జగిత్యాల జిల్లాలో CMR ధాన్యం దుర్వినియోగం కేసులో నలుగురు అరెస్ట్... మరో నలుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం చేసిన రెండు రైస్ మిల్లులకు చెందిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీస్, హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్‌లలో సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగం అయినట్లు సివిల్ సప్లైస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్థారించారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో మిల్లు యజమానులు 8 మందిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న ముక్క గంగాధర్, ముక్క గోదావరి, సామ వజ్రమ్మ, సామ మారుతిలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుని పనులు నిమగ్నమయ్యారు.
జగిత్యాల జిల్లాలో CMR ధాన్యం దుర్వినియోగం కేసులో నలుగురు అరెస్ట్... మరో నలుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం చేసిన రెండు రైస్ మిల్లులకు చెందిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీస్, హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్‌లలో సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగం అయినట్లు సివిల్ సప్లైస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్థారించారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో మిల్లు యజమానులు 8 మందిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న ముక్క గంగాధర్, ముక్క గోదావరి, సామ వజ్రమ్మ, సామ మారుతిలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుని పనులు నిమగ్నమయ్యారు.
- జగిత్యాల జిల్లాలో CMR ధాన్యం దుర్వినియోగం కేసులో నలుగురు అరెస్ట్... మరో నలుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం చేసిన రెండు రైస్ మిల్లులకు చెందిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీస్, హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్‌లలో సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగం అయినట్లు సివిల్ సప్లైస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్థారించారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో మిల్లు యజమానులు 8 మందిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న ముక్క గంగాధర్, ముక్క గోదావరి, సామ వజ్రమ్మ, సామ మారుతిలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుని పనులు నిమగ్నమయ్యారు.1
- సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మార్కండేయ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా జంధ్యాల బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలీ కులస్థులు ఆలయంలో ప్రత్యేకంగా జంధ్యా ధారణ కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జంధ్యాలను ధరించి సంప్రదాయ ఆచారాలను పాటించారు. అనంతరం శ్రీ మార్కండేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదమంత్రాల ఘోషతో, భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.4
- కరీంనగర్ ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క.. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.1
- ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.1
- బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.1
- *ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా కౌశిక హరి - లత దంపతుల ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు అత్యంత ఆప్యాయంగా జరిగాయి. వారి ముద్దుల కూతురు తన చిన్నారి తమ్ముడికి, ప్రేమానురాగాలతో తన డాడీకి రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంది. కుటుంబ బంధాల తీపిని తెలిపే ఈ మధుర క్షణాలు మీకోసం!* రక్షాబంధన్ సందర్భంగా కౌశిక హరి - లత దంపతుల ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు అత్యంత ఆప్యాయంగా జరిగాయి. వారి ముద్దుల కూతురు తన చిన్నారి తమ్ముడికి, ప్రేమానురాగాలతో తన డాడీకి రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంది. కుటుంబ బంధాల తీపిని తెలిపే ఈ మధుర క్షణాలు మీకోసం!* 💖✨ 🏵️1
- వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.1
- ధర్మపురిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు.... బ్రాహ్మణులు సామూహిక యజ్ఞోపవీత ధారణలు నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలను బ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. ధర్మపురి క్షేత్రంలోని బ్రాహ్మణులు సామూహికంగా యజ్ఞోపవీత ధారణలు కార్యక్రమాన్ని వేదమంత్రాలు మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. కలశ గణపతి పూజ... పుణ్య: వచనం... సంకల్ప పూజలు... గాయత్రి హోమం, పూర్ణాహుతి.... యజ్ఞోపవీత ధారణ ఇత్యాది కార్యక్రమాలను నిర్వహించారు. మధు శంకర్ శర్మ వేద పండితులు ఆచార్యత్వంలో అన్నపూర్ణా నిత్యాన్నదాన సత్రం యందు... బ్రాహ్మణ సంఘ భవనంలో కాసర్ల వంశీ శర్మ ... కొరిడే శేఖర్ శర్మ వేద పండితులు ఆచార్యత్వంలో జరిగిన సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాల్లో క్షేత్రంలోని బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొనీ యజ్ఞోపవీత ధారణ గావించుకున్నారు.1