రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షితమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణం సాధ్యమని ఎస్పీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనదారులు తమ స్వీయ రక్షణ, కుటుంబ క్షేమం కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు గ్రామంలోని బ్లాక్ స్పాట్స్ మరియు రహదారి భద్రతా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి సమన్వయంతో పని చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీల పాత్ర కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, మహిళలు, యువతులు, బాలికలు జిల్లా షి టీమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలలు, కళాశాలలు లేదా పని చేసే ప్రదేశాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నిర్భయంగా షి టీమ్ నంబర్ 87126 56425ను సంప్రదించాలని సూచించారు. భరోసా కేంద్రం ద్వారా న్యాయ, వైద్య సహాయం మరియు మానసిక కౌన్సెలింగ్ సేవలు అందిస్తారని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబాలపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించిన ఎస్పీ, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ ఉపేందర్ చారి, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షితమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణం సాధ్యమని ఎస్పీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనదారులు తమ స్వీయ రక్షణ, కుటుంబ క్షేమం కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు గ్రామంలోని బ్లాక్
స్పాట్స్ మరియు రహదారి భద్రతా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి సమన్వయంతో పని చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీల పాత్ర కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, మహిళలు, యువతులు, బాలికలు జిల్లా షి టీమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలలు, కళాశాలలు లేదా పని చేసే ప్రదేశాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నిర్భయంగా షి టీమ్ నంబర్ 87126 56425ను సంప్రదించాలని సూచించారు. భరోసా కేంద్రం ద్వారా న్యాయ, వైద్య సహాయం మరియు మానసిక కౌన్సెలింగ్ సేవలు అందిస్తారని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబాలపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించిన ఎస్పీ, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ ఉపేందర్ చారి, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షితమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణం సాధ్యమని ఎస్పీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనదారులు తమ స్వీయ రక్షణ, కుటుంబ క్షేమం కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు గ్రామంలోని బ్లాక్ స్పాట్స్ మరియు రహదారి భద్రతా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి సమన్వయంతో పని చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీల పాత్ర కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, మహిళలు, యువతులు, బాలికలు జిల్లా షి టీమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలలు, కళాశాలలు లేదా పని చేసే ప్రదేశాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నిర్భయంగా షి టీమ్ నంబర్ 87126 56425ను సంప్రదించాలని సూచించారు. భరోసా కేంద్రం ద్వారా న్యాయ, వైద్య సహాయం మరియు మానసిక కౌన్సెలింగ్ సేవలు అందిస్తారని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబాలపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించిన ఎస్పీ, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ ఉపేందర్ చారి, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.2
- కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, కాసింపేట గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ జక్కనపల్లి శ్రీలతపై అక్రమాలకు పాల్పడుతూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల మేరకు వేటు పడింది. ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో, కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) ఎం. గీత బుధవారం ఆమెను విధుల్లో నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో తేలిన వివరాల ప్రకారం, శ్రీలత దుబాయ్ వెళ్లిన వ్యక్తికి పని కల్పించినట్లు, ఉపాధి హామీ కూలీలను సొంత పనులకు వినియోగించుకున్నట్లు గుర్తించారు. అలాగే, 100 రోజుల పని దినాలు నిండిన వారికి నిబంధనలకు విరుద్ధంగా వేరే జాబ్ కార్డుపై పనులు కల్పించడం, పనికిరాని వారికి హాజరులు వేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా, ఆమె స్వయంగా మూడు జాబ్ కార్డులను కలిగి ఉండి చట్టాన్ని ఉల్లంఘించినట్లు వెల్లడైంది. నిబంధనలను తుంగలో తొక్కి, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను శ్రీలతను సస్పెండ్ చేయడమే కాకుండా, ఆమె దుర్వినియోగం చేసిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఆర్డర్ అందిన 14 రోజుల్లో ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ అయింది. తక్షణమే ఆమె వద్ద ఉన్న సిమ్ కార్డు, రికార్డులను స్వాధీనం చేసుకోవాలని మండల ఎంపీడీవోకు జిల్లా అధికారి ఆదేశించారు.1
- కామారెడ్డి జిల్లాలోని బిబిపేట్ మండలం పరిధిలో ఉన్న తుమ్మలు బ్రిడ్జి గతంలో దానిపై నుండి వెళ్ళిన వాహనాల కారణంగా మరమ్మతులకు గురైందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి పక్కల ఏ క్షణానైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- కరీంనగర్‌లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కట్టరాంపూర్ వాసులకు శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొత్తగా నిర్మించిన రోడ్డు మధ్యలో గ్యాప్ వదలడంతో పాటు, డ్రైనేజీ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో మురుగునీరంతా రోడ్డుపైకి చేరింది. రహదారిపై మురుగునీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కట్టరాంపూర్ ప్రజలు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి, అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.2
- కరీంనగర్‌లో వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మూడు నెలల పసికందు మృతిచెందాడని ఆరోపిస్తూ, బుధవారం తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన ఎలవేని వెంకటేష్, వర్షిని దంపతుల మూడు నెలల కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండగా, మూడు రోజుల క్రితం అతడిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ పసికందును పరీక్షించిన పిల్లల వైద్యుడు చెవి చికిత్స ప్రారంభించాడు. బుధవారం బాబు పరిస్థితి విషమించి మరణించగా, తమ బిడ్డ మరణానికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. పసికందు పరిస్థితి విషమిస్తున్నట్లు తాము గమనించి, వైద్యుడికి సమాచారం ఇవ్వాలని పలుమార్లు ఆసుపత్రి సిబ్బందిని కోరినా వారు పట్టించుకోలేదని వారు వాపోయారు. అయితే, చిన్నారికి కార్డియాక్ అరెస్ట్ కావడం వల్లే మరణించాడని వైద్యుడు వివరణ ఇచ్చాడు. ఈ ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కరీంనగర్ జిల్లాలోని ఓ నర్సింగ్ హోమ్ (పిల్లల) హాస్పిటల్ లో డాక్టర్ నిర్లక్ష్యంతో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.2
- కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది, దీనితో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు, వరదనీరు చేరగా, డ్రైనేజీ కాలువలు ఉప్పొంగి పొర్లాయి. గాలివాన ప్రభావంతో కట్టరాంపూర్ ప్రాంతంలో ఒక ఇంటి ప్రహరీ గోడ కూలిపోయింది. అంతేకాకుండా, ఒక చెట్టు విరిగి కారుపై పడటంతో కారు స్వల్పంగా దెబ్బతింది. జిల్లా వ్యాప్తంగా సగటున 2.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుజురాబాద్‌లో అత్యధికంగా 5.88 సెంటీమీటర్లు, మానకొండూరులో 4.29 సెంటీమీటర్లు, కరీంనగర్‌లో 4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఈ భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జలమయం అయిన లోతట్టు ప్రాంతాలను నగర కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేటర్ అంజన్ కుమార్ సందర్శించి, నిలిచిన నీటిని తొలగించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. రోహిణి కార్తీ సమయంలో రోలు పగిలేంత తీవ్రమైన వేసవి ఎండల అనంతరం కురిసిన ఈ భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం పొందారు.3
- కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBVs), మోడల్ స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నమోదును గత ఏడాదితో పోలిస్తే కనీసం 10 శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం (04.06.2026) కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, మండల విద్యాధికారులు (MEOs), కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేస్తూ ప్రవేశాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో విద్యార్థుల నమోదు కోసం ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించేందుకు ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని, అలాగే డ్రాప్‌అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, రోజువారీ పురోగతిని సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ NV గిరి, సంబంధిత విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, మండల విద్యాధికారులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా గత సంవత్సరం దెబ్బతిన్న బ్రిడ్జిపై నీరు నిలిచిపోయింది. ఈ నీటి నిల్వ వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిబిపేట్ మండలంలో ఒక పెద్ద బ్రిడ్జిగా ఉన్న ఇది, గత సంవత్సరం నుండే శిథిలావస్థకు చేరి ఉంది. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీనికి పరిష్కారంగా, బ్రిడ్జి పక్కల బలంగా కట్టడం నిర్మించి, దానిపై చిప్స్ వేసి, రోడ్డును గట్టిగా తొక్కించి డాంబర్ రోడ్డుగా మార్చడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుందని సూచించారు. లేదంటే, వెంటనే కొత్త బ్రిడ్జిని నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా, ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1