logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ లో కన్నుల పండువలా కామదహనం వేడుకలు...ఉదయం హోలీ సంబరాలు...మధ్యాహ్నం తర్వాత చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత కామదహన వేడుకలు కరీంనగర్ లో కన్నుల పండువలా నిర్వహించారు. చెడుపై మంచికి శుభ సూచకంగా పలుచోట్ల కామ దహనం నిర్వహించారు. భగత్ నగర్, భవానీ నగర్ లో ఏర్పాటు చేసి కాముని కార్పోరేటర్ సౌగాని కొమురయ్య ఆధ్వర్యంలో దహనం చేశారు. రాక్షసుడు ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతుంటే శివుడే ప్రత్యక్షమై కాముని సంహరించాడని తెలిపారు. కామిని దహనంతో ప్రజలంతా కేరింతలు కొడుతూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అంటు నినాదాలు చేశారు. కామ దహనంతో ఉదయం హోలీ పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. మధ్యాహ్నం తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడంతో మధ్యాహ్నం వరకు హోళీ పండుగ జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. చంద్రగ్రహణంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ఆలయాలను మూసివేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకొనున్నాయి.

on 2 March
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
on 2 March

కరీంనగర్ లో కన్నుల పండువలా కామదహనం వేడుకలు...ఉదయం హోలీ సంబరాలు...మధ్యాహ్నం తర్వాత చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత కామదహన వేడుకలు కరీంనగర్ లో కన్నుల పండువలా నిర్వహించారు. చెడుపై మంచికి శుభ సూచకంగా పలుచోట్ల కామ దహనం నిర్వహించారు. భగత్ నగర్, భవానీ నగర్ లో ఏర్పాటు చేసి కాముని కార్పోరేటర్ సౌగాని కొమురయ్య ఆధ్వర్యంలో దహనం చేశారు. రాక్షసుడు ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతుంటే శివుడే ప్రత్యక్షమై కాముని సంహరించాడని తెలిపారు. కామిని దహనంతో ప్రజలంతా కేరింతలు కొడుతూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అంటు నినాదాలు చేశారు. కామ దహనంతో ఉదయం హోలీ పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. మధ్యాహ్నం తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడంతో మధ్యాహ్నం వరకు హోళీ పండుగ జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. చంద్రగ్రహణంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ఆలయాలను మూసివేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకొనున్నాయి.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • హన్మకొండ జిల్లా:హన్మకొండ నగరంలోని సిబిసి చర్చ్ వద్ద నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ త్రీ నగరాల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రపంచ శాంతి, మానవాళి మనుగడ లక్ష్యంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు.
    1
    హన్మకొండ జిల్లా:హన్మకొండ నగరంలోని సిబిసి చర్చ్ వద్ద నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ త్రీ నగరాల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రపంచ శాంతి, మానవాళి మనుగడ లక్ష్యంగా జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    4 hrs ago
  • కాకతీయుల కాలం నాటి నర్సంపేట శివారు మాదన్నపేట చెరువు వేసవికాలంలోనూ నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకృతి సౌందర్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చెరువు టూరిస్టులకు ఆకర్షణగా మారుతోంది. అయితే బోటు ప్రయాణం వంటి సదుపాయాలు లేకపోవడంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టుల కోసం అభివృద్ధి పనులు చేపట్టి, బోటింగ్ ఏర్పాటు చేయాలని టూరిస్టులు కోరుతున్నారు.
    1
    కాకతీయుల కాలం నాటి నర్సంపేట శివారు మాదన్నపేట చెరువు వేసవికాలంలోనూ నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకృతి సౌందర్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చెరువు టూరిస్టులకు ఆకర్షణగా మారుతోంది. అయితే బోటు ప్రయాణం వంటి సదుపాయాలు లేకపోవడంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టుల కోసం అభివృద్ధి పనులు చేపట్టి, బోటింగ్ ఏర్పాటు చేయాలని  టూరిస్టులు కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేటలోని వైద్య కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స, సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. గడువు ముగిసిన మందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే వేరు చేసి తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన ఔషధాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాంబశివరావు, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఆసుపత్రి అధికారి డా. కిషన్, డా. ప్రవీణ్ ఇతర వైద్య సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు
    1
    వరంగల్ జిల్లా నర్సంపేటలోని వైద్య కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స, సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో పరిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. గడువు ముగిసిన మందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే వేరు చేసి తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన ఔషధాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ తనిఖీ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాంబశివరావు, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఆసుపత్రి అధికారి డా. కిషన్, డా. ప్రవీణ్  ఇతర వైద్య సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    22 hrs ago
  • bellampallii mandal akenapalli.bhuchiyapalli.@narige.rajkumar my youtube channel no sbcribe chesukondi shorts full video s vuntayi chusi anadinchandi
    5
    bellampallii mandal akenapalli.bhuchiyapalli.@narige.rajkumar my youtube channel no sbcribe chesukondi shorts full video s vuntayi chusi anadinchandi
    user_Narige Rajkumar
    Narige Rajkumar
    Actor బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.శుక్రవారం ఆలయంలో నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఒక కోడె నీరసంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన , ఆ కోడెను ఆలయంలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు.డాక్టర్ కోడె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆలయ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు.భక్తులు మొక్కుల రూపంలో తీసుకువచ్చే కోడెల ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆలయ యాజమాన్యం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కోడెలకు తగిన ఆహారం, విశ్రాంతి మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే ఆలయానికి తీసుకువచ్చే కోడెలు ఆరోగ్యంగా ఉండేలా భక్తులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.శుక్రవారం ఆలయంలో నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఒక కోడె నీరసంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన , ఆ కోడెను ఆలయంలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు.డాక్టర్ కోడె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆలయ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు.భక్తులు మొక్కుల రూపంలో తీసుకువచ్చే కోడెల ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆలయ యాజమాన్యం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుందని  తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కోడెలకు తగిన ఆహారం, విశ్రాంతి మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే ఆలయానికి తీసుకువచ్చే కోడెలు ఆరోగ్యంగా ఉండేలా భక్తులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఎస్సై వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ఇది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడేందుకు ఎంతో ఉపయోగకరమని సూచించారు.
    1
    మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఎస్సై వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ఇది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడేందుకు ఎంతో ఉపయోగకరమని సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.