నయా దందా..! ఇంధనం ను బ్లాక్ మార్కెట్ తరలించి కృతిమ కొరత..! బద్వేలు , ఏప్రిల్ 25: పట్టణం దగ్గర తొట్టిగారి పల్లె దగ్గర K.R ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ కి స్వయంగా వచ్చిన వందలాది వాహనాలకు ఇంధనం పట్టకుండా,బయట తన వారి ని పెట్టుకొని వేలాది లీటర్లు ఇంధనం ను బ్లాక్ మార్కెట్ తరలించి కృతిమ కొరత సృష్టించి , సామాన్య ప్రజలు దగ్గర లీటర్ కి 20 చొప్పున అదనంగా వసూలు చేసుకొని పెట్రోల్ బంకు యాజమాన్యానికి 10 రూపాయలు, బ్రోకర్ కి 10 రూపాయలు చొప్పున వసూలు చేసి సామాన్య ప్రజల నడ్డి విరిచి, అవసరాలను సైతం అవకాశవాదంగా మార్చుకొని ఈ దందా చేస్తున్నారు. ఇక్కడ కి వచ్చి క్యూ ఉన్న వాహనాలను సైతం పక్కన పెట్టి ఏకంగా లక్షలాది రూపాయలు ఇంధనం ను బ్రోకర్లకు చేతికి ఇచ్చి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్వయంగా యాజమాన్యమే ఇలా చేస్తుంటే ఇదేమీ అని అడిగితే నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకో అంటున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నారు. కంచె చేను మేసినట్లు గా ఉన్నది ఈ యాజమాన్య వ్యవహారం.
నయా దందా..! ఇంధనం ను బ్లాక్ మార్కెట్ తరలించి కృతిమ కొరత..! బద్వేలు , ఏప్రిల్ 25: పట్టణం దగ్గర తొట్టిగారి పల్లె దగ్గర K.R ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ కి స్వయంగా వచ్చిన వందలాది వాహనాలకు ఇంధనం పట్టకుండా,బయట తన వారి ని పెట్టుకొని వేలాది లీటర్లు ఇంధనం ను బ్లాక్ మార్కెట్ తరలించి కృతిమ కొరత సృష్టించి , సామాన్య ప్రజలు దగ్గర లీటర్ కి 20 చొప్పున అదనంగా వసూలు చేసుకొని పెట్రోల్ బంకు యాజమాన్యానికి 10 రూపాయలు, బ్రోకర్ కి 10 రూపాయలు చొప్పున వసూలు
చేసి సామాన్య ప్రజల నడ్డి విరిచి, అవసరాలను సైతం అవకాశవాదంగా మార్చుకొని ఈ దందా చేస్తున్నారు. ఇక్కడ కి వచ్చి క్యూ ఉన్న వాహనాలను సైతం పక్కన పెట్టి ఏకంగా లక్షలాది రూపాయలు ఇంధనం ను బ్రోకర్లకు చేతికి ఇచ్చి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్వయంగా యాజమాన్యమే ఇలా చేస్తుంటే ఇదేమీ అని అడిగితే నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకో అంటున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నారు. కంచె చేను మేసినట్లు గా ఉన్నది ఈ యాజమాన్య వ్యవహారం.
- ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు. బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం ప్రధాన కూడలి వద్ద ఆర్భాటంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం అలంకారప్రాయంగా మారింది. ప్రారంభించిన రోజు మాత్రమే నీరు నింపారని, మరుసటి రోజు నుంచి కుండల్లో నీరు నింపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాహం తీర్చుకోవడానికి వచ్చేవారు ఖాళీ కుండలను చూసి నిరాశతో వెను తిరుగుతున్నారు. తూతూమంత్రంగా ఏర్పాటు చేసి వదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కేంద్రంలలో ఉన్న కుండలలో నీరు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.1
- సత్యసాయి జిల్లా కదిరి కౌలేపల్లి ఫ్లై ఓవర్ పై మినీ టాటా ఏసీ ప్యాసింజర్ వాహనం ప్రమాదవశాత్తు కాళీ బూడిదయింది.1
- ప్రైవేటుకు పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల. ఏర్పేడు :- ప్రభుత్వ పాఠశాలకు చలో.... చలో.... అంటూ తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం, సౌభాగ్య విద్యాపురం బేసిక్ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా, పాఠశాలలో సరస్వతి పూజను,ఊరి మధ్యలో పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి వారి పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణయ్య గారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మీ పిల్లలను మా పాఠశాలకు పంపినట్లయితే వారి విద్యాభివృద్ధికి పూర్తి బాధ్యత వహిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రులందరూ వాస్తవాన్ని గ్రహించి తమ పిల్లలను మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయిని శాంతి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పిల్లల అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. కేవలం సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలలో మార్కులు తెప్పించడం మాత్రమే కాకుండా పిల్లల్లో బట్టి విధానాన్ని పోగొట్టి అర్థవంతమైన జ్ఞానాన్ని అందించడం,ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించడం మా ప్రభుత్వ పాఠశాల విధానమని తెలియజేశారు. అందుకొరకు TaRL, GFLN వంటి ప్రత్యేక కార్యక్రమాలను రెగ్యులర్ పాఠ్యాంశాలకు అనుబంధంగా బోధించడం జరుగుతుందని, అందువల్లనే తమ విద్యార్థులు అన్నింటి ముందున్నారని తెలిపారు. అలాగే 21వ శతాబ్దపు నైపుణ్యాలు అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు చేస్తున్న కృషిని వివరించారు.CRMT గురు ప్రసాద్ గారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పిల్లలకు దాతల సహకారంతో విద్యాసామగ్రి అందించడం జరుగుతుందని,వారి స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలని, మన ఊరి పాఠశాలకు గ్రామస్తులంతా సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. అనంతరం ఒకటి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు సవాల్ విసురుతూ ఇంగ్లీష్ స్టోరీ,పద్యాలు, రైమ్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ లాంటి ఎన్నో అంశాలను చిన్నారులు చక చక చెప్పారు.ఈ కార్యక్రమంలో సౌభాగ్య విద్యాపురం గ్రామ పెద్దలు మైరామయ్య గారు ,అయోధ్య గారు రాజుపాలెం గ్రామస్తులు నాగరాజు గారు, పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీహరి గారు, సుధాకర్ గారు, మునయ్య గారు ప్రధానోపాధ్యాయులు వి. రామకృష్ణయ్య గారు, ఉపాధ్యాయురాలు ఎం.ఎం. శాంతి గారు, సి ఆర్ ఎం టి సి. గురు ప్రసాద్ గారు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.1
- అనంతపురంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హనీ ట్రాప్ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరగాలని జిల్లా పోలీసు కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్టు సిపిఐ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు.1
- నగలు అమ్మి భర్త ఈశ్వర్ రెడ్డిని లేపేసేందుకు ప్రియుడితో కుట్ర పన్నిన భార్య శిల్పాతో పాటు కిరాయి హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కుట్ర, హత్య కేసు ను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించిన ASP, విభూకృష్ణ...1
- కర్నూలు జిల్లా నందవరం మండలం, పూలచింత గ్రామంలో ఎస్సీ కాలనీ నివాసులకు గత నెల రోజుల నుండి నీటి కొరత ఉంది అని అధికారులను కోరిన పట్టించుకునే నాధుడు లేకుండా అయిపోయిందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా అధికారులు కూడా కులవివక్షత చూపించడం ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించడం జరిగింది . వెంటనే కలెక్టర్ చొరవ తీసుకొని పంచాయతీ సెక్రెటరీను సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మా సమస్యలను పరిష్కరించకపోతే మా దళిత సంఘాలను కలుపుకొని ధర్నాలు, రాస్తారోకోలు,చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు పోతురాజు భాస్కర్, చంటి, బుజ్జన్న ,ఏలిష్, తదితరులు పాల్గొన్నారు.1
- హనీ ట్రాప్‌లో కొత్త మలుపు: రంగమ్మ ముఠాలో చీలికలు,నరేంద్ర రెడ్డి నేతృత్వంలో రెండో గ్యాంగ్ బయటపడింది 📝 ప్రత్యేక కథనం: అనంతపురం నగరాన్ని కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒకే ముఠాగా కొనసాగుతున్న రంగమ్మ గ్యాంగ్‌లో చీలికలు ఏర్పడి, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో కొత్తగా రెండో ముఠా ఏర్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, రంగమ్మ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తీయటి మాటలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను హనీ ట్రాప్‌లోకి దింపి, బెదిరింపులతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు అంచనా. ఇదే సమయంలో, రంగమ్మకు సమీపంగా ఉన్న నరేంద్ర రెడ్డి, ఇద్దరు యువతులతో కలిసి వేరుగా కొత్త ముఠా ఏర్పాటు చేసి, స్వతంత్రంగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.2
- లక్కీ డ్రాప్ అంటూ 99 కట్టండి జీప్ గెలవండి,299 కట్టండి తార్ గెలవండి అంటూ వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకుంటున్న influencer కు కౌన్సెలింగ్..1