దయనీయ స్థితికి చేరుకుంది. ఈ ప్రదేశం మురికి, చెత్త, దుర్వాసనతో నిండిపోయి చెత్త కొండను తలపిస్తోంది. అక్కడ అడుగు పెట్టడమే కష్టసాధ్యంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ కోసం ఈ డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ తన అసలు లక్ష్యాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ప్రజాధనంతో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలు కూడా ప్రస్తుతం అదే ప్రదేశంలో పాడుబడిన స్థితిలో నిరుపయోగంగా నిలిచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన వనరులను సక్రమంగా వినియోగించకపోవడం మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని పట్టణవాసులు విమర్శిస్తున్నారు.వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు, నిరుపయోగంగా ఉన్న వాహనాలను పునర్వినియోగంలోకి తీసుకురావాలని కోరుట్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

4 hrs ago
user_అబ్దుల్ ముసవ్విర్
అబ్దుల్ ముసవ్విర్
కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
4 hrs ago

అధికారుల నిర్లక్ష్యం వలన ప్రజాధనం వృధాకి నిదర్శనంగా కోరుట్ల మున్సిపాలిటీ ప్రజాధనం వృధాకి నిదర్శనం కోరుట్ల మున్సిపాలిటీ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచడం, పౌరులకు మెరుగైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డంపింగ్ యార్డ్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై దయనీయ స్థితికి చేరుకుంది. ఈ ప్రదేశం మురికి, చెత్త, దుర్వాసనతో నిండిపోయి చెత్త కొండను తలపిస్తోంది. అక్కడ అడుగు పెట్టడమే కష్టసాధ్యంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ కోసం ఈ డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ తన అసలు లక్ష్యాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ప్రజాధనంతో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలు కూడా ప్రస్తుతం అదే ప్రదేశంలో పాడుబడిన స్థితిలో నిరుపయోగంగా నిలిచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన వనరులను సక్రమంగా వినియోగించకపోవడం మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని పట్టణవాసులు విమర్శిస్తున్నారు.వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు, నిరుపయోగంగా ఉన్న వాహనాలను పునర్వినియోగంలోకి తీసుకురావాలని కోరుట్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • జన్నారం మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో వాసవి మాతా జయంతిని ఆర్యవైశ్య సంఘం నాయకులు నిర్వహించారు. వాసవి మాత జయంతి సందర్భంగా ఆదివారం వారు వాసవి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలందరూ కలిసి సామూహికంగా వాసవి మాత స్తోత్రాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జన్నారం పట్టణ అధ్యక్షులు జక్కు భూమేష్, సర్పంచ్ సుష్మ భూమేష్, ఒజ్జల వామన్, తదితరులు ఉన్నారు.
    1
    జన్నారం మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో వాసవి మాతా జయంతిని ఆర్యవైశ్య సంఘం నాయకులు నిర్వహించారు. వాసవి మాత జయంతి సందర్భంగా ఆదివారం వారు వాసవి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలందరూ కలిసి సామూహికంగా వాసవి మాత స్తోత్రాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జన్నారం పట్టణ అధ్యక్షులు జక్కు భూమేష్, సర్పంచ్ సుష్మ భూమేష్, ఒజ్జల వామన్, తదితరులు ఉన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • కామారెడ్డి పట్టణంలో వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం పట్టణంలోని వీక్లీ మార్కెట్ నుంచి ఏర్పాటు చేసిన శోభాయాత్రలో భక్తుల కోలాహలం మధ్య ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఆధ్యాత్మికత పట్టణంలో వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
    1
    కామారెడ్డి పట్టణంలో వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం పట్టణంలోని వీక్లీ మార్కెట్ నుంచి ఏర్పాటు చేసిన శోభాయాత్రలో భక్తుల కోలాహలం మధ్య ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఆధ్యాత్మికత పట్టణంలో వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    9 min ago
  • మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
    1
    మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి  వివాహము నేడు హైదరాబాదులో  జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో
మాల సంఘం  ఆధ్వర్యంలో   గ్రామ దేవత పోచమ్మకు  బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని  మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు.  అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.  యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా  కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు రామకృష్ణాపూర్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం పై బాల్క సుమన్ స్పందించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ని విమర్శించడంలో అర్తం లేదని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీర్ ను మా రమనిషి అని వ్యాఖ్యానించడం అర్థం లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని స్పష్టం చేశారు
    1
    కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు 
రామకృష్ణాపూర్ 
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం పై బాల్క సుమన్ స్పందించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ని విమర్శించడంలో అర్తం లేదని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీర్ ను మా రమనిషి అని వ్యాఖ్యానించడం అర్థం లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని స్పష్టం చేశారు
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    36 min ago
  • ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
    1
    ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
  • *కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖానాపుర ఏరియాలో సెలున్ షాపులో పని చేసుకునే పగడాల రాము అనే నాయీబ్రాహ్మణుడి మీద త్రీటౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కేవలం తనను అన్నా అని పిలిచినందుకు పగడాల రాము మీద దాడి వేయడంమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపు కోకుండా అతడిపై రాము ఇచ్చిన పిర్యాదు అధారంగా కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.*
    1
    *కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖానాపుర ఏరియాలో సెలున్ షాపులో పని చేసుకునే పగడాల రాము అనే నాయీబ్రాహ్మణుడి మీద త్రీటౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కేవలం తనను అన్నా అని పిలిచినందుకు పగడాల రాము మీద  దాడి వేయడంమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపు కోకుండా అతడిపై రాము ఇచ్చిన పిర్యాదు అధారంగా కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.*
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • *తేదీ: 25-04-2026* *పత్రికా ప్రకటన* *కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష* కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు. "ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ "ఎమ్మెల్యే సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి.
    1
    *తేదీ: 25-04-2026*  
*పత్రికా ప్రకటన*
*కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష*  
కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి.  జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్  ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు.
"ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు.
గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు.
పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  మాట్లాడుతూ "ఎమ్మెల్యే  సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్  అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి,
కామారెడ్డి.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.