Shuru
Apke Nagar Ki App…
రాయదుర్గంలో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఖాజీ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకొని కొనియాడారు. సామాజిక సేవా కార్యకర్త నాదే అలీ మాట్లాడుతూ యువత ఆయన చూపిన దారుల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.
PHANI JOURNALIST
రాయదుర్గంలో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఖాజీ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకొని కొనియాడారు. సామాజిక సేవా కార్యకర్త నాదే అలీ మాట్లాడుతూ యువత ఆయన చూపిన దారుల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాయదుర్గంలో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఖాజీ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకొని కొనియాడారు. సామాజిక సేవా కార్యకర్త నాదే అలీ మాట్లాడుతూ యువత ఆయన చూపిన దారుల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.1
- కళ్యాణదుర్గం పట్టణంలో T సర్కిల్ కూడలిలో ఎలుగుబంటి కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎలుగుబంటి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున T సర్కిల్ సమీపంలోని పాత బస్టాండ్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి, అక్కడి నుంచి పెట్రోల్ బంక్ వరకు ఓ వ్యక్తిని తరుముకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అడవుల్లో నీటి వనరుల కొరతతోనే ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తున్నాయి.1
- కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో తాగునీటికోసం రోడ్డు ఎక్కిన ప్రజలు! కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో తాగునీటి కోసం ఖాళీ బిందులతో రోడ్డెక్కినప్రజలు ఒకటో వార్డులో గత 15 రోజులుగా నీటికొరత తీవ్రంగా ఉందని.. అధికారులకి,కూటమి నేతలకు ఎన్నీసార్లు మోరపేట్టుకున్న పట్టించుకోవడం లేదని మహిళలు,కాలనీ వాసులు ఆగ్రహంతో మoడిపడుతున్నారు.వీరు తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.1
- ప్రజల నమ్మకమే మా బాధ్యత.. అభివృద్ధే మా లక్ష్యం 👉 అధికార పార్టీ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి - బీటెక్ రవి2
- మహానంది రోడ్డుపైన మొక్కజొన్న ఆరబోత. ప్రయాణికుల అవస్థలు కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెట్టుతున్నారు. నడిరోడ్డుపైనే మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లె సమీపంలో సగం రోడ్డుపై మొక్కజొన్న విత్తనాలు ఆరబెడుతుంటంతో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.1
- Writing కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్ జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా: శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు. ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది. అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది. చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్ జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా: శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు. ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది. అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది. చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది.2
- కార్తీకమాసం సందర్భంగా నంద్యాలలో అన్న ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం కార్తీకమాసం సందర్భంగా మంగళవారం నంద్యాలలోని శ్రీ ప్రధమ నందీశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కేదారేశ్వరి దేవి అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రారంభించారు. ప్రారంభానికి ముందు కలెక్టర్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నిర్వహించిన చండీ హోమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కనేకల్ విద్యుత్ కార్యాలయంలో మందు బాటిల్ల కలకలం.. స్థానిక ప్రజలు ఆగ్రహం కణేకల్:ప్రజలకు నిరంతరం సేవలందించాల్సిన ప్రభుత్వ విద్యుత్ కార్యాలయం మద్యం సేవించే వారికి నిలయంగా మారుతోందన్న ఆరోపణలు కణేకల్‌లో కలకలం రేపుతున్నాయి. కార్యాలయ ఆవరణలో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు కనిపిస్తుండటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేసేందుకు వస్తున్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులే ఈ వ్యవహారానికి కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కార్యాలయంలోని సహాయ ఇంజినీరు గది వెనుక భాగంలో ఉన్న మరో గదిలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా తమకు వీలున్న సమయంలో మద్యం సేవిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మద్యం సేవించిన అనంతరం ఖాళీ సీసాలను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పడవేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ప్రస్తుతం కార్యాలయానికి పూర్తిస్థాయి సహాయ ఇంజినీరు లేకపోవడం, ఇన్‌ఛార్జి అధికారి అందుబాటులో లేని సమయాల్లో ఈ వ్యవహారాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం సహాయ ఇంజినీరు గది వెనుక ఉన్న గదిలో ఒక వ్యక్తి ఉండగానే ఆ గదికి తాళం వేయడం గమనార్హమని స్థానికులు పేర్కొంటున్నారు.ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కార్యాలయాన్ని పరిశీలించి, అక్కడ పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తుల వివరాలు, విధుల నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల గౌరవాన్ని కాపాడటంతో పాటు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.దీనిపై ఇంచార్జి ఏఈ సలీం ని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి వివరణ కోరగా ఇది వరకు మా దృష్టికి రాలేదు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.1