హనీ డ్రాప్ వ్యవహారంలో ఉక్కు పాదం మోపిన పోలీసులు, మరిన్ని విషయాలు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం. హనీ ట్రాప్‌లో కొత్త మలుపు: రంగమ్మ ముఠాలో చీలికలు,నరేంద్ర రెడ్డి నేతృత్వంలో రెండో గ్యాంగ్ బయటపడింది 📝 ప్రత్యేక కథనం: అనంతపురం నగరాన్ని కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒకే ముఠాగా కొనసాగుతున్న రంగమ్మ గ్యాంగ్‌లో చీలికలు ఏర్పడి, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో కొత్తగా రెండో ముఠా ఏర్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, రంగమ్మ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తీయటి మాటలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను హనీ ట్రాప్‌లోకి దింపి, బెదిరింపులతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు అంచనా. ఇదే సమయంలో, రంగమ్మకు సమీపంగా ఉన్న నరేంద్ర రెడ్డి, ఇద్దరు యువతులతో కలిసి వేరుగా కొత్త ముఠా ఏర్పాటు చేసి, స్వతంత్రంగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
హనీ డ్రాప్ వ్యవహారంలో ఉక్కు పాదం మోపిన పోలీసులు, మరిన్ని విషయాలు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం. హనీ ట్రాప్‌లో కొత్త మలుపు: రంగమ్మ ముఠాలో చీలికలు,నరేంద్ర రెడ్డి నేతృత్వంలో రెండో గ్యాంగ్ బయటపడింది 📝 ప్రత్యేక కథనం: అనంతపురం నగరాన్ని కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒకే ముఠాగా కొనసాగుతున్న రంగమ్మ గ్యాంగ్‌లో చీలికలు ఏర్పడి, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో కొత్తగా రెండో ముఠా ఏర్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం,
రంగమ్మ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తీయటి మాటలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను హనీ ట్రాప్‌లోకి దింపి, బెదిరింపులతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు అంచనా. ఇదే సమయంలో, రంగమ్మకు సమీపంగా ఉన్న నరేంద్ర రెడ్డి, ఇద్దరు యువతులతో కలిసి వేరుగా కొత్త ముఠా ఏర్పాటు చేసి, స్వతంత్రంగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
- ఎమ్మెల్యే కీలక ఆదేశాలు1
- కల్లుకుంటలో తాగి నీటి సమస్య చాలా ఉంది కుళాయి మోటర్ చెడిపోయిందంట దాన్ని పట్టించుకునే నాధుడు ఎవరూ లేరు దాన్ని రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం1
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా లీసా బాధ్యతలు చేపట్టారు. 2028 నవంబరు 16 వరకు ఆమె చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.1
- అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.1
- బద్వేలు , ఏప్రిల్ 25: పట్టణం దగ్గర తొట్టిగారి పల్లె దగ్గర K.R ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ కి స్వయంగా వచ్చిన వందలాది వాహనాలకు ఇంధనం పట్టకుండా,బయట తన వారి ని పెట్టుకొని వేలాది లీటర్లు ఇంధనం ను బ్లాక్ మార్కెట్ తరలించి కృతిమ కొరత సృష్టించి , సామాన్య ప్రజలు దగ్గర లీటర్ కి 20 చొప్పున అదనంగా వసూలు చేసుకొని పెట్రోల్ బంకు యాజమాన్యానికి 10 రూపాయలు, బ్రోకర్ కి 10 రూపాయలు చొప్పున వసూలు చేసి సామాన్య ప్రజల నడ్డి విరిచి, అవసరాలను సైతం అవకాశవాదంగా మార్చుకొని ఈ దందా చేస్తున్నారు. ఇక్కడ కి వచ్చి క్యూ ఉన్న వాహనాలను సైతం పక్కన పెట్టి ఏకంగా లక్షలాది రూపాయలు ఇంధనం ను బ్రోకర్లకు చేతికి ఇచ్చి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్వయంగా యాజమాన్యమే ఇలా చేస్తుంటే ఇదేమీ అని అడిగితే నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకో అంటున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నారు. కంచె చేను మేసినట్లు గా ఉన్నది ఈ యాజమాన్య వ్యవహారం.2
- నగలు అమ్మి భర్త ఈశ్వర్ రెడ్డిని లేపేసేందుకు ప్రియుడితో కుట్ర పన్నిన భార్య శిల్పాతో పాటు కిరాయి హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కుట్ర, హత్య కేసు ను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించిన ASP, విభూకృష్ణ...1
- నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం ప్రధాన కూడలి వద్ద ఆర్భాటంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం అలంకారప్రాయంగా మారింది. ప్రారంభించిన రోజు మాత్రమే నీరు నింపారని, మరుసటి రోజు నుంచి కుండల్లో నీరు నింపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాహం తీర్చుకోవడానికి వచ్చేవారు ఖాళీ కుండలను చూసి నిరాశతో వెను తిరుగుతున్నారు. తూతూమంత్రంగా ఏర్పాటు చేసి వదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కేంద్రంలలో ఉన్న కుండలలో నీరు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.1
- ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు. బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.1