Shuru
Apke Nagar Ki App…
సర్పంచ్ భవాని బాలకిషన్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంట నివారణ మందుల పంపిణీ గజ్వేల్ నియోజకవర్గం,ఏప్రిల్ 04 (ప్రజా ప్రతిభ): సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో శనివారం నాడు ప్రభుత్వ పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ, సిద్ధిపెట జిల్లా ఆధ్వర్యంలో " పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు గ్రామ సర్పంచ్ భవాని బాలకిషన్ ఆధ్వర్యంలో వేయటం జరిగింది.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ పాడి రైతులు ఈ గాలికుంట నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భవాని బాలకిషన్, ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్,వార్డు సభ్యులు శ్రీను,రాజు,దుర్గాప్రసాద్,మల్లేశం , వి ఎల్ ఓ భాస్కర్, గోపాల మిత్ర కిషన్ , ఓ ఎస్ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
Errolla Babu
సర్పంచ్ భవాని బాలకిషన్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంట నివారణ మందుల పంపిణీ గజ్వేల్ నియోజకవర్గం,ఏప్రిల్ 04 (ప్రజా ప్రతిభ): సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో శనివారం నాడు ప్రభుత్వ పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ, సిద్ధిపెట జిల్లా ఆధ్వర్యంలో " పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు గ్రామ సర్పంచ్ భవాని బాలకిషన్ ఆధ్వర్యంలో వేయటం జరిగింది.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ పాడి రైతులు ఈ గాలికుంట నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భవాని బాలకిషన్, ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్,వార్డు సభ్యులు శ్రీను,రాజు,దుర్గాప్రసాద్,మల్లేశం , వి ఎల్ ఓ భాస్కర్, గోపాల మిత్ర కిషన్ , ఓ ఎస్ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలకు మానవత్వం ఉన్న ప్రతిఒక్కరు సాయం చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేథో వికలాంగుల ప్రత్యేక పాఠశాల(మానసిక వికలాంగుల పాఠశాల) 36వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు, ఫిజియో థెరఫీ, స్పీచ్ థెరఫీ కేంద్రాలను, వొకేషనల్ గదులను, తయారీ వస్తువులను ఆయన పరిశీలించి మానసిక విద్యార్థులతో మాట్లాడి అభినందించారు. జన్యులోపంతో పుట్టిన పిల్లలను మనిషిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందిస్తూ ఇలాంటి పాఠశాలకు ప్రతీ ఒక్కరు తమవంతు సాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఏమీ తెలియని పిల్లలని సమాజం బాధ్యతగా ఆదుకుని మోదో జ్ణానం కల్పించాలని కోరారు. ఇలాంటి సంస్థలు దేవాలయాలని ఆయన అభివర్ణించారు. ఇలాంటి పాఠశాల అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్యే, ట్రస్టు చైర్మన్ చాడ వెంకటరెడ్డి ప్రతినిత్యం ఆలోచిస్తున్నారని కొనియాడారు. తప్పకుండా తనవంతు సహాకారం అందిస్తూనే, రాబోవు రోజుల్లో సీఎంను సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులైన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అతిథులను ట్రస్టు సభ్యులు సన్మానించి, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ సుమతి, కరీనంగర్ ఆర్డీవో మహేశ్వర్, ట్రస్టు ఫౌండర్ బి.వెంకటయ్య, ఇండస్ట్రీస్ జీఎం సాలమన్ రాజు, ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు సదానంద గౌడ్, ట్రస్టు మెంబర్ గాజుల భగవాన్, జాప వెంకటరమణారెడ్డి, అశోక్ ముఖర్జీ, సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సతీష్, ఏవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామాలలో గ్రామ సెక్రెటరీ కానీ జీపీఓ కానీ ఏ అధికారులు ఉన్నా రైతులకు పంట నీరు వదలడానికి నీరడీ పని వాళ్లు అధికారులకు భూముల సర్వేలలో కానీ గ్రామంలో ఎలాంటి అవసరాలు వచ్చినా సుంకరి పని వాళ్లు కచ్చితంగా అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రజల కామారెడ్డి జిల్లా ప్రజల రైతుల అవసరాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వంతుల వారి గ్రామ సేవకును అందరినీ కూడా మళ్లీ గ్రామాలలో ఏదైతే వంతుల వారి పని సుంకర పని చేస్తూ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకరించే సుంకర పని వారికి గతంలో ఏదైతే వంతుల వారి సిస్టం ఉండెనో అదే పద్ధతిలో మళ్లీ వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని సిఐటియుగా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది కావున కామారెడ్డి జిల్లాలోని వంతుల వారి సుంకరి పనివారు నీరడీ పనివారు అందరూ కూడా సోమవారము ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్వీర్, నేరడి సాయిలు, అనిల్, గోపి, సాయిలు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు1
- ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.1
- వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.1
- Post by Tagore1
- కరీంనగర్ జిల్లా గంగాధర లోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం సృష్టిస్తుంది. తొమ్మిదవ తరగతి విద్యార్థులపై పదవ తరగతి విద్యార్థులు దాడి చేయడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినట్లు అధికారులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడ్డ విద్యార్థుల పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రిన్సిపల్ ను, డ్యూటీలో ఉన్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ ముందు విద్యార్థులు బోరున విలపిస్తూ తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో దాడి చేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తే అనుమతించని అధికారులు, విద్యార్థులు చేతులకు కడాలు పెట్టుకుని లోనికి వస్తే ఎలా అనుమతిస్తారని పేరెంట్స్ నిలదీశారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే పిల్లలపై దాడి జరిగిందని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ తో పాటు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, తహసిల్దార్ రజిత, ఎస్సై వంశీకృష్ణ గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్ కు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల హామీతో ఆందోళన సద్దుమణిగింది.3
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి APM ప్రసాద్ సీసీ భూమయ్య, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.1