Shuru
Apke Nagar Ki App…
ఊటుకూరు లో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి వెళ్ళు ఆమోదం లభించటం పైకొవ్వొత్తుల ర్యాలీ ఊటుకూరు లో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పార్లమెంటులో ఆంధ్రుల రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
Ravi Teja
ఊటుకూరు లో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి వెళ్ళు ఆమోదం లభించటం పైకొవ్వొత్తుల ర్యాలీ ఊటుకూరు లో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పార్లమెంటులో ఆంధ్రుల రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు , ఏప్రిల్ 04: బద్వేలు పట్టణంలో పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI), డయాసిస్ ఆఫ్ నంద్యాల - బద్వేల్ టౌన్ చర్చి నుండి ఈ ర్యాలీ ఉత్సాహంగా ప్రారంభమైంది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని, ఆయన ప్రేమను చాటిచెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగుతూ, నాలుగు రోడ్ల కూడలి మీదుగా RCM చర్చి వరకు చేరుకుంది. అక్కడ నుండి తిరిగి ర్యాలీగా బయలుదేరి ప్రారంభ స్థానమైన CSI చర్చికి చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు మరియు క్రైస్తవ పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఈ కార్యక్రమాన్ని ముగించారు. పట్టణంలోని వివిధ సంఘాల క్రైస్తవులు, యువకులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీస్తు సందేశాన్ని చాటారు.3
- *ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా సాగుతున్న కూటమి* *మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యం* *ఇంటికో మహిళా పారాశ్రామిక వేత్తను చేయడమే ప్రభుత్వ లక్ష్యం* ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం సాగుతున్నదని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో గల బయప్పగారి పల్లి సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించి రైతులకు యూరియా బస్తాలను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పంపిణి చేశారు. అనంతరం పలమనేరు ఎంపీడివో కార్యాలయం వద్దనున్న వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు 80 మందికి ఈ - సైకిళ్లను ఆయన పంపిణి చేపట్టి, స్వచ్ఛ రథన్ని ప్రారంభించారు. అదేవిధంగా 499 స్వయం సహాయక సంఘాలకు రూ. 35 కోట్ల 39 లక్షల 59 వేల బ్యాంకు లింకేజీ మరియు శ్రీ నిధి రుణాలను ఆయన పంపిణి చేశారు.. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంగించారు. ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో (ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్) వారికి అవకాశాలు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా పునాది వేశారన్నారు. రాబోయే 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో (అసెంబ్లీ మరియు పార్లమెంట్) మహిళలకు కూడా తగిన స్థానం లభించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, పాఠశాలలు మరియు సురక్షితమైన తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సూచించారు .గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మరియు అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. సుమారు ₹2,700 కోట్లతో చిత్తూరు జిల్లాలోని పడమటి నియోజకవర్గాలకు (కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లె) గండికోట రిజర్వాయర్ నుండి పైపుల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తారన్నారు . ఇక రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించామని మహిళల ఆరోగ్యం కోసం గతంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన 'దీపం' పథకాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు . ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, ప్రతి బిడ్డకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రూపాయల రుణాలను (తాకట్టు లేకుండా) అందిస్తున్నారన్నారు. ఈ-సైకిల్స్ (E-Bicycles): మహిళల కోసం రాయితీపై (సుమారు ₹10,000 సబ్సిడీ) ఈ-సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ఇంట్లోని పిల్లలు లేదా పెద్దలు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు . కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆరోగ్యం మరియు గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, సింగిల్ విండో చైర్మన్లు పెద్దబ్బ, వెంకట ముని రెడ్డి, టిడిపి నాయకులు నాగరాజు రెడ్డి, గణేష్, జగదీష్ నాయుడు, సెల్వరాజ్,రామూర్తి నాయుడు, గిరి, కవీంద్ర నాయుడు, అనిల్ మరియు పలమనేరు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ , ఎంపీడీవో కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.1
- కదిరి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. క స్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం విద్యార్థుల లో ఉన్న ప్రతిభను కనపరిచారు. ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఎస్.ఓ లక్ష్మీ , అన్నపూర్ణ , పి.ఇ.టి కోమల హాజరైయారు. కరాటే శిక్షణ పొందితే ఆత్మరక్షణతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.1
- పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.1
- అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గం: గుర్రంకొండ ఎదురెదురుగా రెండు కార్లు డి పలువురికి గాయాలు రెండు కార్లు ఎదురుగా ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి. కడప బెంగళూరు జాతీయ రహదారి లో నైఎన్ఆర్ పెట్రోల్ బంక్ వద్దా కడప నుంచి వస్తున్న కారు ఎదురుగా వచ్చి మరో కారు అతివేగంగా ఢీకొన్నాయి. కారు అతివేగంగా తగలడం వలన కార్ లో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడం వలన ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు అక్కడికి చేరుకొని గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ని పునరుద్దించి ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- Post by Bondhu Suresh1
- బద్వేలు, ఏప్రిల్ 04:వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. బద్వేలు సమీపంలో గల చెన్నంపల్లి గ్రామంలో శ్రీ ఆది చెన్నకేశవ స్వామి తిరుణాల ఉత్సవాలు భక్తి, శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన రథోత్సవం విజయవంతంగా పూర్తై, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం వివిధ పోటీ కార్యక్రమాలు ఘనంగాప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ , యువనేత రితీష్ కుమార్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ మంగా చెన్న కృష్ణ రెడ్డి , గోడి భాస్కర్ రెడ్డి , సనపరెడ్డి మనోహర్ రెడ్డి , ఎల్‌ఎస్పీ చైర్మన్ రమణారెడ్డి , ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ రంతు , యనమల సుధాకర్ , బిజీవేముల రామచంద్ర రెడ్డి , వెంగల్ రెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.3
- కదిరి మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులు విశ్వాసాన్ని తెలుపుతున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వద్ద గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయంటున్నారు. స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.1