Shuru
Apke Nagar Ki App…
పలు గ్రామాలలో వరి నాట్లు పూర్తి చేసిన రైతులు, ఆదుకున్న భారీ వర్షాలు జన్నారం మండలంలోని పలు గ్రామాలలో రైతులు వరి నాట్లు పూర్తి చేశారు. మండలంలోని కొత్తపేట, బంగారు తండా, హాస్టల్ తండా, తదితర గ్రామాలలో ఇటీవల కాలంలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో బావులలో భూగర్భ జలాలు పెరిగాయి. దాన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది రైతులు వారి పొలాల్లో వరినట్లు పూర్తి చేశారు. అదే సమయంలో భారీ వర్షాలు పడడంతో చెరువులు కూడా నిండాయి. భారీ వర్షాలు వరి పంటకు మేలు చేశాయని ఆయా గ్రామాల రైతులు తెలిపారు.
P.G. Murthy
పలు గ్రామాలలో వరి నాట్లు పూర్తి చేసిన రైతులు, ఆదుకున్న భారీ వర్షాలు జన్నారం మండలంలోని పలు గ్రామాలలో రైతులు వరి నాట్లు పూర్తి చేశారు. మండలంలోని కొత్తపేట, బంగారు తండా, హాస్టల్ తండా, తదితర గ్రామాలలో ఇటీవల కాలంలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో బావులలో భూగర్భ జలాలు పెరిగాయి. దాన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది రైతులు వారి పొలాల్లో వరినట్లు పూర్తి చేశారు. అదే సమయంలో భారీ వర్షాలు పడడంతో చెరువులు కూడా నిండాయి. భారీ వర్షాలు వరి పంటకు మేలు చేశాయని ఆయా గ్రామాల రైతులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.2
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.1
- మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు. * ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ. మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు...... ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పాలిచ్చే తల్లులకు ఉచితంగా ప్రోటీన్ పౌడర్, విటమిన్ బిళ్లలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 35వ డివిజన్ కార్పొరేటర్ సదావేణి సుజాత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, డాక్టర్ విజయ రేకులపల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లులకు 200 ప్రోటీన్ పౌడర్ బాక్సులు, రూ.50,000 విలువగల ఈఎస్‌వివై కంపెనీ విటమిన్ మాత్రలతో పాటు ప్లాస్టిక్ నివారణకు గుడ్డ సంచులను అందజేశారు. నవజాత శిశువుల సమగ్ర ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమని, ప్రతి తల్లి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ కృషిని కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మ్యాడం శివకాంత్, కార్యదర్శి బట్టు వినోద్, కోశాధికారి మేతుకు కృష్ణ చైతన్య, ఉదారంగా సహకరించిన గజవాడ రాధాకృష్ణ, గజవాడ ప్రభు, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.3
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి మంత్రి కామెంట్స్ ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి.. అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఉత్తమ్ కుమార్ కామెంట్స్ శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా ఉన్నాయి బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా ఎలా ఉంది ప్రజలు గమనించాలి జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము4
- బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. దళితుల నిరసన........... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.2