దళిత క్రిస్టియన్స్ అందరూ ఎస్సీలే, మతం మారితే అసమానతలు మారవు: బోరెల్లి సురేష్(హైదరాబాద్ జిల్లా, ఓయూ ) బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ బైక్ ర్యాలీని బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా బోరెల్లి సురేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు ఐక్యంగా ఉండాలని రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వాళ్లను తిప్పి కొట్టాలంటే ఈ వర్గాలు కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో ఉన్న దళిత క్రిస్టియన్స్ అంతా ఏ మతంలోకి వెళ్లినప్పటికీ కులం అనేది వెంటాడుతూనే ఉంది అని, వారిని ఎస్సీలుగా గుర్తించాలని లేనియెడల మరో దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుదామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నూతన విద్యా వ్యవస్థ కాషాయీకరణ జరగకుండా చూడాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి మేధావిపై ఉందని భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ ఓయు ఇంచార్జ్ కల్వకుర్తి శ్రీశైలం, బిఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మొగిలిగిద్ద ప్రసాద్, చింతమల్ల శోభన్ బాబు, అరుణ్, వెంకట్, రమేష్, పురుషోత్తం, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- నాచారం కు చెందిన చెల్లా లక్ష్మీనారాయణ(72) రిటైర్డ్ ఉద్యోగి ఈరోజు ఉదయం హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వచ్చి డిపాజిట్ స్లిప్ నింపుతుండగా స్ట్రోక్ రావడంతో కిందపపడిపోయిన లక్ష్మీనారాయణ. వెంటనే బ్యాంక్ సిబ్బంది 108 కు సమాచారం ఇవ్వడంతో..108 సిబ్బంది వచ్చి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఓయూ పోలీసులు.1
- మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4
- కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్‌ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్‌లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.1
- Indiramma Indlu Meeting Protocol Issue :స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు, జిల్లా సర్పంచుల పోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ మధ్యల ప్రోటోకాల్ పై రగడ జరిగింది. బుధవారం నాడు కౌడిపల్లి రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన ఇందిరమైండ్ల పత్రాల పంపిణీ సమావేశానికి స్థానిక ఎంపీడీవో అధ్యక్షత వహిస్తూ జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ ని వేదిక నల్లంకరించాలని ప్రసంగించగానే బి ఆర్ ఎస్ నాయకులు మిగతా సర్పంచ్ వేదిక పైకి పిలవాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ బీఆర్ఎస్ నాయకుడు దుర్గా రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. సర్పంచ్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులు స్థానిక సర్పంచికి సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన ప్రభుత్వ కర్యక్రమాలు ఎలానిర్వహిస్తారని కృష్ణా గౌడ్ మండిపాటు. ఒక్కసారిగా వేడెక్కిన సమావేశం. ఇరు వర్గాల వాదనలతో సభ ప్రాంగణం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువర్గాలను శాంతింప చేసింది.ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు కౌడిపల్లి గ్రామానికి చెందిన దుర్గా రెడ్డి,సర్పంచ్ కృష్ణ గౌడ్ ని వేదిక పైకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించగా నీవు ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదాలో అడుగుతున్నావని దుర్గారెడ్డిని సర్పంచ్ కృష్ణ గౌడ్ గట్టిగా నిలదీశారు. దీంతో ఒక్కసారిగా రైతు వేదిక రస బసాగా మారింది.స్థానిక సర్పంచికి ప్రోగ్రాం గురించి ఆలస్యంగా సమాచారం అందించడం సరికాదన్నారు ఇరు వర్గాల వాదనలతో రైతు వేదిక దద్దరిల్లింది స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువురిని శాంతింప చేసింది ఇవి రాజకీయ సమావేశం కాదని సభా సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుందని అది అందరూ పాటించాలని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఆయా గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ డిఎల్ పి ఓ సాయి బాబా హౌసింగ్ డిఇ ప్రభు ఏఈ అభిషేక్ ఎస్సై అమర్ ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు4
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో బుధవారం పరిగి మండల పరిధిలోని కాలాపూర్ రాపోలు గ్రామ రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం లాక్కుంటుందని ధర్నాకు దిగడంతో దీనికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొనగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చేసేదిలేక కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి దారుర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతులకు మద్దతు తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే భూసేకరణ ఆపాలని హెచ్చరించారు1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.1
- బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు3
- కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం గృహవసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.1