హనుమాన్ మందిర్ లో దొంగతనం చేసిన దొంగ అరెస్టు రిమాండ్ బంగారం వెండి నగదు స్వాధీనం సీఐ మహేష్ వెల్లడి ఫిర్యాది శ్రీ మాణిక్యాల చంద్రశేఖర్, తండ్రి రాములు, వయస్సు సుమారు 52 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృత్తి: ప్రభుత్వ ఉద్యోగి, నివాసం: ఇంటి నం. 1-12-25/3/M, మిలిటరీ కాలనీ, మెదక్. హనుమాన్ టెంపుల్‌లో జరిగిన దొంగతనం విషయమై ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా,ccs ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి వారి టీం. దత్తు చిట్టిబాబు సిహెచ్ ప్రశాంత్ బి ప్రశాంత్ సల్మాన్ ఖాన్ మెదక్ టోన్ ci మహేష్ మరియు కానిస్టేబుల్ నిఖిల్ రెడ్డి మల్లేషము మెదక్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను మాచబోయిన మహేష్ కుమార్ (తండ్రి: పోచయ్య, వయస్సు 26 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృత్తి: సెంటరింగ్ పని, చిరునామా: తొగిట గ్రామం, హవేలీ ఘనపూర్ మండలం)గా తనను పరిచయం చేసుకొని చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. హనుమాన్ టెంపుల్‌లో దొంగిలించిన 0.54 గ్రాముల బంగారు పుస్తెల బిళ్ళలు, 1.66 గ్రాముల వెండి, రూ. 5,000 నగదు మరియు నాణేలు (మొత్తం రూ. 348) కలిపి మొత్తం రూ. 5,348 విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో చేసిన నేరాలను కూడా ఒప్పుకున్నాడు. ఇతర కేసుల వివరాలు: ఫిబ్రవరి రెండవ వారంలో: జంబికుంట, మెదక్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిలో బీరువా పగలగొట్టి రూ. 50,000 నగదు దొంగిలించగా, నిందితుడి వద్ద నుండి రూ. 20,000 స్వాధీనం చేసుకున్నారు. జనవరి 25, 2026: మిలిటరీ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిలో చొరబడి బీరువా తెరిచి బంగారు చెవి కమ్మలు, ముక్కు పోగు, కొంత వెండి దొంగిలించగా, 1.10 గ్రాముల ముక్కు పోగు, 2.30 గ్రాముల చెవి కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 7, 2026: కొలిగడ్డ, మెదక్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిలో చొరబడి 4 బంగారు రింగులు, బంగారు ముద్ద, ఒక జత చెవి కమ్మలు దొంగిలించగా, ఒక్కో గ్రాము బరువు గల 4 బంగారు రింగులు మరియు ఒక జత చెవి కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసిన వస్తువులు: 0.54 గ్రాముల బంగారు పుస్తెల బిళ్ళలు 1.66 గ్రాముల వెండి 2.30 గ్రాముల చెవి కమ్మలు 4 బంగారు రింగులు (ఒక్కోటి 1 గ్రాము) 2 గ్రాముల ఒక జత చెవి కమ్మలు

- 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులాలలో, విద్యాలయాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని, వసతి గృహాలలో మరమ్మత్తు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ గురుకులాలలో, వసతి గృహాలలో వంటగది, పారిశుధ్యం, మరమ్మత్తు పనులు చేపడుతామని, విద్యార్థులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని, రైతుల రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఓ సురేష్ , గృహ నిర్మాణ శాఖాధికారి మాణిక్యం, డిడబ్ల్యుఓ హేమ భార్గవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..1
- విద్యార్థులు విద్యతోపాటు నైపుణ్యాలు నేర్చుకోవాలి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య1
- Post by Vishwamber Rao1
- పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడానికి నిరసిస్తూ సంగారెడ్డిలోని పాత బస్టాండ్ ముందు బిజెపి ఆధ్వర్యంలో శనివారం ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, వాసు మాట్లాడుతూ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. కాంగ్రెస్ కు మహిళలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.1
- ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాయని, కేవలం టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ఆమె శుక్రవారం శామీర్పేట్ లోని విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశ నిర్మాణం అంటే కొద్దిమంది టాపర్లతో కాదని, ప్రతి బిడ్డలోని ప్రతిభను వెలికితీయడం ద్వారానే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఇక ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సతీష్ రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప నేని శివ పాల్గొన్నారు.1
- రాజా డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజు, మాజీ ఎంపీపీ నైని యాదిగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మార్కెట్ కమిటీ AMC డైరెక్టర్ వహీద్, జాకీర్‌తో పాటు గజ్వేల్ కౌన్సిలర్లు గుంటుకు లక్ష్మి శ్రీనివాస్, నక్క రాములు గౌడ్, ఎండి షకీల్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు చిన్నారులలో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి డాన్స్ కోచింగ్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత మంది పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.4
- *ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి* ........ *బడిడు పిల్లలు బడిలోనే ఉండాలి* ... *మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ* ... *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులకార్యక్రమంలో భాగంగా తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం రోజున హవేలీ ఘనపూర్ మండల పరిధి లోని....జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి* *యందు బడిబాట* *కార్యక్రమాన్ని నిర్వహించారు*. *ఈ కార్యక్రమానికి* *ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ గారు హాజరయ్యారు* . *ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ జిల్లా విద్యాధికారిని విజయ మాట్లాడుతూ* ... *బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు సకల వసతులు ఉన్నాయని , పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో లభిస్తుందని, ఇది గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశం అని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు, యువత గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని జిల్లా విద్యాధికారి విజయ కొరారు.మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మన విద్యార్థులను చదివించాలని ఆమె గ్రామస్తుల ఉద్దేశించి అన్నారుమరియు ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ మాట్లాడుతూ* *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయని వచ్చే విద్యా సంవత్సరం నాటికి మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని*, *ప్రభుత్వము కల్పించిన ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు*. *చాలామంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నారని వారికి సులభముగా చదువుకోడానికి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబులు , కరాటే , యోగా మరియు సందర్శన ప్రదేశాలకు తీసుకపోవడం* *ముఖ్యమైనటువంటి విషయాల పైన ప్రత్యేకమైన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని*, *ఇవన్నీ అవకాశాలు సద్వినియోగం చేసుకొని గ్రామీణ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు*. అనంతరం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి, బడిబాటకు సంబంధించిన కరపత్రంను విడుదల చేశారు*. ఈ కార్యక్రమంలో జిల్లా CMO అధికారి. రాజు, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శివరాజ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ ,. శశి కుమార్, ఎల్లం, రాజు, సంతోషి కుమారి, కృష్ణవేణి, విమల, గంగమణి, స్వప్న రాజేందర్ రెడ్డి, చక్రపాణి శశి కుమార్ రెడ్డి, సందీప్ కృష్ణ , త్యార్ల శ్రీనివాస్, మరియు ప్రజా ప్రతినిధులు గ్రామ యువత విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు1