logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పొన్నూరులో కూరగాయల ధరల గందరగోళం..! . పొన్నూరులో కూరగాయల ధరల గందరగోళం..! బోర్డుపై ఒక రేటు అమ్మేది మరో రేటు పట్టించుకోని అధికారులు.. సామాన్యుడి ఆవేదన గుంటూరు జిల్లా పొన్నూరు టౌన్‌లో కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా రైతు బజార్లలో బోర్డులపై ప్రదర్శిస్తున్న ధరలు ఒకలా ఉండగా, వినియోగదారులకు అమ్ముతున్న ధరలు మరోలా ఉండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉల్లిపాయలు కిలో రూ.25 నుంచి రూ.57 వరకు, టమాటా రూ.24 నుంచి రూ.48 వరకు, బంగాళదుంప రూ.25 నుంచి రూ.47 వరకు విక్రయిస్తున్నారు. వంకాయ, బెండకాయ, క్యారెట్ వంటి కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. అయితే రైతు బజార్లలో తక్కువ ధరలకు కూరగాయలు అందిస్తున్నామని బోర్డులపై ప్రదర్శిస్తున్నప్పటికీ, వాస్తవానికి వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోర్డు మీద ఒక రేటు..చేతిలో తూకం వేసేటప్పుడు మరో రేటు అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు అధికారుల పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రైతు బజార్‌లో ధరల నియంత్రణ, నాణ్యత తనిఖీలు, తూకాల పరిశీలన వంటి అంశాలను పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక పొన్నూరు మెయిన్ రోడ్డు, బజార్ ప్రాంతాల్లోని రిటైల్ దుకాణాల్లో ధరలు రైతు బజార్ కంటే మరింత అధికంగా ఉండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు, రైతు బజార్లలో జరుగుతున్న ధరల గందరగోళంపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

2 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
01ea5939-0321-41ca-bcbc-88fc063fdbd4

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఓంకార జపం, శివ భజనలు. . అమరావతి: శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “సోమనాథ స్వాభిమాన పర్వ్ – 1000 సంవత్సరాల అచంచల విశ్వాసం” కార్యక్రమంలో భాగంగా శివాలయంలో ఓంకార జపం,శివ భజనలు,భక్తి గీతాలు చేపట్టారు. “సోమనాథ సంకల్పం” కార్యక్రమం నిర్వహించి భక్తులతో సంకల్పం చేయించారు. మహిళల భాగస్వామ్యంతో కళశ యాత్రలు చేపట్టారు
    1
    శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఓంకార జపం, శివ భజనలు.        .
అమరావతి:
శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “సోమనాథ స్వాభిమాన పర్వ్ – 1000 సంవత్సరాల అచంచల విశ్వాసం” కార్యక్రమంలో భాగంగా శివాలయంలో 
ఓంకార జపం,శివ భజనలు,భక్తి గీతాలు చేపట్టారు. “సోమనాథ సంకల్పం” కార్యక్రమం నిర్వహించి భక్తులతో సంకల్పం చేయించారు. మహిళల భాగస్వామ్యంతో కళశ యాత్రలు చేపట్టారు
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    28 min ago
  • about yesterday's double header between rcb vs mi and csk vs lsg
    1
    about yesterday's double header between rcb vs mi and csk vs lsg
    user_Jayateja
    Jayateja
    Hotel Vijayawada (Rural), Ntr•
    3 hrs ago
  • సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు
    1
    సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు 
గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour
    1
    ry the okay okay okay no problem at good time to time hi 
gh er white colour and colour
    user_Shaik Ismail
    Shaik Ismail
    శాంతమగులూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    1
    ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    user_CHARANKANTH MANDA
    CHARANKANTH MANDA
    చింతకాని, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    1
    తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.
    user_User6531
    User6531
    Librarian Koyyuru, Alluri Sitharama Raju•
    7 hrs ago
  • చేపలకు మేత వేస్తుండగా అదుపు తప్పి పడవ బోల్తా.. ఇద్దరు కూలీల దుర్మరణం పల్నాడు జిల్లా నరసరావుపేట (మండలంలోని) కాకాని సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. చేపల చెరువులో మేత వేసేందుకు పడవపై వెళ్లిన ముగ్గురు కూలీలలో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    2
    చేపలకు మేత వేస్తుండగా అదుపు తప్పి పడవ బోల్తా.. ఇద్దరు కూలీల దుర్మరణం
పల్నాడు జిల్లా
నరసరావుపేట (మండలంలోని) కాకాని సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. 
చేపల చెరువులో మేత వేసేందుకు పడవపై వెళ్లిన ముగ్గురు కూలీలలో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు.
మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.