సీజనల్ వ్యాధులపై అవగాహన .. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి నంద్యాల మండలం అయ్యలూరు మెట్టలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ శ్రీ టి. రామకృష్ణుడు మాట్లాడుతూ... సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధుల లక్షణాలు, వ్యాప్తి మరియు నివారణ చర్యల గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, డ్రమ్ములు, నీళ్ల తొట్టెలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర వాటిలో నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను నివారించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో MLHP మల్లేశ్వరి, MPHA (F) లలితమ్మ, ఆశా కార్యకర్త మల్లేశ్వరి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన .. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి నంద్యాల మండలం అయ్యలూరు మెట్టలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ శ్రీ టి. రామకృష్ణుడు మాట్లాడుతూ... సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధుల లక్షణాలు, వ్యాప్తి మరియు నివారణ చర్యల గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, డ్రమ్ములు, నీళ్ల తొట్టెలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర వాటిలో నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను నివారించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో MLHP మల్లేశ్వరి, MPHA (F) లలితమ్మ, ఆశా కార్యకర్త మల్లేశ్వరి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.1
- అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.1
- ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్స్ యు కృప సమాధానం తోడైయులను గాక1
- దేశానికి అన్నం పెట్టే రైతన్న లో ఓ ల్టేజీ కరెంటు మోటర్ కాలిపోతుంది అన్న భయం పంటకు నీళ్లు రాక రోడ్ ఎక్కిన రైతులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు గారు మన కలెక్టర్ గారు విద్యుత్ ఎస్సీ గారు అధికారులు స్పందించి మీకు వచ్చేటట్టు చూస్తాం అని హామీ ఇచ్చారు విషయం మధ్యలోనే నీళ్లు ఆపేస్తే మీకు అన్నం రైతులు ఎలా పెడతారు ఏ స్వార్థం లేని రైతు మమ్మల్ని కష్ట పెట్ట కండి మీకు అన్నం దొరకదు మీకు అన్నం పెట్టడానికి మాకు నీళ్లు ఉండని అడుగుతున్నాం పంట ఎండిపోతుంటే మా కడుపులో మంట పుడుతుంది దానిమీద తెచ్చిన అప్పుల ఆగి పోతావా ఎవరైనా అన్నం తినకుండా మానేస్తా రా రైతుల పంట పండి య కుంటే మీకు అన్నం ఎక్కడినుంచి వస్తుంది ఏడుపుతో ఆవేదనతో రైతులు తెలియ పరుస్తున్నారు తెలుగు వీరన్న బీచు పల్లి బిసన్న ఇతర రైతులు ఉన్నారు4
- మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.1
- బిఆర్ఎస్ నూతన పంచాయతీలు గిరిజనులకు అభివృద్ధి తండాలను గ్రామపంచాయతీ చేసిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే.గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి గిరిజనలతో కలిసి,పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు గురువారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా మరియు గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో గిరిజనులకు జనాభా ప్రకారం *6% శాతం ఉన్న రిజర్వేశాన్ని 10% శాతానికి పెంచి, నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి తండాల గిరిజన మహిళలతో కలిసి,బాసు హనుమంతు నాయుడు గారు పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకున్నారు. అంతక ముందు.బాసు హనుమంతు నాయుడు గారిని గిరిజన మహిళలు కేసీఆర్ గారి పాటలకు నృత్యం చేస్తూ,పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చివేసి వాటికి మహర్దశ వచ్చేలా చేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆరదేనన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను కేటాయించి, చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా కెసిఆర్ దేనని అన్నారు.గిరిజన మహిళల సంక్షేమానికి గత కెసిఆర్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశామని, ప్రభుత్వ పథకాలన్నింటినీ విధిగా వర్తింపజేశామని చెప్పారు.గిరిజన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గత కెసిఆర్ గారి హయంలో గిరిజన జీపీల్లో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడుస్తున్నా గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్నారు.గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు..గిరిజనుల హక్కులను కాపాడుతూ వారి ఆత్మగౌరవం,సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పాటుపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.కెసిఆర్ గారు గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, గిరిజనులను ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి,సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప,మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి,ప్రతాప్,రంగ నాయక్,బీచుపల్లి,చక్రీధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,బాసు గోపాల్,ఎస్.రాము నాయుడు,టీ.రవి,రాజు నాయుడు,బోయలగూడెం నాగరాజు,జాంపల్లి భరత్ సింహారెడ్డి,సోమశేఖర్ రెడ్డి,కిష్టప్ప,బాసు బొజ్జయ్య నాయుడు, వీరేష్ నాయక్, పూడూరు రఘు నాయుడు,ఒదే నాయక్,లక్ష్మారెడ్డి,రాము,పాగుంటప్ప,కరెప్ప, స్వామి,రామకృష్ణ,ఆంజనేయులు,అరవిందు,గోవిందు, రజినీబాబు,నరసింహులు నాయక్,కృష్ణ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....4
- అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం (పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు. జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు. ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.2
- అలంపూర్: జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మార్వో ప్రభాకర్ నేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా స్థానిక ఎమ్మార్వో మహనీయులైన చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయం ఆర్ ఐ లు, జిపిఓలు ,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.1