బాధిత కుటుంబానికి 2.5 లక్షల ఎల్ఓసి అందించిన వినయ్ రెడ్డి ఆర్మూర్: అబ్దుల్ షాహిద్ ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ సర్జరీ కోసం నిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి తెలపడంతో ఆయన స్పందించి సీఎం సహాయ నిధి ద్వారా జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క చొరవతో రూ. 2,50,000 ఎల్ఓసి మంజూరు కాపీ ప్రతులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్ఓసి కాపీ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంజూరు చేయించిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దామోదర్, కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ జీవన్ రెడ్డి, డైరెక్టర్ వాసు, తలారి పోచన్న తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి 2.5 లక్షల ఎల్ఓసి అందించిన వినయ్ రెడ్డి ఆర్మూర్: అబ్దుల్ షాహిద్ ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ సర్జరీ కోసం నిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి తెలపడంతో ఆయన స్పందించి సీఎం సహాయ నిధి ద్వారా జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క చొరవతో రూ. 2,50,000 ఎల్ఓసి మంజూరు కాపీ ప్రతులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్ఓసి కాపీ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంజూరు చేయించిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దామోదర్, కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ జీవన్ రెడ్డి, డైరెక్టర్ వాసు, తలారి పోచన్న తదితరులు పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిదే వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 6.30 గంటలకు అభిషేకం, బలిహరణం నిర్వహించగా, ఉదయం 10.30 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నివేదన, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళాశాసనం, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు, సంధ్య పాల్గొనగా, కళ్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్, సుష్మ సేవలు అందించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ టెంట్లు, కూలర్లు, చల్లని నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, గ్రీన్ మ్యాట్స్, అరటి తోరణాలు, మామిడి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.1
- ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం : మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చి ఏనాడూ అసెంబ్లీలో ప్రశ్నించని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తీరును నిరసిస్తూ అడ్లూరు ఎల్లారెడ్డి మాజీ వార్డు సభ్యుడు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి అలియాస్ (అబ్బు రెడ్డి ) ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్ జీవోను రద్దు చేస్తానని ప్రగల్బాలు పలికిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాట తప్పేరన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఎమ్మెల్యే కు ఎన్ని సార్లు విన్నవించిన పెడచెవిన పెడుతున్నారన్నారు . ఓట్ల కోసం ఎమ్మెల్యే తాను గెలవడానికి ఈ మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్లను రద్దు చేస్తానని కపట ప్రేమ చూపించారన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి సాక్షిగా ఎన్నికల ప్రచార సమయంలో తాను గెలిస్తే జీవో రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఏనాడు మాస్టర్ ప్లాన్, ఇండస్ట్రియల్ జోన్ రద్దు పై అసెంబ్లీలో చర్చించని ఎమ్మెల్యే తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేకు చిత్త శుద్ధి ఉంటే ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేసి జీవో అందజేయలన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఎమ్మెల్యే రైతుల పాలిట శాపంగా మారారని, ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.1
- Post by Solanke Ravi1
- రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జన్నారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాల భయంతో రైతులు వణుకుతున్నారని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను వెంటనే సేకరించాలి. తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బంది పెట్టకూడదు. రైతులకు సకాలంలో మద్దతు ధర చెల్లించాలి. పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు జి. మధుసూదన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్, పొనకల్ ఉప సర్పంచ్ అప్పల జలపతి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పవన్ యాదవ్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల రాజారావు, మాజీ మండలాధ్యక్షుడు గోలిచందు, వీరాచారి, బీజేవైఎం అధ్యక్షుడు కందుల రమేష్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.2
- హాస్పిటల్ లో ఉన్న సమస్యపై సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మిట్టింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే,డాక్టర్ల కొరతపై తన చేరణవాణి తో జిల్లా కలెక్టట్ తో మాట్లాడిన బోథ్ ఎమ్మెల్యే...అనంతరం హాసుపత్రిలో సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.బోథ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు రోజుకు ఎండలు విపరీతంగా మండుతున్నాయి ప్రజలు ఎండలో పట్ల అప్రమతంగా ఉండలి అని అన్నారు అత్యవసరం అయితే కానీ ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దు అని దేశంలోనే మన జిల్లా 10వ స్థానంలో ఉంది తీవ్రమైన ఎండల దృశ్య ప్రజలు పనులు వీలైనంత తొరగా ముగించుకొని ఇంటికి చేరుకొవాలి అని అన్నారు అదేవిధంగా బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి తోరలోనే ప్రజలకు అందుబాటులో వస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమం సూపడెంట్ రవీంద్ర ప్రసాద్, డాక్టర్లు,ఎలక్ట్రిసిటీ AE, స్థానిక సర్పంచ్ ఉన్నారు.1
- నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం వైశాఖ శుద్ధ చతుర్దశి సందర్భంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా, ఆలయం తరఫున ఈవో శరమాదేవి ఎమ్మెల్యేకి పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యేకి శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.3
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు మేడే జెండాను ఎగరవేశారు అలాగే సిపిఎం, సిఐటియు, అనుబంధ సంఘాల నాయకులు స్థానిక మార్కెట్ కమిటీ, బస్టాండ్ ల వద్ద మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకుందామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించక పోవడం సిగ్గు చేటు.. అడ్లూరు ఎల్లారెడ్డి పల్లె దావఖన ప్రారంభోత్సవం సమయంలో శిలా పాలకం పై ప్రజా ప్రతినిధిగా ఉన్న ఉప సర్పంచ్ పేరు పెట్టకపోవడం సిగ్గుచేటు అని ఉప సర్పంచ్ పయ్యావుల గంగాధర్ తెలిపారు. ఈ విషయమై తాను కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తన పేరును శిలాఫలకంపై లేకుండా చేసిన అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.1